ఇండియాలో పిల్లల ఆరోగ్యంపై ఒక ఆందోళనకరమైన పరిస్థితి బయటపడుతోంది. చిన్న వయసులోనే పెద్దలకు వచ్చే హార్ట్ సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది పిల్లల్లో ఐదు సంవత్సరాల వయసు నుంచే రక్తంలో కొవ్వు పదార్థాలు పెరగడం, రక్తపోటు ఎక్కువగా ఉండటం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బెంగాల్ ప్రాంతంలో స్కూల్ పిల్లలకు ట్రైగ్లిసరైడ్ సమస్య కనిపిస్తోంది. అంటే రక్తంలోని కొవ్వు(Fat) ఎక్కువగా ఉండడం చాలా సాధారణమైపోయింది. ఈ పదార్థం ఎక్కువైతే హృదయానికి ఒత్తిడి పెరిగి రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. కేరళలో చిన్న వయసు పిల్లలలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా పెద్దవారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపించడం చాలా ఆందోళన కలిగించే విషయం. ఢిల్లీలో టీనేజర్లలో రక్తపోటు పెరుగడం ఒక తీవ్రమైన సంకేతంగా భావించబడుతోంది. ఒత్తిడి, జంక్ ఫుడ్ అలవాట్లు, నిద్ర లేకపోవడం, కాలుష్యం లాంటి కారణాలు దీనికి కారణంగా భావిస్తున్నారు.
ఈ సమస్యలు ఎందుకు ప్రాధాన్యం కలిగి ఉన్నాయంటే పిల్లల శరీరం ఇంకా ఎదుగుతున్న దశలో ఉండడం వలన వీటి ప్రభావం భవిష్యత్తులో చాలా తీవ్రమైపోతుంది. పెద్దయ్యే సమయానికి హార్ట్ అటాక్స్, డయాబెటిస్, స్ట్రోక్ లాంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు కనబడుతున్న చిన్న సమస్య రేపు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల ఆరోగ్యం కోసం కుటుంబాలు, స్కూళ్లు కలిసి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. జంక్ ఫుడ్ తగ్గించడం, పిల్లలు బయట ఆడే సమయాన్ని పెంచడం, సరైన నిద్ర కల్పించడం, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించడం లాంటి చర్యలు ఈ పరిస్థితిని కొంతమేర నియంత్రించగలవు. ఇక ఇండియా త్వరలోనే ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు నుంచి చర్యలు తీసుకోవడం తప్పనిసరి.
ALSO READ: ఇండియావైపు దూసుకొచ్చిన భారీ బూడిద.. ఆ అగ్నిపర్వతం పేలుడుతో ముప్పు పొంచి ఉందా?

Gut Health Disorders: ఆల్కహాల్, స్మోకింగ్, స్ట్రెస్, డిప్రెషన్.. యువతలో పెరుగుతున్న గట్ హెల్త్ డిజార్డర్స్!
China-India Crude: భారత్కు రావాల్సిన క్రూడ్ ఆయిల్.. చైనా వైపు మళ్లిందా?
ఆమె నడిచిన దారి..! కొన్ని పరిచయాలు జీవితానికి కొత్త అర్థాన్ని నేర్పుతాయి
Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?