Menu

Parenting: మీ కలలను మీ పిల్లలపై రుద్దకండి.. వాళ్ల సంతోషాన్ని చంపకండి!

Lakshmi Aruna 9 months ago
child psycology telugu news

ఒక చిన్నారి చేతిలో పెన్ను ఉంటుంది. అతడు గీసిన గీతలు అర్థంకాలేదు కానీ, అతడి మెదడులో ఒక చిత్రం ఉంటుంది. కానీ..మధ్యలోనే ఆ పెన్ను పక్కన పడేసి,తను చేతిలోకి బుక్‌ తీసుకున్నాడు. ఎందుకంటే ఆ చిన్నారి తన మనసే కాదు… తన తల్లిదండ్రుల కలలూ మోస్తున్నాడు.

మీకు తెలుసా.. బుడిబుడి అడుగులతో మొదలైన ఆ ప్రయాణం.. ఒక్కసారి ‘రా’ అనే అమ్మ మాటతో మొదలవుతుంది. కానీ తర్వాత మాత్రం ఆ ప్రయాణానికి వాళ్లతో సంబంధముండదు. నెమ్మదిగా.. పిల్లల జీవితాన్ని మన ఆశల బరువుతో తీర్చిదిద్దడం మొదలవుతుంది. ఈ మార్కులు తెచ్చుకున్నావా? ఆ పరీక్ష రాశావా? నేర్చుకున్నావా? అంటే… నేనెప్పుడు శ్వాస తీసుకోవాలి అని వాళ్లు అడగలేరు.

ఒక్కసారి మనం ఆ చిన్నారి మనసులోకి చూసే ప్రయత్నం చేశామా? అయిదో తరగతిలో చదువుతున్న పిల్లవాడికి అప్పుడే కోచింగ్ సెంటర్. ఆటంటే భయపెడతాం. రెస్ట్ అంటే టైమ్ వేస్ట్ అంటాం. చదువు చదువు అని చెబుతూ, తానుగా నేర్చుకోవడాన్ని విడిచిపెడతాం.

తల్లిదండ్రుల ప్రేమ… బిడ్డల విజయానికి పునాది అయితే, అదే ప్రేమ ఒక ఆజ్ఞగా మారినప్పుడు అది ఒక మౌన హింసగా మారిపోతుంది. కొందరు పిల్లలు నాకు చదవడం ఇష్టం లేదు అని బయటకు చెబుతారు. కానీ చాలామంది మాత్రం.. చెప్పే అవకాశం లేకే అలానే పెరిగిపోతారు. ఎందుకంటే వాళ్లకి భయం ఉంటుంది. ప్రేమ కోల్పోతామేమో, ఆమోదం కోల్పోతామేమో అన్న అస్పష్టమైన బాధ.

మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న టీనేజ్ డిప్రెషన్, అనారోగ్యంగా మారుతున్న మానసిక పరిస్థితుల వెనక అసలు కారణం ఏంటి? స్కూల్, ట్యూషన్, మార్కులు, మెడల్ కోసం మనం రెడీ ఆడటానికి… కానీ వాళ్ల మనసు వినడానికి మాత్రం మనకి టైమ్ ఉండదు. వాళ్లు ఏడుస్తున్నారో, ఒత్తిడితో బతుకుతున్నారో అన్న సంగతి మనకి పట్టదు. పిల్లల కలలు వాళ్లవే కావాలి. మన కలల్ని వాళ్ల మీద మోపడం ద్వారా వాళ్లు ఆ కలల్ని జీవించరు… భరించడమే నేర్చుకుంటారు. ఓనమాలు వాళ్ల జీవితాన్ని తీర్చిదిద్దుతాయో లేదో తెలియదు కానీ, తప్పనిసరిగా వారిలో సంతోషాన్ని మాత్రం చంపుతాయి.

ఒక చిన్నారి ఓడిపోతే మనం కోప్పడతాం. గెలిచినా సరే.. మరింత ఎక్కువ ఆశిస్తున్నాం. ఎందుకంటే మన ఆశలు అనేకం, కానీ వాళ్ల శక్తి మాత్రం పరిమితమే. ఒక్కసారి వాళ్లు పడ్డ ఒత్తిడిని తెలుసుకోవాలంటే… మనలాగే ఉద్యోగం చేసి, ఇంటికి వచ్చి వాళ్ల హోంవర్క్ చేయించుకునే మన స్థితిని ఊహించాలి. మన వయసులో మనం ఇంతగా చదవలేదే అని గుర్తొస్తే… వాళ్లను ఎందుకు ఈ రోజుల్లో బలవంతంగా అంచనాలకు అడ్డుబెట్టుకుంటున్నాం?

మేము చదివిన పుస్తకాల్లో తప్పులు ఉంటే.. మేం నోట్లలో తిరగొడతాం. కానీ వాళ్లు చదవని పేజీలో మార్కులు రాకపోతే… వాళ్ల మీదే మోపుతాం. వాళ్ల గొంతులో వినిపించే శబ్దం మన కోపాన్ని కాదు.. మన నిరాశను కాదు.. వాళ్లను అర్థం చేసుకోలేని నిస్సహాయతను ప్రతిబింబిస్తుంది.ఇప్పుడు ఓ ప్రశ్న… పిల్లలు నిజంగా ఓడిపోతున్నారా? లేదా… మన అంచనాల్లో వాళ్ల గొంతు మాయమవుతోందా? పిల్లలు బలంగా ఉండాలంటే ముందు మనం వాళ్ల వెన్నుదన్నుగా నిలవాలి. ప్రేమలో ఒత్తిడి ఉండకూడదు. విజయంపై వత్తిడి కాకుండా.. మనిషిగా ఎదగాలనే నమ్మకం ఉండాలి. ఇంతకీ.. పిల్లల గొంతుల్లో వినిపించే వేదన మనకి కనిపించలేదా? ఒకవేళ అలా అనిపిస్తే…అప్పుడే ఆ బిడ్డ ఓ మంచి విద్యార్థిగా కాదు.. ఓ మంచి మనిషిగా ఎదుగుతాడు.

ALSO READ: నా మౌనమే మీ అహంకారానికి కారణమా? ఈ తరం ద్రౌపది: ఎవరికి తలవంచని వనిత..!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *