Disclaimer: This is a guest column. The views expressed are solely those of the author and do not reflect the views or editorial position of Prajadhwani. Names and identities have been withheld in accordance with our editorial policy.
పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. ఉన్నోడు బాగా బలిసి సొంత మీడియా చానల్ పెడితే.. అతగాడిని నమ్మి, అరచేతిలో వైకుంఠం చూసి మోసపోయి, ఉద్యోగాల కోసం క్యూ కట్టిన జర్నలిస్టులు కూడా.. ఆఖరికి జీతాలివ్వకుండా వెళ్లగొడితే.. గొర్రెల మందలా సైలెంట్ గా పక్కకు తప్పుకోవడం మినహా.. ఏమీ చేయలేని పరిస్థితి. సొంత ప్రాపకం కోసమో, సమాజాన్ని మరింత మోసగించొచ్చనో, తప్పుల్ని కప్పిపుచ్చుకోవచ్చనో, తమ దుర్మార్గాలకు కవరింగ్ ఇచ్చే ముసుగు కోసమో… తెలంగాణలో ఓ రియల్ ఎస్టేట్ దొర ఒక “గొట్టం” చానల్ పెట్టుకున్నాడు. నక్క తోక తొక్కినట్లు, లాటరీ తగినట్లు రియల్ ఎస్టేట్ లో అతనికి లాభాలొచ్చాయి. ఆ రంగంలో వచ్చిన ఇన్ స్టాంట్ ఇమేజ్ తో రాజకీయాలు, సినిమాలపై కూడా మోజు పెంచుకున్నాడు సదరు దొరగారు. క్రమంగా ఓ పార్టీకి చెందిన నాయకుల పంచన చేరడం మొదలుపెట్టాడు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సతీమణికి టికెట్ కూడా ఇప్పించుకున్నాడు, కౌన్సిలర్ గా గెలిపించుకున్నాడు. ఏకంగా చైర్మన్ పీఠంపై కన్నేశాడు కానీ… ఆశ్రయం ఇచ్చిన పార్టీ నాయకులు కాస్త ఓపిక పట్టమన్నారు. డబ్బు బలుపు ఉంటే సరిపోదు.. రాజకీయాల్లో ఓపిక అవసరం అంటూ మనోడిని పక్కన పెట్టేశారు.
సొంత “గొట్టం” మీడియా పెట్టుకోకముందు నుంచీ మనోడికి కెమెరాలన్నా, షూటింగులు, ఇంటర్వూలన్నా తెగ పిచ్చి. హైదరాబాద్ లో బాగా పాపులర్ అయిన ఓ గణేష్ ఉత్సవ అసోషియేషన్ లో చక్రం తిప్పి.. గణేష్ లడ్డూని 50 లకారాలు పోసి వేలం పాటలో దక్కించుకున్నాడు. అప్పటి నుండి ఆ ఫేమస్ అసోసియేషన్ ప్రతిష్టించే రియల్ గణేషుడి కన్నా.. మన రియల్ ఎస్టేట్ “గోల్డ్” స్టారే బాగా పాపులర్ అయ్యాడు. ఇలాంటి వాళ్లను ఇంటర్వూలు చేయడానికే పుట్టుకొచ్చిన కొన్ని డిజిటల్ మీడియా చానళ్లు.. మనోడిని స్టూడియోలో కూర్చోబెట్టుకుని తెగ మాట్లాడించేశాయి. పాపులర్ చేశాయి. దాంతో మనోడికి ఉన్న మీడియా గొట్టాల పిచ్చి మరింత ముదిరింది. దాంతో సొంతంగా గొట్టం మీడియా చానల్ ఒకటి పెట్టుకుని చెలరేగిపోదాం అనుకున్నాడు. అయితే ఏది చేసినా అందులో వ్యాపారమే చేయాలన్నది మనోడి ఫిలాసఫీ. అలా సంపాదించుకున్నది రెట్టింపు చేద్దామని రంగంలోకి దిగాడు. అదే సమయంలో మనోడికి వరల్డ్ ఫేమస్ మోటివేటర్ అని చెప్పుకునే ఓ మేధావి జతయ్యాడు. మనోడి స్లీపింగ్ ఫేసు ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులకు పరిచయం లేదు. దాంతో అందరికీ నీతులు, సూక్తులు చెబుతూ అప్పటికే పాపులర్ అయిన మోటివేటర్ ను మెయిన్ ఫేస్ గా ముందుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులకు గాలం వేశాడు. అందులో పడ్డ కొందరు మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు.. అధిక జీతాలకు ఆశపడి తాము చిక్కుకోవడమే కాకుండా.. చిన్నా చితకా ఛానెల్స్ లో నిమ్మళంగా పని చేసుకుంటున్న జూనియర్, సీనియర్ సబ్ ఎడిటర్లను, రిపోర్టర్స్, యాంకర్స్, వీడియో ఎడిటర్లు, SEOలు, గ్రాఫిక్ పర్సన్లు.. ఇలా 60, 70 మందిని ఈ బురదలోకి లాగారు. వీరితో పాటు అసలు మీడియాకు సంబంధం లేని మరో 50 మంది వరకు సొంత బ్యాచ్ ను లక్షల్లో జీతాలు ఆఫర్ చేసి కేవలం షో కోసం పెట్టుకున్నారు. ఆఫీస్ బాయ్స్ తో కలుపుని స్టాఫ్ సంఖ్య 100 నెంబర్ దాటేసింది. ఒక మీడియం సైజు సాటిలైట్ ఛానెల్ కే 100 మంది ఉద్యోగులు ఉండరు.. అలాంటిది ఒక గొట్టం ఛానెల్ కు 100 మంది స్టాఫ్ ఎందుకు అంటారా…? అసలు కథ, అసలు మోసం అందులోనే ఉంది.
అందమైన అద్దాల ఆఫీస్, అందులో వంద మంది ఎంప్లాయీస్. ఈ బిల్డప్, సెటప్ చూపించి.. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 300 లకు పైగా నియోజకవర్గాల్లో.. నియోజక వర్గానికి ఒకటి చొప్పున ఫ్రాంచైజీలు చేసి, ఇన్వెస్టర్లను బకరాలను చేసి అమ్మెద్దాం అనుకున్నారు. చెప్పా కదా.. మనోడు ఏది చేసినా అందులో వ్యాపారమే చూస్తాడనీ. మనోడికి గోల్డ్ అన్నా, కరెన్సీ కట్టాలన్నా అంత యావ. అది అందరికీ ఉంటుంది.. కానీ మనోడికి పీక్స్ లో ఉంటుంది. కానీ.. మనోడికి మీడియా ఫీల్డ్ లో ఉన్న జీరో నాలెడ్జ్ కి, ఆ దిక్కుమాలిన బిజినెస్ ఫార్ములా వర్కవుట్ కాలేదు. అప్పటి నుండి మనోడిలో ఉన్న ఫక్తు కార్పొరేట్ కన్నింగు మెంటాలిటీని బయటపెట్టడం మొదలు పెట్టాడట.
నేటికి ఉద్యోగులకు 2 నెలల జీతం బకాయిలు పెట్టీ, నిర్ధాక్షిణ్యంగా వారిని ఇక ఆఫీసుకు రావొద్దని తన చెంచాలతో nakedగా చెప్పించాడట. మనోడి కింద పని చేసే HR, ACCOUNTS సెక్షన్ ఉద్యోగులు రెచ్చిపోయి… ఇతర ఉద్యోగుల్ని పురుగుల్ని చూసినట్లు చూడటం మొదలు పెట్టారట. జీతాల కోసం పొద్దుననంగా వచ్చిన వాళ్లను సాయంత్రం వరకు వెయిట్ చేయించి.. చివరకు 5 వేలో, 10 వేలో చేతిలో పెట్టి.. దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్లుగా ఇండైరెక్టుగా మాటలనేవారట. మిగతా బాలెన్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారు అని అడిగిన వారికి ఆన్సర్ ఉండదు. రాత్రి 7 గంటలకు కౌంటర్ ఓపెన్ చేసి.. ఉద్యోగుల్ని గొర్రెల్లా గంటల తరబడి లైన్ లో నిల్చోబెట్టి.. 5 వేలు, 10 వేలు ఇచ్చి నోర్లు మూయించారట. రెండు నెలలుగా పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగికి ఇప్పటికీ సగం నెల జీతం కూడా చేతికందలేదు. తెగించి తిరగబడదాము అన్నంత ఆక్రోశం, ఆవేదన ఉన్నా.. రచ్చ చేసి రోడ్డుకెక్కితే మళ్ళీ ఇదే మీడియా ఫీల్డ్ లో అవకాశాలు రావేమో అన్న భయం పాపం ఆ ఉద్యోగులది. హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ, రాను పోను మూడు, నాలుగు గంటలు ప్రయాణిస్తూ రెండు నెలలుగా పనిచేస్తున్న.. చిన్న మొత్తాల్లో జీతాలున్న ఉద్యోగులకు సైతం కనీసం బస్ ఛార్జీలు, మెట్రో ఛార్జీల మేర కూడా చెల్లించలేదు సదరు ఫ్రాడ్ గొట్టం ఛానెల్ యాజమాన్యం. ఇక్కడ దరిద్రం ఏంటో తెలుసా..? మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో దశాబ్దానికి పైగా అనుభవమున్న, ఇదే గొట్టం ఛానెల్ లో ఉన్న, బాధితులను ఇందులోకి లాగిన కొందరు highly paid జర్నలిస్టులు నోళ్ళు మూసుకుని ఉండటమే. తాము తీసుకొచ్చిన, చిన్న చిన్న జీతాలకు ఛానెల్ లో చేరిన జూనియర్లకు అండగా ఉండాల్సింది పోయి… వాళ్లను వదిలించుకునే బాధ్యత కూడా యాజమాన్యం తరఫున వీళ్లే తీసుకోవడం మరో దుర్మార్గం.
మీడియాను మీడియాగా నడిపే ఆలోచన ఉంటే.. సమాజంలో బాధ్యత గల, మీడియా పట్ల ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు ముందుకొచ్చేవారేమో. కానీ మీడియాను ఫ్రాంచైజీలు చేసి కోట్లు పోగేసుకుంటాం, కొనుక్కోండి అంటే ఎవడు ముందుకొస్తాడు. ఈ మాత్రం ఐడియా ఇప్పటికే నిలదొక్కుకుని ఉన్న పెద్ద మీడియా సంస్థలకు తెలియకనా? మన రియల్ ఎస్టేట్ సికిందర్ కు ఈ దిక్కుమాలిన ఐడియా ఎవడు చెప్పాడో మరి. 10 రోజుల్లో ఆఫీసు తెరిచేసి, షో పుటప్ చేయడం కోసం వంద మంది ఉద్యోగుల్ని ఇందులోకి లాగేసి, నెలకే కోట్ల రూపాయలు వచ్చి పడతాయని కలలు కని.. చివరికి నమ్మి వచ్చిన వంద మందిని రోడ్డు మీద నిలబెట్టింది ఆ సోకాల్డ్ గొట్టం ఛానెల్. అయినా.. ఇంతమంది మీడియా సిబ్బందిని బజారున పడేసిన మనోడు.. ఒంటి మీద 5 కోట్ల గోల్డు తగిలించుకుని, కోటి రూపాయల కారులో థిలాసాగా తిగుతున్నాడు అంటే.. బరితెగించి తిరగమని వ్యవస్థలు అతనికి ఎంత భరోసాను ఇచ్చాయో.. అర్థం అవుతోంది.
ఒక్కటి మాత్రం నిజం.!! మీడియా అంటే బాధ్యతగా, నిజాయితీగా ఉద్యోగాలు చేసుకుంటున్న వారి కెరీర్లు నాశనం చేసి, వారి ఉసురు తగలకుండా తప్పించుకుందాం అనుకుంటే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. దీని ఎఫెక్టు జీవితాంతం ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటుంది. ఏదో ఒకనాడు పాపం పండినప్పుడు బయట పడే ఛాన్సు లేకుండా గత పాపాలన్నీ పగ పట్టడం ఖాయం. సదరు రియల్ ఎస్టేట్ హీరో.. ఈ విషయం అర్థం చేసుకుని జరిగిన తప్పు దిద్దుకుంటాడో లేదో వేచి చూద్దాం.
Note: Prajadhwani encourages responsible voices working towards social welfare and transparency. However, the opinions expressed in this article are solely those of the author, and the management does not endorse or assume responsibility for the statements made herein. Any resemblance to any individual or entity is unintentional.
గుమ్మడి కాయ దొంగ ఎవరంటే కొంతమంది ముందే భుజాలు తడుముకుంటారు
ALSO READ: టార్గెట్ల ముసుగులో జర్నలిజం ఏనాడో చ*చ్చిపోయింది.. కాదు కాదు యాజమాన్యాలు చం*పేశాయి!

వార్తల్లో కులం పేరును ప్రస్తావిస్తే క్యాస్ట్ కార్డ్ వాడుకున్నట్టా? సనాతన వీరులు కచ్చితంగా ఇది తెలుసుకోండి!
Casteism in Media: పనిచేసేవాడి చేతికి బొచ్చే…భజన చేసేవాడికి బిర్యానీ..! మీడియాలో కుల కంపు!
Journalism-Terr*rism: టెర్రరిజం స్థాయికి చేరిన జర్నలిజం..! ఏకంగా ఉగ్రవాదులకే సవాల్ విసురుతున్నారుగా!
Journalism: టార్గెట్ల ముసుగులో జర్నలిజం ఏనాడో చ*చ్చిపోయింది.. కాదు కాదు యాజమాన్యాలు చం*పేశాయి!
Ramoji Rao: జర్నలిజాన్ని కూడా బిజినెస్ చేసిన సక్సెస్ఫుల్ వ్యాపారి..! ఆ పార్టీ వల్లే పైకి ఎదిగారా?