వ్యూహాలు ఢిల్లీలో పుడుతున్నాయి… కుర్చీలు బెంగళూరులో కదులుతున్నాయి… బయటికి అంతా సైలెంట్‌గా కనిపిస్తున్నా… కర్ణాటక కాంగ్రెస్‌లో మాత్రం పెద్ద రాజకీయ తుఫాన్ మెల్లగా రూపం దాల్చుతోంది. రెండేళ్లుగా చర్చల్లో ఉన్న సిద్ధరామయ్య డీకే శివకుమార్ పవర్ ఫైట్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌కు చేరింది. ముఖ్యమంత్రి కుర్చీ మార్పిడి కోసం కాంగ్రెస్ హైకమాండ్ భారీ స్కెచ్ వేసిందన్న ప్రచారం నిజమేనని తేలింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తన కేబినెట్ కి చెప్పారన్న వార్త రాజకీయాలను ఊపేసింది. అయితే ఇది సాధారణ నాయకత్వ మార్పు కాదని… సిద్ధరామయ్యను పక్కన పెట్టడం కాదని… ఆయనను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే వ్యూహమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆయనను నొప్పించకుండా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర అప్పగించే దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోందన్న సమాచారం ఆసక్తి రేపుతోంది.
✨ Quick Read
- కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు చర్చ
- సిద్ధరామయ్యకు ఢిల్లీ బాధ్యతల ప్రచారం
- డీకే సీఎం ఫార్ములాపై ఊహాగానాలు
AI-assisted summary, newsroom reviewed
చివరకు డీకేదే విజయం:
కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సీఎం కుర్చీపై అంతర్గత పోరు మొదలైంది. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ మొదటి నుంచే ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో సిద్ధరామయ్యకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డీకే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. బయటికి కలిసి కనిపించినా… లోపల మాత్రం రాజకీయ దూరం పెరుగుతూనే వచ్చింది.
ఇప్పుడు ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో డీకే శివకుమార్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం బాధ్యతలు తనకే రావాలనే పట్టుదలతో ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీని గురించే ఢిల్లీలో భారీ స్థాయిలో రహస్య సమావేశాలు జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా దాదాపు ఏడు గంటల పాటు కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం సిద్ధరామయ్యకు గౌరవప్రదమైన ఎగ్జిట్ ఇవ్వడమేనని తాజా పరిణామాలతో ప్రూవ్ అయ్యింది.
డీకే శివకుమార్‌కు ‘ట్రబుల్ షూటర్’ అనే పేరు ఎలా వచ్చింది?
కాంగ్రెస్‌లో సంక్షోభ సమయాల్లో ఎమ్మెల్యేలను కాపాడటం, కూటమి రాజకీయాల్లో కీలక చర్చలు నిర్వహించడం, పార్టీ వ్యూహాలను అమలు చేయడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించడంతో ఆయనకు ‘ట్రబుల్ షూటర్’ అనే పేరు వచ్చింది.
రాజ్యసభకు వెళ్లిన తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుందా?
జాతీయ స్థాయి పదవులు చేపట్టిన నేతలు కూడా తమ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పార్టీ హైకమాండ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న నేతలకు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత కొనసాగుతుంది.
నష్టమా? లాభమా?
సీనియర్ మాస్ లీడర్ అయిన సిద్ధరామయ్యను నేరుగా సీఎం పదవి నుంచి తప్పిస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని హైకమాండ్ అంచనా వేసిందట. అందుకే ఆయనను ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకువచ్చి జాతీయ స్థాయిలో పెద్ద బాధ్యత అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజ్యసభ మార్గం ద్వారా ఆయనను ఢిల్లీకి పిలిపించి ఏఐసీసీలో కీలకమైన సంస్థాగత బాధ్యతలు అప్పగించే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నారని చెబుతున్నారు. జూన్ 8తో కర్ణాటక రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనున్న సమయంలో.. ఇదే సరైన సమయమని భావించి సిద్ధరామయ్యను పదవి దిగిపోయేలా ఒప్పించారని తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యూహం వెనుక రాహుల్ గాంధీ సోషల్ జస్టిస్ ప్లాన్ కూడా కీలకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుల గణన, ఓబీసీ హక్కుల అజెండాతో ముందుకెళ్తోంది. అలాంటి సమయంలో సిద్ధరామయ్యలాంటి బలమైన ఓబీసీ మాస్ లీడర్ జాతీయ స్థాయిలో పార్టీకి అవసరమని అధిష్టానం భావిస్తోందట. ముఖ్యంగా 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఓబీసీ ఓటర్లను ఆకర్షించే ముఖచిత్రంగా సిద్ధరామయ్యను ఉపయోగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లినా ఆయన ప్రాధాన్యత తగ్గదని… పైగా జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వస్తుందని హైకమాండ్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
ఇక సిద్ధరామయ్య ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తే కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే కనిపిస్తోంది. అది డీకే శివకుమార్ పేరు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే రెండున్నరేళ్లు సిద్ధరామయ్య… ఆ తర్వాత డీకే సీఎం అవుతారనే అంతర్గత ఒప్పందం జరిగిందని అప్పటినుంచే డీకే వర్గం చెబుతోంది. ఇప్పుడు పరిస్థితులు కూడా అదే దిశగా కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకేకు చివరకు సీఎం కుర్చీ దక్కే సమయం దగ్గరపడిందన్న చర్చ బలంగా సాగుతోంది. అయితే ఈ మార్పు వల్ల సిద్ధరామయ్య వర్గం అసంతృప్తికి గురికాకుండా చూసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది.
ALSO READ: ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక అపూర్వమైన మార్పు..ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా తైవాన్!

Ebola outbreak: ఎబోలా వ్యాప్తికి కారణమైన అమెరికా? ట్రంప్ నిధుల కోతతో మరణాల మోత
Petrol Price Hike:10 రోజుల్లో నాలుగో సారి పేలిన బాం*బు..కోట్లాది భారతీయులపై ధరల పిడుగు!
Cockroach Janata Party: కాక్రోచ్‌లతో పాటు పెంటపురుగులు కూడా ఏకం కావాల్సిందే! మీ బయాలజీ క్లాసులు తగలయ్యా..!
IRAN VS AMERICA: గోడకేసి కొట్టిన బంతిలా లేచిన ఇరాన్.. మరోసారి వార్‌కు రెడీ!
Gulf War: గల్ఫ్ దేశాలు రెండుగా చీలాయా..? యూఏఈకి సౌదీ షాక్!
Heatwave Explained: ఓవెన్‌లోంచి వస్తున్న వేడి ఆవిరిలా మగ్గిపోతున్న భారతం.. ఈ భారీ ఉష్ణోగ్రతలకు కారణాలేంటి?