Menu

ఆ ఛానెల్‌లో జీతాలు ఇవ్వరు…పైగా క్యాస్ట్ పిచ్చి..! పేరుకేమో IAS..చేసేదేమో దగా బిజినెస్..!

Triya (Tri Ten B🏳️‍🌈) 18 seconds ago
telugu media biased

ప్రతీ ఛానెల్‌ రక్తానికి ఒక ఫిక్స్‌డ్‌ రంగు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మీడియా సంస్థల రక్తం పసుపు రంగులో ప్రవహిస్తే మరికొన్ని సంస్థల రక్తం బులుగు రంగులో ఏరులై పారుతుంటుంది. అయితే ఓ మీడియా సంస్థ రక్తం మాత్రం పూటకో రంగులో కనిపిస్తుంటుంది. ఛైర్మన్‌ సార్ ఎప్పుడు ఏ రంగు అంటించుకుంటారో ఆయనకే తెలియదు. పేరుకేమో IAS.. చేసేదేమో దగా బిజినెస్. జీతాలు ఇచ్చి ఇప్పటికే మూడు నెలలు కావోస్తోంది. కొంతమందికి ఆరు నెలలు దాటినా చేతికి డబ్బు రాలేదు. తొంబై తొమ్మిది సార్లు నెత్తి బాదుకున్నా ఉపయోగం లేని దుస్థితి. జీతాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే ‘సార్ కుటుంబంలో ఈ మధ్యే ఒక పెళ్లి పండుగ జరిగింది కదా.. జీతాలు కాస్త లేట్ అవుతాయ్’ అనే సమాధానమే వినిపిస్తోంది. ఇవేం కరివేపాకు రాజశేఖర్ కబుర్లో అర్థంకావడంలేదు. ఉద్యోగుల కడుపు కొట్టి పెళ్లిళ్లకు డబ్బులు తగలేయడం ఏంటో మరి.

ఇది న్యూట్రల్ చానెల్ కాదు. అది షరా మామూలే కానీ ఇక్కడ ముసుగు వేసుకోవడమే అత్యంత ప్రమాదకరం. పచ్చ ఛానెల్స్ ఏవో, బులుగు ఛానెల్స్ ఏవో ప్రజలకు క్లారిటీ ఉంది కానీ ఈ చానెల్ ఎవరి పక్షమో చాలా మందికి తెలీదు. వ్యూస్ కోసం ఒక పార్టీ, ఒక నాయకుడు. పదవి కోసం మరో పార్టీ, మరో నాయకుడు. సాక్ష్యాత్తు ఆఫీస్‌లోనే పార్టీ మనుషులు ఫ్యాన్‌ గాలికి గిరాగిరా తిరుగుతున్నారు.. ఎందుకంటే అక్కడ ఏసీలు పనిచేయవు. కూర్చిలకు బొక్కలెక్కువ కంటెంట్‌లో పస తక్కువ. ఇటు గాజు గ్లాసు పట్టుకుని ఆఫీస్‌లోనే తిరిగే కాపోన్మాదుల లెక్కకు అంతేలేదు. కులం చూసే ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. గ్రీకు ఇతిహాసాల్లో కరివేపాకు రాజశేఖర్‌ గురించి పెద్దగా ప్రస్థావన లేదు కానీ.. ఈయనకి ఉన్న కుల పిచ్చి బూతు ఛానెల్‌ కిట్టు అంకూల్‌కి ఏమాత్రం తక్కువ ఉండదని పెద్ద టాకు.

ఈ ఛానెల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆవేదన వర్ణించలేని విధంగా ఉంది. ఇంటి అద్దెలు కట్టాలి, కుటుంబాలను పోషించుకోవాలి, నిత్యావసరాలు కొనుక్కోవాలి.. ఇవన్నీ జీతం మీద ఆధారపడి బతికే ఉద్యోగులకు ఉండే కనీస అవసరాలు. అలాంటి వేతనజీవుల జీవితాలతో ఆటలాడుకునే హక్కు ఎవరిచ్చారు? జీతాల కోసం చివరకు మాజీ ఉద్యోగులు సైతం ధర్నాకు దిగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఏమో ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తొంబై తొమ్మిదిసార్లు పింకు రంగు ఆఫీస్‌ చుట్టూ తిరగాలేమో.

అయితే ఈ ఛానెల్‌లో మరో విచిత్రమైన వ్యవహారం కూడా ఉందట. పని చేసేవాళ్లకు ఒక రకమైన న్యాయం.. పని చేయని పెద్దమనుషులకు మరో రకమైన న్యాయం. కంటెంట్ తయారుచేసేది ఎవరు? వార్తల కోసం తిరిగేది ఎవరు? స్క్రిప్టులు రాసేది ఎవరు? వీడియోలు ఎడిట్ చేసేది ఎవరు? రాత్రింబవళ్లు కష్టపడేది ఎవరు? కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులే కదా! మరి సంస్థలో కీలక హోదాలు అనుభవిస్తూ, అసలు పనితో సంబంధం లేకుండా నెలనెలా భారీ జీతాలు తీసుకునే పెద్దమనుషుల సంగతేంటి? వాళ్లకు జీతాల విషయంలో ఎలాంటి కొరత ఉండదట. కష్టపడేవాళ్లకు మాత్రం జీతం ఇవ్వడానికి నిధుల కొరత! ఇదేం విచిత్రమైన లెక్క? ఉత్పత్తి చేసేవాడికి ఆకలి.. ఉత్పత్తి మీద పెత్తనం చేసేవాడికి విందు అన్నట్టుగా లేదూ ఈ వ్యవహారం?

నిజానికి తెలుగు మీడియా రంగమే ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎక్కడ చూసినా లేఆఫ్‌లు, కాస్ట్ కటింగ్‌లు, ఉద్యోగుల తొలగింపులు, జీతాల్లో కోతలు. సంస్థల ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఎడాపెడా ఉద్యోగాల నుంచి పీకిపడేస్తున్నారు . ఏళ్ల తరబడి పనిచేసిన వారిని సంస్థ వాట్సాప్‌ గ్రూపుల నుంచి కనీసం ఇన్ఫామ్ చేయకుండా రిమూవ్ చేసేస్తున్నారు. క్లియర్‌గా ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి వర్క్ కల్చర్‌ కంటిన్యూ అవుతున్న తర్వాత ఈ దిక్కుమాలిన రంగంలోకి కొత్తగా ఎవరూ రాకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది. కావాలంటే సారా దుకాణం నడుపుకోవడం మేలు..ఎందుకంటే సారా రంగు కనీసం పూటకు ఒకసారి మారదు.

గమనిక / Disclaimer: ఈ కథనం పూర్తిగా కల్పిత రచన. సినిమా కథా చర్చలు, స్క్రిప్ట్ రైటింగ్‌లో భాగంగా రూపొందించిన ఒక ఊహాజనిత కథనం మాత్రమే. ఇందులోని పాత్రలు, సంస్థలు, సంఘటనలు, సంభాషణలు అన్నీ కల్పితం. జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తులతో, వాస్తవ సంస్థలతో ఏవైనా పోలికలు కనిపిస్తే అది మీ ఖర్మ మాత్రమే. ఈ కథనం చదివి ఎవరి మనోభావాలు, జిల్లకర్ర, ఆవాలు, వడియాలు దెబ్బతిన్న మాకు సంబంధంలేదు.


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *