Amirhossein Hatami : అక్కడ తల్లుల కళ్లలో నిద్ర లేదు. గదుల్లోని మౌనం గోడల్ని గుచ్చుతోంది. అక్కడి యువత భవిష్యత్తు.. తీర్పు పత్రాల కింద నలిగిపోతోంది. జనవరి 2026 నిరసనల తర్వాత ఇరాన్‌లో కనీసం 30 మంది మరణశిక్ష ముప్పులో ఉన్నారని మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి. దానికి సాక్ష్యంగానే అక్కడ ఉ*రిశిక్షలు అమలువుతున్నాయి. మహిళల హక్కుల కోసం ఈ ఏడాది జనవరిలో రోడెక్కిన నిరసనకారుల్లో 18ఏళ్లు అమిర్ హొస్సేన్ హతామీని ఉ*రితీసి చంపింది ఇరాన్ ప్రభుత్వం. గత మార్చి 20న ఇరాన్ రెజ్లర్, 19 ఏళ్ల సలేహ్ మొహమ్మదిని ఉ*రితీసి చంపిన ఘటన మరవకముందే మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఇంతకీ ఇరాన్‌లో నిరసనకు దిగడం అంత పెద్ద నేరమా? ప్రాణాలకు విలువేలేదా? ఒక దేశం తన యువతను ఉరి తాడుకి అప్పగించడం అన్యాయం కాదా?
జనవరి నిరసనల తర్వాత ఇరాన్‌లో అరెస్టుల తుఫాను మొదలైంది. వేల సంఖ్యలో ప్రజలను అదుపులోకి తీసుకున్నట్టు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఆ అరెస్టుల్లో కొంతమందిపై తీవ్రమైన అభియోగాలు మోపి, వేగవంతమైన విచారణలతో మరణశిక్షలు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విచారణ ప్రక్రియపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. విచారణకు ముందు వారాల తరబడి ఒంటరిగా నిర్బంధంలో ఉంచి, బలవంతంగా చేయని నేరాన్ని ఒప్పుకునేలా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బహిరంగ సాక్ష్యాలు లేకపోయినా తీర్పు మాత్రం అత్యంత కఠినంగా ఉంటుంది.
నిజానికి 2025లోనూ ఇరాన్ ఇలానే చేసింది. గతేడాది ఇరాన్‌లో వెయ్యికి పైగా మరణదండనలు అమలయ్యాయని మానవహక్కుల సంఘాల చెబుతున్నాయి. అంటే సగటున రోజుకు నాలుగు ఉరితాడ్లు అమాయక మెడలకు బిగుసుకున్నాయి. 1989 తర్వాత ఈ స్థాయిలో మరణదండలు అమలవడం అదేతొలిసారి. నిరసనల తర్వాత ఈ సంఖ్య పెరుగుతున్న తీరు భయాన్ని మరింతగా పెంచుతోంది.
2022లో ప్రారంభమైన విమెన్ లైఫ్ ఫ్రీడమ్ ఉద్యమం తర్వాత మరణశిక్షను భయపెట్టే సాధనంగా వాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. డ్ర*గ్స్ కేసులు, నిరసన కేసులు, రాజకీయ ఆరోపణలు అన్నీ కలిసిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్నారులకు మరణశిక్ష విధించడం పూర్తిగా నిషేధం. అయినా ఇలాంటి కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక దేశంలో కోర్టు తీర్పు భయానికి ప్రతీకగా మారితే అక్కడ స్వేచ్ఛ బలహీనమవుతుంది.
ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. హతామీతో పాటు అరెస్ట్ అయిన మరికొంతమంది కూడా ప్రస్తుతం అదే ప్రమాదంలో ఉన్నారని సమాచారం. ముందున్న రోజుల్లో మరిన్ని ఉ*రి శిక్షలు జరిగే అవకాశముందని మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అంటే ఇది పూర్తిగా కొనసాగుతున్న ప్రక్రియ. ఇలా ఒక యువకుడి జీవితం ముగిసింది, కానీ అదే దారిలో ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో అన్న అనుమానం ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. నిజానికి విచారణ ప్రక్రియ పారదర్శకంగా లేకపోతే న్యాయానికి చోటే ఉండదు. ఇక మాట్లాడితే అరెస్ట్.. ప్రశ్నిస్తే కేసు.. నిరసిస్తే ఉ*రి ముప్పు.. ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్నది ఇదే!
ALSO READ: ఆయుధాలు కొరతతో లబోదిబోమంటున్న అమెరికా-ఇజ్రాయెల్!

IRAN VS AMERICA: గోడకేసి కొట్టిన బంతిలా లేచిన ఇరాన్.. మరోసారి వార్‌కు రెడీ!
Gulf War: గల్ఫ్ దేశాలు రెండుగా చీలాయా..? యూఏఈకి సౌదీ షాక్!
Pithapuram: పిఠాపురంలో దళితులపై బలిసిన కులాల దౌర్జన్యం..! సనాతన పవనుడి కళ్లు కాకులు ఎత్తుకెళ్లాయా?
Hostel Cylinder Crisis: సిలిండర్ షార్టెజ్..! మూతపడుతున్న హాస్టల్స్.. టెన్షన్లో స్టూడెంట్స్..!
Iran war: ఇరాన్‌లో భారతీయ వైద్యుల భవిష్యత్తు ఏంటి? కలలు చెదిరినట్టేనా?
Ayatollah Khamenei: ముగిసిన శకం.. ఇరాన్ సుప్రీంలీడర్‌ను చంపిన అమెరికా..ఎవరీ ఖమేనీ?