Menu

Trigger Politics: రామనవమి సందర్భంగా సంఘ్‌ వెకిలి చేష్టలు.. విషపు సంస్కృతిని నూరిపోస్తున్న బడా లీడర్లు!

Tri Ten B (Triya) 2 years ago
rajasingh madhavi latha kompella dance infront of masjids

డిక్కి బలిసిన కోడి చికెన్‌ షాపు ముందుకెళ్లి తొడ కొట్టిందట.. రామనవమి శోభయాత్ర వేళ ‘అతి’వాదుల చేష్టలు చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. పనిగట్టుకొని మసీదుల వద్ద రెచ్చగొట్టే చర్యలకు ఇటీవలి కాలంలో భక్త పరివారానికి అలవాటుగా మారింది. అది కాస్త రామనవమి సందర్భంగా శృతి మించింది. సామాన్య భక్తులు సాధారణంగా రామనవమి చేసుకుంటే కొందరు అతిభక్తులు మాత్రం మసీదుల ముందు ముస్లింలను ట్రిగ్గర్ చేసే పనులకు పూనుకున్నారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గురించి మాట్లాడుకోవడం దండగ.. ఆయన గురించి ప్రత్యేకంగా విమర్శిస్తే అది జర్నలిస్టు పెన్నుకు, టైప్‌ చేస్తే కీబోర్డుకు కూడా ఘోర అవమానమే అవుతుంది. అందుకే ఆయన గురించి పక్కనపెడదాం. మిగిలిన అతిభక్తులు ఎందుకిలా చేస్తున్నారో అర్థంకాని దుస్థితి. మన పండగ మనం చేసుకునేందుకు అవతలి మతాల వారితో పనేంటో.. ఈ వింత పోకడలేంటో తెలియని పరిస్థితి.


క్షమాపణ చెప్పడం కూడా తప్పే:
రామనవమి శోభయాత్ర సందర్భంగా హైదరాబాద్‌ లోక్‌సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత కొంపెల్ల బాణాలు విసిరారు. అంటే నిజమైన బాణాలు కాదు.. ఆవిడకు ఆవిడే చేతిలో బాణం ఉందని ఊహించుకోని బాణాలు సంధించారు. అది మసీదులవైపు గురి పెట్టినట్లు ఉన్నాయని కొన్ని వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అది అసంపూర్ణమైన వీడియో అని.. ఒకవేళ ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమించాలని మాధవిలత ముస్లిం కమ్యూనిటీకి ట్విట్టర్‌లో సారీ చెప్పారు. అయితే ఇది కూడా అతిభక్తులకు ఏ మాత్రం నచ్చలేదు. క్షమాపణ ఎందుకు చెప్పావ్ అంటూ ఆమెను దూషించారు. రాజాసింగ్‌ అయితే ఇలా సారీ చెప్పడంతో ఆయన వర్గం కామెంట్స్‌లో దూరింది. అంటే నిజంగానే అలా రెచ్చగొట్టాలన్నది వారి ఉద్దేశ్యం. ఇంత దిగజారిన మనస్తత్వం హైదరాబాద్‌లో హెచ్చుమీరుతుండడం నిజంగా బాధాకరం!


ఓట్ల కోసం దిగజారుడుతనం:
ఇలా మసీదుల చుట్టూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం ఇదేమీ కొత్త కాదు. అయితే ఈసారి ఈ అతివాదం బాగా ముదిరినట్టు కనిపించింది. ఇలాంటి వాటిని బీజేపీ నేతలే దగ్గరుండి చేయిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు మసీదులు కనపడకుండా చాలా చోట్ల పరదాలు కప్పారు. ఇలా మసీదుల ముందు రెచ్చగొట్టే చర్యలకు సిద్ధమని వీరందరికి ఏ దేవుడు చెప్పాడు? 33 కోట్ల దేవుళ్లలో ఒకరైనా చెప్పారా? ఇదంతా మెజారిటీ వర్గమైన హిందూవుల ఓట్ల కోసం బీజేపీ నూరిపోస్తున్న విషపు సంస్కృతి. ప్రతీచోటా ఇదే కదా వాళ్లు చేసేది..!

ఇది కూడా చదవండి: మోదీ పచ్చి అబద్ధాలు.. ఏకంగా సుప్రీం తీర్పునే మార్చేస్తున్నారు!

 


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *