మాధవీ లత అతికి అడ్డు అదుపు ఉండదు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరు ఫిక్స్ కాకముందు నుంచే దాదాపు ప్రతీ విషయంలోనూ అతిగా మాట్లాడడం ఆమె నైజంగా కనిపించింది. యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇచ్చే ఇంటర్వూల్లో ఆమె వాదన వితండవాదంగా అనిపిస్తుంది. బీఫ్ తినేవారు అత్యాచారాలు చేస్తారని ఓ సందర్భంలో మాట్లాడిన ఈ మేధావి.. ఎన్నికల పోలింగ్ సమయంలోనూ ముస్లింలపై విషం కక్కారు. ముస్లిం మహిళలు దొంగ ఓట్లు వేస్తారంటూ వారి ముఖాలకు ఉన్న బుర్ఖాను తీసి అవమానించారు. మాధవీలతకు అనుమానం రావడంతో తప్పెమీ ఉండకపోవచ్చు.. ఎందుకంటే హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగిన ప్రతీసారి భోగస్ ఓట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. ముఖం చూపించకుండా ఓటు వేసిన వారే మళ్లీ మళ్లీ ఓటు వేస్తుంటారన్న ప్రచారమూ ఉంది. వేలుకు వేసే సిరా చుక్కను ఏదో రసాయనంతో మాయమయ్యేలా చేస్తారని చెబుతుంటారు. అయితే వీటికి ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలు లేవు.
A case is registered in Malakpet Police Station against Smt Madhavi Latha, Contesting candidate, BJP under sections 171C, 186, 505(1)(c) of IPC and Section 132 of the Representation of the People Act
— Collector Hyderabad (@Collector_HYD) May 13, 2024
ఇలా చేయడం కరెక్ట్ కాదు:
మాధవీలతకు డౌట్ అనిపిస్తే సంబంధిత అధికారులకు చెప్పాలి. అంతేకానీ బుర్ఖా వేసుకోచ్చినవారి ముఖాలను, ఓటర్ ఐడీని పదేపదే చూడడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేయడం అవతలి వారిని అవమానించడమే అవుతుంది. ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్‌ల వద్ద ఉండడం నిబంధనలకు విరుద్ధం కూడా. అయితే మాధవిలతకు ఇవేవి పట్టినట్టు లేవు.. ముస్లింలను అవమానించడమే పనిలా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది.
ఇటు ఈమె.. అటు ఆయన.. సరిపోయారు:
ఓవైపు మాధవీలత హైదరాబాద్‌లో హద్దుమీరితే అటు నిజామాబాద్‌లో ధర్మపూరి అరవింద్ ఇదే విధమైన గొడవ చేశారు. వీరి పార్టీ సిద్ధాంతాల వైపరిత్యం అలా ఉంటుంది మరి. ఏదైనా లీగల్‌గా, ఆఫీషియల్‌గా ముందుకు వెళ్లాలి కానీ అనవసరమైన పెత్తనం చలాయిస్తే తగిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మాధవీలతపై ఈసీ ఇప్పటికే సీరియస్ అయ్యింది. మహిళా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్ద బుర్ఖా తొలగించాలని కోరిన ఈమెపై పలు ఐపీసీ సెక్షన్ల కింద హైదరాబాద్ మలక్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: అబద్ధాలు, విద్వేషాలే మోదీ పునాదులు! అసలు ఎలక్షన్ కమిషన్ నిద్ర లేచేనా?

Water Crisis: ఎండుతున్న భాగ్యనగరం..ఈ సమస్యకు పరిష్కారం ఇదేనా?
Cost of living in India: తడిసి మోపెడువుతుంది.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఇదే సీన్!
Real Estate Scams: సామాన్యులకు టోపి పెడుతున్న బడా రియల్ఎస్టేట్ కంపెనీలు.. ఈ మోసాలకు అడ్డు వేసేది ఎవరు?
Biryani Billing Scam: ఒక ప్లేట్ బిర్యానీ 70వేల కోట్ల స్కామ్‌ను ఎలా బయటపెట్టింది?
Numaish: జేబుకు చిల్లు..ఫుడ్ కంపు.. అడుగడుగునా దోపిడి.. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మోసాలివే!
Humanity: సికింద్రాబాద్‌లో మొదలైన జార్జ్ నిశ్శబ్ద విప్లవం.. ఆకలిని గౌరవంగా ఎదుర్కొన్న ఒక ఆలోచన!