Menu

Gut Health Disorders: ఆల్కహాల్, స్మోకింగ్, స్ట్రెస్‌, డిప్రెషన్‌.. యువతలో పెరుగుతున్న గట్‌ హెల్త్ డిజార్డర్స్!

Praja Dhwani Desk 4 days ago
gut health disorders

యువతలో గట్‌ హెల్త్ డిజార్డర్స్ భారీగా పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి లాంటి సమస్యలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ అవి చాలా డేంజర్. ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ సమస్యలకు సంబంధించిన లక్షణాలను అనుభవిస్తున్నట్లు అంచనా. ఇంతకీ యువతలో గట్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి?

ఈ సమస్యల వెనుక ఉన్న ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, భారీగా షుగర్‌ ఉన్న సాఫ్ట్ డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల గట్‌లో ఉన్న మంచి బ్యాక్టీరియా దెబ్బతింటోంది.

రోజూ ఒకే టైమ్‌కు తినకపోవడం, ఎక్కువ మసాలా, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల అజీర్ణం, ఇన్‌ఫ్లమేషన్ లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇక ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం కూడా మరో పెద్ద కారణం. గంటల తరబడి కూర్చునే జీవనశైలి గట్ మోటిలిటీని ప్రభావితం చేస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, బరువు పెరగడం, మెటబాలిక్ సమస్యలు రావడం ప్రారంభమవుతుంది. అయితే అసలు కీలక పాత్ర పోషిస్తున్నది కేవలం ఆహారం మాత్రమే కాదట..! ఎక్కువగా స్ట్రెస్, ఆందోళన కారణంగా స్టమక్‌ సమస్యలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

మెదడు, స్టమక్‌కి మధ్య ఉన్న కనెక్షన్ చాలా బలంగా ఉంటుంది. దీన్ని బ్రెయిన్-గట్ యాక్సిస్ అంటారు. మనం మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు అది నేరుగా స్టమక్‌పై ప్రభావం చూపుతుంది.

ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటి సమస్యలు కూడా ఇదే కారణంగా వస్తాయి. నిద్రలేమి కూడా ఈ సమస్యలను మరింత పెంచుతోంది. సరైన నిద్ర లేకపోతే లివర్ ఫంక్షన్ దెబ్బతింటుంది. దీని వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగి గట్ హెల్త్‌పై ప్రభావం పడుతుంది. ఇక యువతలో మరో ప్రమాదకర ట్రెండ్ ఆల్కహాల్, స్మోకింగ్. బింజ్ డ్రింకింగ్ వల్ల ఫ్యాటి లివర్, హెపటైటిస్ వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇవి మొదట లక్షణాలు చూపించకపోయినా తర్వాత తీవ్రమైన స్థాయికి చేరుతాయి. ఇదే సమయంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్ కూడా యువతలో పెరుగుతోంది. ఇది పూర్తిగా జీవనశైలితో సంబంధం ఉన్న సమస్య. ఒబేసిటీ, డయాబెటిస్, హై బీపీ లాంటి సమస్యలతో ఇది ముడిపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఆహారంలో మార్పులు అవసరం కూడా. పప్పులు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల వ్యాయామం అవసరం.

నిద్ర కూడా తప్పనిసరి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. మొత్తానికి గట్ సమస్యలు చిన్నవిగా కనిపించినా వాటి వెనుక పెద్ద ఆరోగ్య సమస్యలు దాగి ఉంటాయి. జీవనశైలిలో చిన్న మార్పులు చేస్తే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.

ALSO READ: ఆడపిల్లలను చిన్నచూపు చూసే సమాజం.. రాళ్లకు, రప్పలకు గుళ్లు కట్టి ఎందుకు పూజలు చేస్తోంది?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *