Menu

Viral News: గోవా తీసుకెళ్తా అని అయోధ్యకు తీసుకెళ్లిన భర్త.. తర్వాత భార్య ఏం చేసిందంటే?


హనీమూన్‌ గురించి దాదాపు ప్రతిఒక్కరూ కలలు కంటారు. రెండు మనసులు, తనువులు ఒక్కటయ్యే విషయం అది. అయితే దేవుడిపై, తల్లిదండ్రులపై భక్తిభావం ఎక్కువైన ఓ భర్త భార్య కనీస కోరికను విస్మరించాడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి!


Tri Ten B (Triya) 2 years ago
Woman files for divorce after husband swaps Goa honeymoon for Ayodhya, Varanasi

వారిది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌.. పెళ్లి జరిగి 5 నెలలు గడిచిపోయింది. ఆ జంట హనీమూన్‌కి మాత్రం వెళ్లలేదు. ఆమెకు ఫారిన్‌లో ఎక్కడైనా హనీమూన్‌ చేసుకోవాలని కోరిక. అదే విషయాన్ని భర్తకు అనేకసార్లు చెప్పింది. ఆమె ఓ ప్రైవేట్‌ ఎంప్లాయ్‌..బాగానే సంపాదిస్తోంది. భర్త ఐటీ ఉద్యోగి.. నెలకు లక్షల్లో పోగేస్తున్నాడు. ఇద్దరికి డబ్బుల విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ఎక్కడికైనా వెళ్లవచ్చు..! అయితే అతని ఆలోచన మాత్రం వేరేలా ఉంది. ఇంట్లో వాళ్ల మాటలను పట్టుకోని భార్యమీద రుద్దే రకం. అందుకే ఫారిన్‌ టూర్‌ వద్దు అని చెప్పాడు. దీంతో భార్య అలిగింది. మూతి తిప్పుకోని కూర్చుంది. ఇది గమనించిన భర్త భార్యను బుజ్జగించే ప్రయత్నం చేశాడు. చివరికు ఇద్దరు కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. హనీమూన్‌కి గోవా వెళ్దామని ఫిక్స్‌ అయ్యారు. గోవా వెళ్లే రోజు ఎప్పుడు వస్తుందా అని భార్య కలల్లో గోవా అలల్లో మునిగి తేలింది. తీరా జనవరి వచ్చేసింది. గోవా ట్రిప్‌ గురించి భర్త నోరెత్తకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చాడు.

ప్రతీకాత్మక చిత్రం

ఇంతలోనే ఓ రోజు భార్య దగ్గరకు వచ్చాడు. గోవా వద్దు.. అయోధ్య వెళ్దామని చెప్పాడు. అంతే భార్య గుండెలో బాం*బు పేలిన శబ్దం. గోవా సముద్రపు అలలు ఆమె గుండెల్లోనే పోటెత్తాయి. గుడి గంటల శబ్దం చెవుల్లో మారుమోగింది. అది ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. అయోధ్య టూర్‌ నిర్ణయాన్ని భార్య ఒప్పుకోలేదు. అయోధ్యకు రానని తెగేసి చెప్పింది. అయితే అది తన తల్లిదండ్రుల కోరిక అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు భర్త. చివరకు ఎలాగోలా భార్యను ఒప్పించాడు. ఇద్దరూ అయోధ్యకు వెళ్లారు. బాలరాములోరి దర్శనం చేసుకున్నారు.

హనీమూన్‌ అయితే వెళ్లలేదు కానీ దేవుడు దర్శనం జరిగిందని.. తన తల్లిదండ్రులు చెప్పింది చేసి వారిని ఆనందపెట్టానని భర్త భావించాడు. ఇంతలోనే కథ అడ్డంతిరిగింది. ఏదో చిన్న విషయంలో భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది.. అది కాస్త పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కే వరకు వెళ్లింది. తన భర్త తనకు అసలు ప్రాధాన్యతే ఇవ్వడంలేదని భార్య పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. ఎప్పుడు చూసినా అతని కుటుంబసభ్యుల మాటలే వింటున్నాడని వాపోయింది. తనకు విలువ లేని చోట కలిసి ఉండలేనని విడాకులకు అప్లై చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: ఈ ఏడు పాటించండి చాలు, మీ జీర్ణవ్యవస్థకు ఏ సమస్యలూ రావు


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *