Menu

Epstein Files: ‘చంపేస్తానని బెదిరించాడు.. వాడోక సైకో..’ ఎప్‌స్టీన్ బాధితురాలి కన్నీటి వేదన!

Praja Dhwani Desk 2 months ago
epstein files rina ho reveal facts telugu news explained

‘ ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు.. బయటపడడానికి వాహనం లేదు.. ఎవరికైనా చెబితే నన్ను చంపేస్తానని ఎప్‌స్టీన్‌ బెదిరించాడు..’! ఎప్‌స్టీన్‌ వలయంలో చిక్కుకున్న రీనా అనే మహిళ చెప్పిన మాటలు ఇవి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వెనుక దాగి ఉన్న భయంకర నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వేళ బాధితులూ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. రీనా మాటల్లో కేవలం పాత గాయం లేదు.. ఒక మనసు ఎలా మెల్లగా బంధిగా మారుతుందో చెప్పే చీకటి ఉంది.

బయట నుంచి చూస్తే అది ఒక ఆహ్వానం.. ఒక స్కాలర్‌షిప్‌. ఒక అవకాశంలా కనిపించింది.. లోపలికి వెళ్లిన తర్వాత అది ఒంటరితనం, నియంత్రణ, భయం అనే మూడు గోడల మధ్య చిక్కుకున్న జీవితమని అర్థమవుతుంది. ఇది మనసును ముందుగా బలహీనపరచి, ఆ తర్వాత ఆధిపత్యంతో నొక్కివేసే ప్రక్రియ. సైకాలజీలో దీన్ని కోర్సివ్ కంట్రోల్ అంటారు. బాధితుడి ప్రపంచాన్ని కుదించి, ఆధారాన్ని సృష్టించి, ఆ తర్వాత భయంతో కట్టిపడేసే ప్రక్రియ. ఇలాంటి మానసిక ఆధిపత్యం సంవత్సరాల పాటు ఎవరికీ తెలియకుండా కొనసాగుతుంది. దశాబ్దాల మౌనం తర్వాత రీనా ఇప్పుడు మాట్లాడుతుంది.

రీనా చెప్పే ప్రతి మాట ఒక వ్యక్తి దుర్మార్గం గురించి మాత్రమే కాదు, మానసిక నియంత్రణ ఎలా పనిచేస్తుందో చూపించే అధ్యయనంలా ఉంటుంది.

సైకాలజీలో గూమింగ్ అనే పదం ఉంది. మొదట బలహీన పరిస్థితిలో ఉన్నవారిని లక్ష్యంగా ఎంచుకుంటారు. ఆశ చూపించడం, ఆధారం కల్పించడం. తర్వాత ఆ ఆధారాన్ని మెల్లగా నియంత్రణగా మార్చడం ఉంటుంది. రీనాకు వచ్చిన స్కాలర్‌షిప్‌ ఆఫర్ అందులో బాగమే. ఆ స్కాలర్‌షిప్‌ అవకాశం ఎప్‌స్టీన్‌కు ఆధారంగా మారింది. ఆ ఆధారం నియంత్రణగా మారింది. ఆ నియంత్రణ భయంగా మారింది. ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలను నిపుణులు నార్సిసిస్టిక్ లేదా సైకోపాతిక్ మైండ్‌సెట్‌తో కలిపి పరిశీలిస్తారు. బయటకు ఆకర్షణీయంగా కనిపించడం, నమ్మకం కలిగించే మాటలు మాట్లాడడం, లోపల మాత్రం ఇతరులను వస్తువులగా చూడడం ఆ లక్షణాల్లో భాగం. రీనా వర్ణనలో ఈ మానసిక ఆట స్పష్టంగా కనిపిస్తుంది.

ట్రామా పైన్స్ మరో ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. తీవ్రమైన భయం ఎదురైనప్పుడు మెదడులో ఉండే అమిగ్డాలా అలర్ట్ స్థితిలోకి వెళ్తుంది. చాలా మంది బాధితులు ఎందుకు వెంటనే బయటకు రాలేకపోతారనే ప్రశ్నకు ఇదే సమాధానం.

మెదడు ప్రమాదాన్ని అంచనా వేసి తాత్కాలికంగా మూగబోయేలా చేస్తుంది. సిగ్గు, నింద, భయం కలిసి బాధితులను మౌనంగా ఉంచుతాయి. చాలాకాలం తర్వాత మాత్రమే వారు మాట్లాడగలగుతారు. ఇక ట్రామా నుంచి బయటపడటం ఒక్కసారిగా జరగదు. అది ఒక దీర్ఘ ప్రక్రియ. నిపుణులు దీన్ని పోస్ట్ ట్రామాటిక్ గ్రోత్ అని పిలుస్తారు. గాయం మిగిలినా, మనసు మళ్లీ నిలబడే శక్తిని కనుగొనడమని అర్థం.

ఇక రీనాకు న్యాయం ఒక అరెస్ట్‌తో ముగియదు. ప్రతి పేరు వెలుగులోకి రావాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం రావాలన్నది ఆమె డిమాండ్. ఒక్క మాటలో చెప్పాలంటే రీనా కేసు కేవలం గతం గురించి కాదు.. ప్రభావం, నియంత్రణ, భయం కలిసి ఎలా మానవత్వాన్ని దెబ్బతీస్తాయో గుర్తు చేసే హెచ్చరిక.
ALSO READ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్.. కొత్త లీక్‌లో బయటపడిన సంచలన విషయాలు..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *