Menu

Hostel Cylinder Crisis: సిలిండర్‌ షార్టెజ్‌..! మూతపడుతున్న హాస్టల్స్‌.. టెన్షన్‌లో స్టూడెంట్స్..!

Praja Dhwani Desk 3 months ago
cylinder crisis in teluigu

Iran-Israel War Cylinder Shorrage Updates: దోసె లేదు, పూరీ లేదు, రోటీ కూడా లేదు.. ఓన్లీ రైస్ ఐటెమ్స్! అవును..! ఇండియాలో చాలా హాస్టల్స్‌లో పరిస్థితి ఇదే. చాలా హాస్టల్స్‌లో మెనూ నుంచి దోసె పూర్తిగా మాయమైంది. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న మధ్యప్రాచ్య యుద్ధం ప్రభావం ఇప్పుడు ఇండియన్ హాస్టల్ కిచెన్స్‌ వరకు చేరింది. వంటగ్యాస్ సరఫరాలో ఆలస్యం పెరగడంతో మెస్ మెనూలు కూడా మారిపోతున్నాయి. ఇంతకీ మిడిలిస్ట్‌ వార్‌ ఇండియాలోని హాస్టల్ ఫుడ్‌ను ఎలా ఎఫెక్ట్ చేస్తోంది?

ఈ మార్పు ఒక్కో నగరంలో ఒక్కో విధంగా కనిపిస్తోంది. బెంగళూరులోని కొన్ని కాలేజీ హాస్టళ్లలో ఇప్పటికే దోసె, పూరీ వంటి ఐటెమ్స్ నిలిపివేశారు. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే వంటకాలను తగ్గించి రైస్ ఆధారిత భోజనాలనే ఎక్కువగా అందిస్తున్నారు. కొన్ని చోట్ల రోటీలను కూడా ప్రతిరోజు ఇవ్వడం మానేశారు. వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే అందిస్తున్నారు. చెన్నైలోని కొన్ని హాస్టళ్లలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ మెస్ మెనూల్లో రైస్ ఐటెమ్స్ పెంచారు. పరాటాలు, ఫ్రైడ్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ తగ్గించారు. కొన్ని పీజీ అకమోడేషన్‌లలో దోసె, పూరీ పూర్తిగా నిలిపివేసినట్లు నోటీసులు కూడా పెట్టారు. లక్నోలోని ఒక బోర్డింగ్ స్కూల్ మెస్ మేనేజ్‌మెంట్ మరో మార్గాన్ని ఎంచుకుంది. గ్యాస్ వినియోగాన్ని తగ్గించడానికి ఉదయం ఫ్రైడ్ ఐటెమ్స్ పూర్తిగా తొలగించారు.

మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో అన్నం ప్రధానంగా ఉండేలా మెనూ మార్చారు. బ్రేక్ టైమ్‌లో మఫిన్స్ వంటి బేకరీ ఐటెమ్స్ ఇస్తున్నారు. ఇవి బయట నుంచి తెప్పించుకోవడం కారణంగా వంటగ్యాస్ వినియోగం తగ్గుతుందని మెస్ నిర్వాహకులు చెబుతున్నారు. పుణేలోని ఒక కాలేజీ మెస్ మరో విధంగా ఆలోచించింది. గ్యాస్ సరఫరా ఆలస్యంగా రావడంతో ఓవెన్లు, ఇండక్షన్ స్టౌలు ఉపయోగించడం ప్రారంభించింది. అయినా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు రోజూ భోజనం సిద్ధం చేయడం కష్టంగా మారుతోందని మెస్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దాని మూలం మధ్యప్రాచ్య ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలే. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో మధ్యప్రాచ్య ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ యుద్ధం తీవ్రతరం కావడంతో ట్యాంకర్ రవాణా మార్గాలపై ఒత్తిడి పెరిగింది.

ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతం ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలక మార్గంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు, గ్యాస్ సరఫరాపై వెంటనే ప్రభావం పడుతుంది. ఇండియాకు కూడా ఇదే ప్రధాన సమస్య.

దేశంలో వినియోగించే ఎల్పీజీలో పెద్ద భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. తాజా అంచనాల ప్రకారం భారత్ అవసరమైన ఎల్పీజీలో సుమారు 66శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఇందులో దాదాపు 92 శాతం మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక్కటే దాదాపు 40 శాతం సరఫరా చేస్తుంది. కతార్ నుంచి సుమారు 22 శాతం వస్తుంది. సౌదీ అరేబియా, కువైట్ దేశాలు కలిపి మరో పెద్ద భాగాన్ని అందిస్తాయి. అందుకే ఆ ప్రాంతంలో యుద్ధం మొదలైతే మొదట ప్రభావం పడేది వంటగ్యాస్ సరఫరాపైనే.

ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లపై ఆధారపడే రెస్టారెంట్లు, హాస్టళ్లు, క్యాటరింగ్ యూనిట్లు వెంటనే ఒత్తిడిని ఎదుర్కొంటాయి. సిలిండర్ల సరఫరా ఆలస్యం కావడం, ధరలు పెరగడం లాంటి సమస్యలు మెస్ నిర్వాహకులకు సవాల్‌గా మారుతున్నాయి.

రెస్టారెంట్ రంగం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా సుమారు 75 శాతం రెస్టారెంట్లు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపైనే ఆధారపడి ఉంటాయి. సరఫరా అంతరాయం కొనసాగితే రోజుకు వేల కోట్ల రూపాయల నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని రంగ ప్రతినిధులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల హాస్టళ్లు తమవంతు మార్గాలు వెతుకుతున్నాయి.

గ్యాస్ ఎక్కువగా వినియోగించే వంటకాలను తగ్గించడం, రైస్ ఆధారిత మెనూలు పెంచడం, బేకరీ ఐటెమ్స్ ఉపయోగించడం, కొన్ని చోట్ల ఇండక్షన్ కుకింగ్ చేయడం లాంటి మార్పులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్పులు తాత్కాలికమే అని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. మధ్యప్రాచ్య పరిస్థితులు స్థిరపడితే మళ్లీ పాత మెనూలు తిరిగి వస్తాయని అంటున్నారు.

ALSO READ: ఇరాన్‌లో భారతీయ వైద్యుల భవిష్యత్తు ఏంటి? కలలు చెదిరినట్టేనా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *