Menu

Working Girl: అమ్మాయి ఆ పని చేస్తే వేశ్యరికం.. అదే అబ్బాయి చేస్తే సంసారమా? మీ లాజిక్ మడిచి..!

Mahalakshmi Kallepalli 1 year ago
prostitute india telugu news

హాయ్.. మళ్లీ మళ్లీ వచ్చేశా.. ఇది చదువుతున్నప్పుడు మీ మనోభావాలు, తొక్క , తోటకూర.. ఇలాంటివి ఏమైనా హర్ట్ అయితే నాకు సంబంధం లేదు. ఓకే ఏం పర్లేదనుకుంటే చదవండి. ఎవరిని నొప్పించడానికి రాయలేదు , తెలుసుగా.. నా ఇన్టెన్షన్‌ నొప్పించడం కాదు.. నిజాన్ని తేలియజేయటం 😁

వేశ్య అనే పదం వింటేనే.. చాలా మంది ఒక డిస్‌గస్టింగ్‌ ఫీలింగ్‌తో రెస్పాండ్ అవుతారు.. బట్, ఎప్పుడైనా ఆ పదం వెనకున్న జీవిత గాధల గురించి థింక్ చేసారా? వన్స్ అప్ ఆన్ ఎ టైం లో రెడ్ లైట్ ఏరియాస్ లో ఉంటారని విన్నాం.. కానీ ఇప్పుడు మెట్రో స్టేషన్లు , బస్ స్టాప్స్ దగ్గర కూడా చూస్తున్నాం.. అదే కష్టాలు, అదే సోసైటిస్.. అదే లొన్లైన్స్. ఒక క్షణం సుఖం కోసం తన ఆత్మ అమ్ముకున్న ఆమె గురించి ఎవ్వరూ ఆలోచించరు. కొన్ని అవసరాలు, సిత్యుయేషన్స్ వల్లనే చాలా మంది ఆడవాళ్లు ఈ వృత్తిలో పడిపోతారు. జాబ్స్ లేకపోవడం, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం లాంటివి ఉంటాయి. ఇక ఎండ్ ఆఫ్ ది డే.. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక విషాదం ఉంటుంది.

ఆమె నవ్వింది అంటే “చౌక” అని పిలుస్తారు ,
ఆమె ఏడ్చింది అంటే “drama” అంటారు .

సొసైటీలో చాలా మందికి మాట్లాడడం ఈజీగా ఉంటుంది.. ఆమె వేశ్య.. ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది అని.. కానీ ఒక మగాడు అదే పని చేస్తే… ఎవరు అడుగుతారు? ‘మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తారా?

ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే ఇలాంటి అమ్మాయిలపై బూతులు జోక్స్ వేస్తారు. పక్కా ఏదో వేశ్య పనులు చేస్తుందని జడ్జిమెంట్ రెడీ. కానీ.. ఒక మగాడు 10మంది అమ్మాయిలతో మాట్లాడితే స్మార్ట్ రా , ప్లేయర్‌రా అని మాట్లాడుకుంటారు. వావ్ సూపర్ కదా ఈ వేరియషన్.

డబ్బు కోసం తన శరీరం అమ్ముకున్న ఆడదాన్ని వేశ్య అంటారు. కానీ ఆ శరీరం కొన్న మగవాళ్ళని ఏం అంటారు ? కస్టమర్ ? లెజెండ్ ? లవర్ బాయ్ ?

ఆమె రోజు ఎదురుచూస్తుంది
ఒక హెల్ప్, ఒక హాప్ ,
కానీ సొసైటీ ఇచ్చేది ఒక్క తిట్టుకోవడం..

ఆమె ప్రేమ కోసం కాదు.. కష్టం కోసం బతుకుతుంది.. కానీ సమాజం దాన్ని అర్థం చేసుకోలేదు . ప్రేమ లేకుండా ఎవరైనా టచ్ చేస్తే ఆ పెయిన్ ఎంత నరకంగా ఉంటుందో వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. ఆ గుండెలకు మాత్రమే ఇది అర్థమవుతుంది.

ఇండిపెండెన్స్ వచ్చిన దేశంలో.. ఎవరు ఎలా అనాలి అని సొసైటీ డిసైడ్ చెయ్యడమేంటో అర్థంకావడం లేదు.
నా రిక్వెస్ట్.. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ గైస్..
నా మాటలు చాలా మందికి నచ్చకపోవచ్చు..
కానీ చెప్పకపోతే.. నా మనసు లోపల ఏడ్చేస్తాది .

ఇది ఈ సారి
నెక్స్ట్ టైం మళ్లి ఇంకో టాపిక్‌తో వస్తా..

అన్‌టిల్‌ థెన్‌.. జస్ట్ ట్రై టు ఫీల్ బిఫోర్ యు జడ్జ్..

బాయ్ 😢

ఇంకా చదవండి: భయం మధ్య బతికిన ధైర్యం… ఇద్దరు పిల్లల కోసం ప్రపంచంతో పోరాడిన ‘నిర్భయ’!


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *