ఫిబ్రవరి 1 తర్వాత ఆకాశంలో ఏదో మారింది. సూర్యుడి లోపల ఏదో భయాంకర ఘటన జరుగుతోంది. నాసా ఉపగ్రహాలు ఒక్కసారిగా హెచ్చరికలు ఇవ్వడం మొదలుపెట్టాయి. రేడియో సిగ్నల్స్ తడబడ్డాయి. ఉపగ్రహాలపై లోడ్లు పెరిగాయి. అంతరిక్షంలో రేడియేషన్ స్థాయిలు ఎగబాకాయి.
ఇది ఒక్క పేలుడు కాదు. వరుసగా సంభవిస్తున్న శక్తివంతమైన సౌర విస్ఫోటనాల పరంపరతో సైంటిస్టులు టెన్షన్ పడుతున్నారు. X-క్లాస్ అని పిలిచే సౌర జ్వాలలు 2026ని ప్రమాదంలోకి నెట్టేస్తాయన్న అంశం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇంతకీ సూర్యుడిపై ఏం జరుగుతోంది? 2026 నిజంగా ప్రమాదకర సంవత్సరంగా మారుతుందా?
ఫిబ్రవరి 1న నాసా సౌర డైనమిక్స్ అబ్జర్వేటరీ నమోదు చేసిన డేటా ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. సూర్యుడి ఉపరితలంపై AR4366 అనే భారీ సన్‌స్పాట్ ఒక్కసారిగా అత్యంత అస్థిరంగా ఈ సన్‌స్పాట్ సాధారణ మచ్చ కాదు. ఇది భూమి వైపు తిరిగిన స్థితిలోనే ఉండి, లోపల తీవ్రంగా ముడిపడ్డ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్‌ను కలిగి ఉంది. ఆ లింకులు ఒక్కొక్కటిగా తెగిన ప్రతిసారి, భూమి వైపు శక్తివంతమైన సౌర జ్వాలలు వస్తున్నాయి. ఈ జ్వాలల్లో కొన్ని M-క్లాస్ అయితే, కొన్ని అత్యంత ప్రమాదకరమైన X-క్లాస్‌గా నమోదయ్యాయి. X-క్లాస్ అంటే సూర్యుడి నుంచి వెలువడే అత్యున్నత శక్తి స్థాయి. ఇవి వెలువడినప్పుడు సెకన్లలోనే భూమి వాతావరణాన్ని తాకుతాయి. అప్పుడే రేడియో బ్లాక్‌అవుట్స్, GPS లోపాలు, విమాన కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్‌లు మొదలవుతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే షార్ట్‌వేవ్ రేడియో సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయిన సందర్భాలు రికార్డయ్యాయి.
ఈ సౌర జ్వాలలతో పాటు కొరొనల్ మాస్ ఈజెక్షన్లు కూడా వస్తే అప్పుడు పరిస్థితి మరింత భయానకంగా ఉంటుంది. సూర్యుడి నుంచి లక్షల కోట్ల టన్నుల ప్లాస్మా, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఒకేచోట పేలినప్పుడు, అది నేరుగా భూమి వైపు వస్తే దాన్ని ఫ్లడ్‌తో పోల్చొచ్చు.. అయితే అది వాటర్ ఫ్లడ్ కాదు.
ఇది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తుఫాను. ఇలాంటి తుఫానులు భూమి మీద పవర్ గ్రిడ్స్‌ను డౌన్ చేయడంతో పాటు ఉపగ్రహాలను పనికిరాకుండా చేస్తాయి. ఇంటర్నెట్ బ్యాక్‌బోన్ వ్యవస్థలు తాత్కాలికంగా అయినా కూలిపోవచ్చు. 1859లో జరిగిన కారింగ్టన్ ఈవెంట్‌లో టెలిగ్రాఫ్ వైర్లు మంటలు పుట్టాయి. ఇప్పుడు అదే స్థాయి ఘటన జరిగితే డిజిటల్ ప్రపంచం ఒక్కసారిగా డౌన్ అవుతుంది. ఇక్కడే 2026 గురించి సైంటిస్టులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మనం ఇప్పుడు సోలర్ సైకిల్-25 పీక్ దశలోకి అడుగుపెడుతున్నాం. ప్రతి 11 ఏళ్లకోసారి సూర్యుడు ఇలానే అశాంతిగా మారుడాడు. కానీ ఈసారి తేడా ఏంటంటే.. మన ప్రపంచం ఇప్పుడు పూర్తిగా ఉపగ్రహాలు, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంది. ఒక బలమైన సౌర తుఫాను వస్తే, దాని ప్రభావం యుద్ధం కన్నా ఎక్కువగా ఉండొచ్చు.
అందుకే నాసా, NOAA లాంటి ఏజెన్సీలు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు భూమిని నేరుగా తాకే భారీ CME నమోదు కాలేదు. కానీ AR4366 ఇంకా శాంతించలేదు. అదే అసలు టెన్షన్. ఇది రానున్న ప్రమాదానికి ఇచ్చే ముందస్తు సిగ్నల్. సూర్యుడు యుద్ధం చేయడం లేదు కానీ మన టెక్నాలజీ ఎంత బలహీనమైందో గుర్తు చేస్తున్నాడు. నిజానికి 2026లో సూర్యుడు మారలేదు.. అయితే సూర్యుడిని ఎదుర్కొవడానికి మన ప్రపంచం మాత్రం ఇంకా సిద్ధంగా లేదు.
ALSO READ: ఎప్‌స్టీన్ ఎవరు? ప్రపంచంలోని బడాబాబులు ఎందుకు వణికిపోతున్నారు?

NASA: మీరు ఎప్పుడైనా సూర్యుడు పుడుతుండగా చూశారా? ఆ అద్భుతాన్ని చూసేయండి!