‘మోసపోయిన దళిత మహిళ’
‘ఆదివాసీలపై పోలీసుల దాడి’
కులం పేరును, వర్గం పేరును ప్రస్తావిస్తూ ఇలాంటి హెడ్‌లైన్స్ తరుచుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. ఇలాంటివి కనిపించినప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది. కులం పేరు ఎందుకు వాడాలి? కొన్ని మతాల పేర్లనే ఎందుకు హైలెట్ చేసి మీడియా చెబుతుంటుంది? ఇది పక్షపాతం కాదా అని ప్రశ్నించేవాళ్లు ఉంటారు. ఇటివల బహదూర్‌పూరలో ఓ మాదిగ గర్భిణీకి అన్యాయం జరిగింది. అత్తింటి వారు కులం పేరుతో ఆమెను తక్కువగా చూడడంతో పాటు ఈ ఘటన వెనుక కులమే సెంట్రిక్‌గా నడిచింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ యూట్యూబర్ శ్రీనిధివిప్లవశ్రీ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఆ పోస్టు కామెంట్స్‌లో కొందరు వితండవాదానికి దిగారు. దళిత మహిళ అని ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నావంటూ వాదించారు. ఏ మహిళ అయినా మహిళే కదా అని ప్రశ్నలు అడిగారు. ఇందులో సనాతన ముఠా గుంపులు కూడా ఉన్నాయి. ‘కులనిర్ములన జరగాలని స్పీచులు దంచే నువ్వు.. క్యాస్ట్ కార్డ్ ఎందుకు వాడుతున్నావ్’ అంటూ అతిగా రియాక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. వార్తల్లో వెనుకబడిన కులాల పేర్లు ఎప్పుడు ప్రస్తావించాలి, ఎందుకు ప్రస్తావించాలన్నదానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
View this post on Instagram
ప్రతి వార్తలో కుల ప్రస్తావన ఉండాల్సిన అవసరం లేదు కానీ కొన్ని సందర్భాల్లో కులాన్ని ప్రస్తావించకపోతే అసలు విషయాన్ని పక్కదారి పట్టించినట్టే అవుతుంది. ఒక ఘటనకు ఏ అంశం కారణమైందో అదే స్పష్టంగా చెప్పాలి. ఒక మహిళపై అన్యాయం జరిగితే అది వార్తే కానీ ఆ అన్యాయం కులం కారణంగా జరిగితే ఆ కులాన్ని ప్రస్తావించడం ఆ వార్త అసలు నిజాన్ని బయటపెట్టడం అవుతుంది. ఉదాహరణకు బహదూర్‌పూర్ ఘటననే తీసుకుంటే అక్కడ ఒక గర్భిణీ ఆమె కులం కారణంగా అన్యాయానికి గురింది. అత్తింటి వారు కులం పేరుతో ఆమెను తక్కువగా చూడటం ఈ ఘటనలో ప్రధాన అంశం. ఇలాంటి సందర్భంలో కులాన్ని ప్రస్తావించకుండా కేవలం మహిళపై అన్యాయం జరిగిందని చెప్పడం ఘటనలోని అసలు కారణాన్ని దాచిపెట్టినట్టే అవుతుంది. అంటే వార్తలోని నిజం సగమే బయటకు వచ్చినట్టు అవుతుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో కులాన్ని ప్రస్తావించడం జర్నలిస్టిక్ బాధ్యతగా మారుతుంది.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. వార్తలంటే కేవలం జరిగినదాన్ని రిపోర్ట్ చేయడం మాత్రమే కాదు.. సమాజంలో ఉన్న వాస్తవాలను కూడా చూపించాలి. ఒక దళిత మహిళపై జరిగిన అన్యాయం అంటే అది ఒక వ్యక్తి సమస్య మాత్రమే అవ్వాల్సిన అవసరంలేదు. ఒక సామాజిక నిర్మాణంలో ఉన్న అసమానతల ప్రతిబింబాన్ని కచ్చితంగా కళ్లకు కట్టాలి. సమాజంలో ఇంకా చాలా కులాల పట్ల బలిసిన కులాల వారు వివక్ష చూపిస్తూనే ఉన్నారు. సామాజికంగా వెనుకబాటుతనంలో ఉన్న కులాలకు అండ కూడా తక్కువే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కులం పేరును చెప్పడం కచ్చితంగా అవసరం. లేకపోతే సమస్య వ్యక్తిగత స్థాయికే పరిమితమైపోతుంది.. దాని వెనుక ఉన్న పెద్ద కారణాలు గురించి చర్చ కూడా జరగదు.
ఇంకా కన్ఫూజన్ ఉంటే ఆర్థిక కోణంలో ఓ ఉదాహరణను తీసుకుందాం. ఒక కంపెనీ సీఈవో అదే ఆఫీస్‌లో పనిచేస్తున్న వాచ్‌మ్యాన్‌ను కొట్టాడనుకుందాం. ఇప్పుడు ఎవరికైనా ఏం అనిపిస్తుంది? సీఈవో కాబట్టి తన కింద పని చేసేవాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించాడన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. అహంకారంతోనే సీఈవో ఇలా చేశాడని అంతా నిర్థారణకు వస్తారు. మరి సామాజిక అంశాల్లో మాత్రం ఈ ఆలోచన ఉండకపోవడం బాధాకరం. సమాజంలో కుల వివక్ష లేదని చెప్పేవారి ఆలోచనా విధానం ఇలానే ఉంటుంది. నిజానికి చేసే పనిలో అయినా కులంలో అయినా ఎక్కువలు, తక్కువలు ఉండవు.. కానీ సమాజం ఆలోచించే విధానం మాత్రం ఎక్కువ తక్కువలతోనే కూడుకొని ఉంటుంది. ఈ వివక్ష పోకుండా కులం పేరు వార్తల్లో చెప్పకుండా ఉండాలంటే ఎలా?
చాలా మంది అందరూ సమానమే కాబట్టి కులం ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తారు. ఇది ఒక భావనగా సరైనదే కానీ వాస్తవ సమాజంలో ఇంకా అసమానతలు ఉన్నప్పుడు వాటిని గుర్తించకుండా సమానత్వం గురించి మాట్లాడటం సమస్యను దాచినట్టే అవుతుంది. అసలు సమానత్వం అంటే ఉన్న తేడాలను చూడకుండా ఉండటం కానే కాదు.. ఆ తేడాలను అర్థం చేసుకుని వాటిని సరిచేయడం.
అలాగే సామాజికంగా వెనుకబడిన వారి గొంతును వినిపించడం కూడా మీడియా బాధ్యతలో భాగమే. సామాజికంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు సాధారణంగా పెద్దగా మద్దతు ఉండదు. వారి సమస్యలు చాలా సార్లు కనిపించకుండా పోతుంటాయి. అలాంటి సమయంలో వారి గుర్తింపును తొలగిస్తే వారి సమస్య మరింతగా కనిపించకుండా పోతుంది. ఒక మహిళ అని మాత్రమే చెబితే ఆమె ఎదుర్కొన్న వివక్ష కనిపించకపోకుండా పోతుంది. అయితే ప్రతి సందర్భంలో కులాన్ని ప్రస్తావించడం అవసరం లేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఒక యాక్సిడెంట్ లేదా కులంతో సంబంధం లేని ఘటనలో కులాన్ని ప్రస్తావించడం అనవసరం. అలాంటి సందర్భాల్లో కులం చెప్పడం వార్తను మళ్లించడం అవుతుంది. కాబట్టి జర్నలిజంలో కులాన్ని ప్రస్తావించాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా ఆ ఘటనపై ఆధారపడి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వార్తల్లో కులాన్ని ప్రస్తావించడం అనేది ఎవరినైనా విభజించడానికి కాదు, ఒక వాస్తవాన్ని చూపించడానికి మాత్రమే.
ALSO READ: టెర్రరిజం స్థాయికి చేరిన జర్నలిజం..! ఏకంగా ఉగ్రవాదులకే సవాల్ విసురుతున్నారుగా!
ALSO READ: పనిచేసేవాడి చేతికి బొచ్చే…భజన చేసేవాడికి బిర్యానీ..! మీడియాలో కుల కంపు!

Pithapuram: పిఠాపురంలో దళితులపై బలిసిన కులాల దౌర్జన్యం..! సనాతన పవనుడి కళ్లు కాకులు ఎత్తుకెళ్లాయా?
Workplace Mental Health Crisis: ప్రాణాలకు ముప్పుగా మారుతోన్న ఆఫీస్ వర్క్ కల్చర్!
Satish Chander: జాబితా నుంచి పేరు కాదు.. నిజాన్ని తీసేశారు..!
Media Files: గణేశా.. చూస్తున్నావా? “G”old star ⭐.. “G”ole mall
Kukatpally Incident: పిల్లల బ్యాగ్‌ల్లో కత్తులు, రాడ్లు.. పసిమనసులను హంతకులగా చేస్తుంది ఎవరు?
Press Freedom in India: భారత ప్రజాస్వామ్యంలో మీడియా పరిస్థితి