Menu

NASA: మీరు ఎప్పుడైనా సూర్యుడు పుడుతుండగా చూశారా? ఆ అద్భుతాన్ని చూసేయండి!


విశ్వం గుట్టు విప్పేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్బ్ స్పేస్ టెలిస్కోప్ అనేక కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది.


Sumanth Thummala 2 years ago

మీరు ఎప్పుడైనా సూర్యుడు పుడుతుండగా చూశారా? అదేం ప్రశ్న సూర్యుడు పుడుతుండగా ఎవరైనా చూస్తారా అనుకుంటున్నారు కదా! ఈ అద్భుతాన్ని నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్బ్ టెలిస్కోప్ ఆవిష్కృతం చేసింది. ఇటీవల విడుదల చేసిన చిత్రాలలో పాలపుంతలో ఉండే ఎన్ 79 అనే నెబ్యులా (నెబ్యులా అనేది అంతరిక్షంలో ధూళి, వాయువులతో కూడిన ఒక పెద్ద మేఘం)ప్రాంతంలో వెబ్బ్ మిడ్- ఇన్ఫ్రారేడ్ ఇన్స్ట్రుమెంట్ (MIRI) ద్వారా ద్వారా ఈ చిత్రాన్ని తీసింది.

ఎన్ 79 అనేది భారీ నక్షత్రాలు ఏర్పడే ప్రాంతంగా దాదాపు 1630 కాంతి సంవత్సరాల విస్తీర్ణం ఉంటుందని, నాసా విడుదల చేసిన చిత్రంలో మూడు పెద్ద మాలిక్యులర్ క్లౌడ్ కాంప్లెక్స్‌లలో ఒకదానిపై కేంద్రీకృతమై ఉంది.

జేమ్స్ వెబ్బ్ స్పేస్ టెలిస్కోప్ రూ. 75 వేల కోట్లతో నిర్మించారు. మానవ చరిత్రలో అంతరిక్షంలోకి ప్రయోగించిన అత్యంత పెద్దది ఖరీదైన టెలిస్కోప్ ఇదే. 2021 డిసెంబర్ 26న దీనిని ప్రయోగించారు.

Also Read: గోవా తీసుకెళ్తా అని అయోధ్యకు తీసుకెళ్లిన భర్త.. తర్వాత భార్య ఏం చేసిందంటే?

 

 

 


Written By

Sumanth Thummala is aContent Writer and the co-founder of Prajadhwani news. He works passionately toward creating positive change in the world through meaningful, responsible writing.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *