Menu

IRAN VS AMERICA: గోడకేసి కొట్టిన బంతిలా లేచిన ఇరాన్.. మరోసారి వార్‌కు రెడీ!

Praja Dhwani Desk 3 weeks ago
iran rebuilding itself

మంటలు ఆరిపోయాయని ప్రపంచం అనుకుంది… కానీ బూడిద కింద ఇంకా అగ్ని బతికే ఉందని ఇప్పుడు ఇరాన్ చూపిస్తోంది. ఒక వైపు అమెరికా హెచ్చరికలు… మరోవైపు ఇజ్రాయెల్ దాడులు… మధ్యలో పూర్తిగా కూలిపోయిందనుకున్న ఇరాన్ సైనిక వ్యవస్థ… అయితే ఇప్పుడు ఊహించని వేగంతో మళ్లీ నిలబడుతోంది. కేవలం కోలుకోవడమే కాదు… మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తోంది. ఇదే ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త టెన్షన్‌కు కారణమవుతోంది.

✨ Quick Read

  • 6 నెలల్లో డ్రోన్ సామర్థ్యం రీబిల్డ్
  • చైనా-రష్యా సహకారంపై అనుమానాలు
  • హార్మూజ్‌లో మళ్లీ టెన్షన్ హెచ్చరిక

AI-assisted summary, newsroom reviewed

అంచనాలు తారుమారు:

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల తర్వాత ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ప్రపంచం భావించింది. ముఖ్యంగా క్షిపణి కేంద్రాలు, ఆయుధ నిల్వలు, వైమానిక వ్యవస్థలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయని వార్తలు వచ్చాయి. ఆ దెబ్బ నుంచి బయటపడటానికి ఇరాన్‌కు ఎన్నో సంవత్సరాలు పడుతాయని అంచనాలు వినిపించాయి. కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ… ఇరాన్ చాలా వేగంగా తన మిలిటరీ ఇండస్ట్రియల్ బేస్‌ను మళ్లీ నిర్మించుకుంటోంది.

ఆరు వారాల కాల్పుల విరమణ సమయాన్ని ఇరాన్ పూర్తిగా తనకు అనుకూలంగా మలుచుకుంది. బయటకు నిశ్శబ్దంగా కనిపించినా… లోపల మాత్రం యుద్ధ స్థాయిలో పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయి. ముఖ్యంగా డ్రోన్ తయారీ కేంద్రాలను తిరిగి యాక్టివ్ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో మరోసారి తలపడాల్సి వస్తే అందుకు కావాల్సిన సామర్థ్యాలను వేగంగా సిద్ధం చేస్తోంది. ఈ వేగం అమెరికా నిఘా సంస్థలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ అంచనాలకు భిన్నంగా ఇరాన్ ఆయుధ తయారీ సామర్థ్యం తిరిగి బలపడుతోందని అమెరికా వర్గాలే అంగీకరిస్తున్నాయి.

హార్మూజ్ జలసంధి మూసేస్తే ప్రపంచానికి ఎంత నష్టం?

ప్రపంచ చమురు రవాణాలో భారీ భాగం హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ మార్గంలో యుద్ధం లేదా ఆంక్షలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఇరాన్‌కు చైనా, రష్యా ఎందుకు మద్దతు ఇస్తున్నాయి?

మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని తగ్గించడం, ఇంధన ప్రయోజనాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి కారణాలతో చైనా, రష్యా ఇరాన్‌కు పరోక్ష మద్దతు ఇస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరోసారి యుద్ధం మొదలైతే ఇరాన్ నుంచి పెద్ద ముప్పు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దాడుల్లో ధ్వంసమైన క్షిపణి ప్రయోగ కేంద్రాలను అత్యవసరంగా పునర్నిర్మిస్తున్నారు. కీలక ఆయుధ వ్యవస్థలను మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం కేవలం ఆరు నెలల్లోనే ఇరాన్ తన డ్రోన్ దాడి సామర్థ్యాన్ని దాదాపు పూర్తిగా తిరిగి తెచ్చుకుంది.

ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ కూడా పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యుద్ధం ముగింపుపై ఒప్పందం కుదరకపోతే మళ్లీ భారీ దాడులు ప్రారంభిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇరాన్ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. మరోసారి దాడులు జరిగినా ఎదుర్కొనే స్థాయికి చేరుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఇరాన్ ఇంత వేగంగా పుంజుకోవడానికి మరో కీలక కారణం అంతర్జాతీయ మద్దతు. ముఖ్యంగా చైనా, రష్యా పరోక్ష సహకారం ఇరాన్‌కు పెద్ద బలంగా మారింది. యుద్ధ సమయంలో కూడా క్షిపణుల తయారీలో ఉపయోగించే కీలక విడిభాగాల సరఫరా పూర్తిగా ఆగిపోలేదు. అమెరికా ఆంక్షల ప్రభావం కొంత ఉన్నప్పటికీ… చైనా నుంచి అవసరమైన సరఫరా కొనసాగినట్టే తెలుస్తోంది. అదే ఇరాన్ పునర్నిర్మాణ వేగాన్ని పెంచింది.

కాస్త టైమ్ కావాలి:

ఇటీవలి దాడులతో కొంత నష్టం జరిగినా… ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, యాంటీ ఎయిర్ వ్యవస్థలు ఇంకా బలంగానే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఇరాన్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడం లేదు. ఇప్పటికే ఉన్న భారీ ఆయుధ సామర్థ్యాన్ని తిరిగి యాక్టివ్ చేస్తోంది. గతంలో సగం క్షిపణి లాంచర్లు మాత్రమే మిగిలాయని భావించినా… వాస్తవానికి మూడింట రెండు వంతుల లాంచర్లు సురక్షితంగా ఉన్నట్టు తాజా ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. భూమిలో చిక్కుకున్న లాంచర్లను బయటకు తీయడానికి కూడా ఇరాన్‌కు తగిన సమయం దొరికింది.

ఇరాన్‌ పారిశ్రామిక వ్యవస్థ ఎంత నాశనమైంది?

అమెరికా ప్రధానంగా వైమానిక స్థావరాలపైనే దృష్టి పెట్టడంతో… ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థ పెద్దగా దెబ్బతినలేదు. ముఖ్యంగా క్రూయిజ్ క్షిపణులు ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి హార్మూజ్ జలసంధిలో నౌకా రవాణాకు భారీ ముప్పుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దశలో ఇరాన్ రక్షణ పారిశ్రామిక వ్యవస్థ 90శాతం నాశనం అయిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కోలుకోవడానికి ఏళ్లు పడుతుందని చెప్పింది. కానీ ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా కూలిపోలేదని… ఇంకా గట్టిగానే నిలబడి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలే ఇప్పుడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ALSO READ: గల్ఫ్ దేశాలు రెండుగా చీలాయా..? యూఏఈకి సౌదీ షాక్!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *