యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తు న పూజ్యన్తే సర్వాస్తత్రాఫలాః క్రియాః
ఈ లోకంలో స్త్రీని దేవతగా పూజిస్తామని గొప్పగా చెప్పుకునే మనమే అదే స్త్రీని ప్రతిరోజూ దాడులు అవమానాలతో వాళ్లకి నరకం చుపిస్తున్నాము వాస్తవం ఎంత విడ్డురంగా ఉందో. ఆలయాల్లో అమ్మవారికి పూలు సమర్పించే చేతులే, ఇంట్లో అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వడానికి వెనుకాడుతుంటే… ఆ పూజల అర్థమేంటి?
పుట్టుకతోనే ఆమెపై గీతలు(తలరాతలు ) గీసే సమాజం, ఆమె నవ్వును కూడా కొలుస్తుంది. “ఇలా ఉండాలి, అలా ఉండకూడదు” అని చెప్పే మాటల మధ్య, ఆమె స్వరమే మాయమైపోతుంది. ఆమె కళ్ళలో ఉన్న కలలు, నిశ్శబ్దంగా కరిగిపోతుంటాయి.
పాఠశాలల్లో చదివే అమ్మాయి, బయట అడుగు వేస్తే భయం వెంటాడుతుంది. రోడ్లపై అడుగులు వేసే ప్రతిసారి, తన భద్రత కోసం తానే కాపలాదారిగా మారాల్సి వస్తుంది. ఇది aభివృధి చెందిన సమాజమా? లేక ఇంకా చీకట్లోనే ఉన్న యుగమా?
ఆమె కష్టానికి విలువ కట్టే వారు తక్కువ, ఆమె తప్పులకు తీర్పు చెప్పే వారు ఎక్కువ. ఇంట్లోనూ, ఉద్యోగంలోనూ ఆమె నిరూపించుకోవాల్సిందే. కానీ, ఆమె సాధించిన విజయాలు మాత్రం “అదృష్టం” అని కొట్టిపారేస్తారు.
“స్త్రీ శక్తి” అని సభల్లో ప్రసంగాలు వినిపిస్తాయి, కానీ ఆ శక్తిని అడ్డుకునే గోడలు మాత్రం కూలవు. మాటల్లో గౌరవం, పనుల్లో అసమానత — ఈ ద్వంద్వ వైఖరి ఎప్పటివరకు?
ఆమెను దేవత అంటారు, గుడిలో పూజిస్తారు
బయట అడుగు వేస్తే, ప్రశ్నలే వర్షిస్తారు
ఆమె నవ్వు వెనుక, నొప్పి నిశ్శబ్దమై ఉంటుంది
పూజల కాంతి కంటే, నీడలే ఎక్కువగా ఉంటాయి
చిన్నతనం నుంచే బాధ్యతల బరువు మోసే భుజాలు, పెద్దయ్యాక కూడా విశ్రాంతి పొందవు. ఆమె జీవితం ఒక నిరంతర పోరాటం. అయినా, ఆమె చిరునవ్వు మాత్రం ఎప్పుడూ తగ్గదు.
స్వప్నాలు చూసే హక్కు ఆమెకూ ఉంది, కానీ వాటిని చేరుకోవడానికి మార్గాలు మూసుకుపోతాయి. ఒక అడుగు ముందుకేస్తే, పది అడుగులు వెనక్కి లాగబడుతుంది. అయినా, ఆమె ఆగదు.
ఆమె గుండెలో గాయం, మాటల్లో కనపడదు
ఆమె నడకలో ధైర్యం, భయాన్ని దాచుకుంటుంది
కన్నీళ్లు కరిగినా, చిరునవ్వే చూపిస్తుంది
అది ఆమె బలం కాదు, బలవంతం అయిన జీవితం
మహిళల పట్ల గౌరవం పూజలతో కాదు, సమానత్వంతో రావాలి. ఆమెను దేవతగా చూడటం కంటే, మనిషిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆమెకు అవసరం పూలు కాదు, అవకాశాలు.
ఈ ప్రపంచం నిజంగా మారాలంటే, మాటలు కాదు — మనసులు మారాలి. స్త్రీని పూజించడం కాదు, ఆమె స్వేచ్ఛను గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుంది
ఆమెకు ప్రతి నెల వచ్చే బాధ ఎవరికీ పూర్తిగా అర్థం కాదు
కానీ ఆమె నవ్వు మాత్రం ఎప్పుడూ ఆగదు.
నొప్పిని దాచుకుని కూడా
ఇతరులకు ఆనందం పంచగలిగే ఆత్మబలo
అది నిజమైన గొప్పదనం
అమ్మాయి కాదు…
ఆమె ఒక యోధురాలు
నీ నవ్వు వెనుక ఉన్న బాధను తెలుసుకున్నవాళ్లకు
నువ్వు ఎంత గొప్పవో తెలుస్తుంది

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
అధికార మదమా? దళిత సమాజంపై దాష్టీకమా? పవన్ ఫ్లెక్సీపై పెల్లుబికిన నిరసనలు, అధినాయకత్వం అర్థవంతమైన మౌనం!
రాజ్యాధికారం అండతో పెట్రేగుతున్న అగ్రకుల అహంకారం: దళితులపై దాడుల చారిత్రక విశ్లేషణ
Silence: మౌనం.. గుణం కాదు… అది బంధనమే..! అన్యాయానికి ఎదురొడ్డి నిలబడి, ప్రశ్నించే నీ గొంతుకే నిజమైన ఆయుధం!
Working Girl: అమ్మాయి ఆ పని చేస్తే వేశ్యరికం.. అదే అబ్బాయి చేస్తే సంసారమా? మీ లాజిక్ మడిచి..!
Life Style News: దేవుడు ఎవరు? సమాధానం మీ దగ్గరే ఉంది.. ఎలాగో తెలుసుకోండి!