దశాబ్దాల క్రితం అపోలో మిషన్‌లు సెట్ చేసిన రికార్డులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బ్రేక్ అవుతున్నాయి. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ ఇప్పటివరకు మనిషి ఎప్పుడూ వెళ్లని దూరాలకు చేరుకుంటోంది.
భూమి నుంచి లక్షల కిలోమీటర్ల దూరంలో నలుగురు వ్యోమగాములు సంచలనలు సృష్టిస్తున్నారు. ఒక చిన్న స్పేస్‌క్రాఫ్ట్‌లో మానవ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాస్తున్నారు. ఇంతకీ ఈ మిషన్ ఎంత దూరం వెళ్లింది? ఆర్టెమిస్-2 బ్రేక్ చేసిన ఆ రికార్డులేంటి?
మనిషి ఇప్పటివరకు ప్రయాణించిన దూరాన్ని దాటడం ఈ మిషన్‌లో అత్యంత కీలక ఘట్టంగా చెప్పవచ్చు. ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఆర్టెమిస్-2 సిబ్బంది భూమి నుంచి దాదాపు 2 లక్షల 48 వేల 655 మైళ్ల దూరాన్ని చేరుకున్నారు. దీంతో 1970లో అపోలో-13 సెట్ చేసిన రికార్డ్‌ను అధిగమించారు.
ఇంకా మిషన్ పీక్ దశలో ఈ దూరం దాదాపు 2 లక్షల 52 వేల మైళ్ల వరకు వెళ్లనుంది. ఈ ప్రయాణంలో నాసా వ్యోమగాములు రీడ్ వైజ్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌తో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్ ఉన్నారు. భూమి నుంచి దూరంగా ప్రయాణిస్తూ చంద్రుడి చిత్రాలను సేకరిస్తున్నారు. మానవ కళ్లతో ఎన్నో దశాబ్దాల తర్వాత చంద్రుడి ఫార్ సైడ్‌ను ప్రత్యక్షంగా గమనించే అవకాశం కూడా ఈ మిషన్‌తో లభిస్తోంది. ఈ మిషన్‌లో మరో ప్రత్యేక ఘట్టం చంద్రుడికి అత్యంత దగ్గరగా వెళ్లే దశ. సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో చంద్రుడిని చుట్టి తిరుగుతారు. అదే సమయంలో ఒక అరుదైన సూర్య గ్రహణాన్ని కూడా వీక్షించే అవకాశం ఉంది. చంద్రుడు సూర్యుడి ముందు నుంచి వెళ్లే సమయంలో అంతరిక్షం నుంచి ఆ దృశ్యాన్ని రికార్డ్ చేయనున్నారు. అయితే ఈ ప్రయాణంలో ఒక సవాలు కూడా ఉంది. చంద్రుడి వెనుక భాగానికి వెళ్లే సమయంలో సుమారు 40 నిమిషాల పాటు కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అవుతుంది. ఆ సమయంలో భూమితో ఎలాంటి సంబంధం ఉండదు. మళ్లీ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే కాంటాక్ట్ రీస్టోర్ అవుతుంది. అయితే ఈ మిషన్ కేవలం రికార్డుల కోసం మాత్రం కాదు.. ఇది భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులను మళ్లీ నిలబెట్టేందుకు ఓ ముందడుగుగా చెప్పవచ్చు.
ఈ ప్రయాణంలో సేకరించే డేటా, ఫోటోలు, టెక్నికల్ సమాచారం లాంటివి తర్వాతి ఆర్టెమిస్ మిషన్‌లకు మార్గదర్శకంగా మారనున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలనే లక్ష్యానికి ఇది పునాదిగా చెప్పవచ్చు.

Moon Mining: చందమామకు తూట్లు పొడుస్తున్నారు.. ప్రపంచ దేశాల ఉన్మాద తీరు ఇది!
Moon Endangered: జాబిల్లికి కష్టాలు..! చంద్రుడు కనిపించకుండా పోతాడా?
Human Brain: కొంతమంది వ్యక్తులకు భయమే తెలియదా? మన మెదడు చెబుతున్న షాకింగ్ ఫ్యాక్ట్ ఇదే!
Babies: అమ్మాయా, అబ్బాయా? దీనికో సైన్స్ ఉంది.. ఇక నుంచి మహిళలను నిందించడం ఆపండి!
Swiss Glacier Collapse: నిన్న స్విట్జర్లాండ్.. రేపు ఇండియా.. ఈ పాపం ఎవరిది?
World Water Day: కళ్ళ ముందు పెనుభూతం,చోద్యం చూస్తున్న పాలకులు ప్రజలు.. తర్వాత జరిగేది ఇదే!