ఒక ఉద్యోగం జీతాన్ని ఇస్తుంది కానీ జీవితాన్ని కూడా తీసుకుపోతంది. పని పేరుతో మొదలైన ఒత్తిడి
నెమ్మదిగా మనిషిని లోపల నుంచి చంపుతుంది. మీటింగ్ మధ్యలో శ్వాస ఆడకపోవడం, డెస్క్ వద్ద కూర్చొనప్పుడు చేతులు వణుకడం, ఒక్క మెసేజ్‌తో రాత్రంతా నిద్ర లేకుండా పోవడం..! ఇవి ఇప్పుడు అరుదు కాదు.. చాలా సాధారణమైపోయాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం యాంగ్జైటీ, డిప్రెషన్ కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచానికి దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల నష్టం జరుగుతోంది. అంటే సుమారు 80 లక్షల కోట్ల రూపాయలు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే.. 25 ఏళ్లలోపు ఉద్యోగుల్లో 90 శాతం మందికి పైగా యాంగ్జైటీ లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఇది పని ఒత్తిడి కాదు.. ఇది ఆరోగ్య సంక్షోభం స్థాయికి చేరిన పరిస్థితి. శ్వాస వ్యాయామాలు, యోగా, మోటివేషన్ టాక్స్.. ఇవి ఉపశమనం ఇవ్వొచ్చు కానీ పరిష్కారం కావు. అసలు సమస్య పని చేసే విధానంలో, వ్యవస్థలో ఉంది. ఎందుకంటే ఉద్యోగం ఇప్పుడు మనిషిని నిలబెట్టడం లేదు..నెమ్మదిగా కూలదోస్తోంది! ఇది ఇక్కడితో ఆగిపోయే పరిస్థితి కాదు. ఈ సమస్య ఎంత పెద్దదో డేటానే చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది డిప్రెషన్, యాంగ్జైటీ కారణంగా లీవ్స్ పెడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అంటే ఈ సమస్యలు నేరుగా ప్రొడక్టవిటీ, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇండియాలో పరిస్థితి కూడా తక్కువేమీ కాదు. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి ఏడుగురిలో ఒకరికి మెంటల్ హెల్త్ సమస్యలు ఉన్నాయని అంచనా. కార్పొరేట్ రంగంలో పని చేసే వాళ్లలో బర్నౌట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో పని గంటలు 10 నుంచి 14 గంటల మధ్య ఉండటం సాధారణంగా మారిపోయింది.
ఇక్కడ అసలు సమస్య పని చేసే విధానం. ఎప్పుడైనా అందుబాటులో ఉండాలనే కల్చర్. ఆఫీస్ టైమ్ అనే బౌండరీ పూర్తిగా చెరిగిపోయింది. రాత్రి మెసేజ్‌లు, వీకెండ్ కాల్స్, ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండాల్సిన ఒత్తిడి కనిపిస్తోంది. అందుకే మెదడుకు విశ్రాంతి ఉండడం లేదు.
కంపెనీలు ఇప్పటివరకు ఇచ్చిన పరిష్కారాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. వెల్‌నెస్ ప్రోగ్రామ్స్, యోగా సెషన్స్, మోటివేషనల్ వర్క్‌షాప్స్ లాంటివి ప్రాబ్లెమ్‌ను తాత్కాలికంగానే సాల్వ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒత్తిడి తగ్గించకుండా రిలాక్స్ అవ్వాలని చెప్పడం విడ్డూరం. 70 గంటలు పని చేయించి 10 నిమిషాల ధ్యానం చెయ్యమని చెప్పడం వల్ల పరిస్థితి మారదు. ఇది కేవలం మానసిక సమస్యగా మాత్రమే ఉండడం లేదు.. ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఒత్తిడి, హరాస్మెంట్, ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీ లాంటి అంశాలు ఆత్మహత్యలకు కారణాలుగా నిలుస్తున్నాయి. హై ప్రెషర్ ఇండస్ట్రీల్లో ఈ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మారాల్సింది వ్యక్తి కాదు.. వ్యవస్థ. కంపెనీల్లో మెంటల్ హెల్త్ సపోర్ట్‌ను తప్పనిసరి చేయాలి. ఒత్తిడిని గుర్తించే సిస్టమ్ ఉండాలి. మెంటల్ హెల్త్ లీవ్స్‌ను కూడా ఫిజికల్ హెల్త్ లాగే చూడాలి.
ముఖ్యంగా ఉద్యోగి మాట్లాడేందుకు భయపడే వాతావరణం పూర్తిగా మారాలి. ఇప్పుడు పరిస్థితి ఒక స్పష్టమైన దిశలోకి వెళ్తోంది. ఉద్యోగం కోసం మనిషి పని చేయడం కాదు.. ఉద్యోగం కోసం తన ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నాడు. మొత్తానికి ఇది స్ట్రెస్ కాదు.. ఇది సిస్టమ్ డిజైన్ సమస్య. ఇది మారకపోతే పని చేసే వాళ్లు పెరుగుతారు కానీ నిలబడే వాళ్లే తగ్గిపోతారు.
ALSO READ: 50లక్షల మంది పిల్లలను చంపేశారా? ఐక్యరాజ్యసమితి రిపోర్టులో నమ్మలేని నిజాలు!

Satyagraha: నాడు స్వామి జ్ఞాన్ స్వరూప్..నేడు సోనమ్ వాంగ్‌చుక్.. ప్రభుత్వాలకు నిరాహార దీక్షలంటే ఎందుకంత భయం?
‘ప్రశ్నించడం తప్పే అయితే నేను ఆ తప్పును మళ్లీ మళ్లీ చేస్తా.. ప్రశ్నించడమే నేరమైతే నేను మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తా’
Pronouns: ఎవరిని ఎలా పిలవాలి? ‘ఆమె’… ‘అతను’… ఈ చిన్న పదాల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
ప్రశ్నను భరించలేకపోతేనే కాదు.. ప్రశ్నించడం చేతకాకపోయినా ప్రజాస్వామ్యం కూలిపోతుంది!
Indian Coming Out Day: ‘నేను నాలాగే ఉంటాను..’ భారతీయ LGBTQ చరిత్రలో చెరిగిపోని రోజు!
Explainer: నిర్లక్ష్యం… అవినీతి…పేరుకుపోయిన వైఫల్యాలు! ఇండియాలో ప్రాణాలకు విలువ లేదా?