నవంబర్ ముగుస్తుంది. కొత్త మార్పులతో సామాన్యులకు టెన్షన్ మొదలయింది. మీ పెన్షన్ డబ్బు ఆగిపోతుందా లేక ఇంకా ఎక్కువ వస్తుందా? మీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోతుందా? ట్యాక్స్ ఫైలింగ్ మిస్ అయితే ఏమవుతుంది? విమాన టికెట్ ధరలు ఎలా ప్రభావితమవుతాయి? ఇలా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. UPSని ఎంచుకోవడానికి చివరి తేదీ, పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ల గడువు రెండూ నవంబర్ 30తో ముగుస్తాయి. కీలకమైన TDS ఇంకా బదిలీ ధరల దాఖలు కూడా ఈ వారంలో జరగనున్నాయి. డిసెంబర్ 1న LPG, ATF నెలవారీ ధరల సవరణకు లోనవుతాయి. ఇది గృహ బడ్జెట్‌లు ఇంకా ప్రయాణ ఖర్చులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ కొత్త నియమాల వల్ల ఎవరికి ఎంత ప్రభావితమౌతుందో చేద్దామా?
UPS, NPS మార్పులేంటి?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పెద్ద అవకాశం వచ్చింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే UPS ఇది ఎన్‌పీఎస్ నుంచి మారాలనుకునే వాళ్లకు గ్యారంటీ ఇచ్చే పెన్షన్ ప్లాన్. 25 ఏళ్ల సర్వీస్ తర్వాత మీ ఆఖరి 10 నెలల శాలరీల మీద 50 శాతం పెన్షన్ ఖాయం. అది ఇన్‌ఫ్లేషన్ ప్రకారం పెరుగుతుంది. మరి గ్రాచ్యుటీ ఫ్యామిలీ పెన్షన్ లాంటివి కూడా ఉన్నాయి. ఫైనాన్స్ మినిస్ట్రీ ఇప్పటికే డెడ్‌లైన్‌ని సెప్టెంబర్ నుంచి నవంబర్ 30 వరకు పొడిగించింది. ఎందుకంటే చాలా మంది ఆప్షన్ తీసుకోలేదు. కానీ ఇది లాస్ట్ చాన్స్! నవంబర్ 30కి ముందు మీ CRA సిస్టమ్ లేదా నోడల్ ఆఫీస్‌లో అప్లై చేయాలి. డిసెంబర్ 1 నుంచి ఈ డోర్ మూసుకుపోతుంది. మీ రిటైర్మెంట్ ప్లాన్‌ని రివ్యూ చేసి త్వరగా యాక్షన్ తీసుకోండి.
పెన్షన్స్ సంగతేంటి?
మరోవైపు పెన్షనర్లకు మరో ముఖ్యమైన విషయం. జీవన్ ప్రామాణ్ అంటే లైఫ్ సర్టిఫికేట్ దీన్ని సబ్మిట్ చేయడం మర్చిపోకండి. ఇది ప్రతి సంవత్సరం మీరు జీవించి ఉన్నారని ప్రూవ్ చేసే డాక్యుమెంట్. నవంబర్ 30 డెడ్‌లైన్ మిస్ అయితే మీ పెన్షన్ పేమెంట్ ఆగిపోతుంది. తిరిగి వెరిఫై చేసేవరకు డిలే అవుతుంది. 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లు అక్టోబర్ 1 నుంచి సబ్మిట్ చేయొచ్చు. డిజిటల్‌గా ఈజీగా చేయొచ్చు. ఆధార్ బయోమెట్రిక్ ఉపయోగించి జీవన్ ప్రామాణ్ పోర్టల్‌లో లాగినై ఫేస్ రికగ్నిషన్ లేదా ఫింగర్‌ప్రింట్ స్కాన్ చేయండి. SMSలో ప్రామాణ్ ID వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. ఆఫ్‌లైన్‌గా బ్యాంకులు.. పోస్ట్ ఆఫీసులు.. CSC సెంటర్లలో వాక్-ఇన్ చేయొచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ 4వసారి నేషన్‌వైడ్ క్యాంపెయిన్ నడుపుతోంది. 2000 జిల్లాల్లో సహాయం అందుబాటులో ఉంది. త్వరగా చేసి మీ పెన్షన్ ఫ్లో ఆగకుండా చూసుకోండి!
టీడీఎస్ ఫైలింగ్:
ఇక ట్యాక్స్ విషయానికి వస్తే ఈ వీక్ ముగింపులో ఒక స్క్రాంబుల్ జరుగుతోంది. అక్టోబర్‌లో సెక్షన్ 194-IA..194-IB..194M..194S కింద TDS కట్ అయిన స్టేట్‌మెంట్లు నవంబర్ 30కి ఫైల్ చేయాలి. ఇవి ఇమ్మోవబుల్ ప్రాపర్టీ కొనుగోళ్లు.. కాంట్రాక్టర్ పేమెంట్లు..వర్చువల్ డిజిటల్ అసెట్స్‌లపై TDS ఉంటుంది . మల్టీ-నేషనల్ కంపెనీలు.. ఇండియన్ ఎంటిటీలు సెక్షన్ 92E కింద ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్స్.. ఫారం 3CEAA కూడా డెడ్‌లైన్ ఇదే. డిసెంబర్ 1 నుంచి లేట్ ఫైలింగ్‌కు పెనాల్టీలు, మంత్లీ ఇంటరెస్ట్ 1.5% నోటీసులు వస్తాయి. లేట్ ఫీ రోజుకు 200 రూపాయలు.
సిలిండర్ ధరలు పెరుగుతాయా?
ఇప్పుడు మన ఇంటి బడ్జెట్‌కు విషయానికి వస్తే..LPG ధరలు డిసెంబర్ 1న మంత్లీ రివిజన్ జరుగుతుంది. ఓయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్లోబల్ ప్రైసెస్.. కరెన్సీ రేట్స్ బట్టి అప్‌డేట్ చేస్తాయి. గత నెలల్లో కమర్షియల్ 19 కేజీ సిలిండర్‌లు రూ.16.5 పెరిగాయి కానీ డొమెస్టిక్ 14.2 కేజీ స్థిరంగా రూ.803 వద్ద ఉంది. ఈసారి రిలీఫ్ రావచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం డౌన్ అవుతున్నాయి. ముంబైలో రూ.852.50, ఢిల్లీలో రూ.803. ఇది మీ గ్రాసరీ బడ్జెట్‌ని డైరెక్ట్‌గా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా మహిళలు..ఫ్యామిలీలకు.
ఇక చివరగా ట్రావెలర్లకు మంచి న్యూస్ ATF అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ప్రైసెస్ కూడా డిసెంబర్ 1న రివైజ్ అవుతాయి. ఇది ఎయిర్‌లైన్స్ ఆపరేటింగ్ కాస్ట్‌లో 40% ఉంటుంది కాబట్టి టికెట్ రేట్స్‌పై ఇంపాక్ట్. గతంలో నవంబర్‌లో రూ.2,941 పెరిగింది. డిసెంబర్‌లో రూ.1,318.12 హైక్. ఢిల్లీలో రూ.91,856.84 .. ముంబైలో రూ.85,861. హాలిడే సీజన్‌లో డిమాండ్ హై కాబట్టి చిన్న చేంజ్ కూడా ఫేర్స్ పెంచవచ్చు. కానీ గ్లోబల్ ఆయిల్ ట్రెండ్స్ బట్టి డౌన్ కూడా రావచ్చు. కాబట్టి ఇవి డిసెంబర్ 1 నుంచి మీ ఫైనాన్స్‌ని టచ్ చేసే కీ చేంజెస్ త్వరగా యాక్షన్ తీసుకుని పెనాల్టీలు..డిలేలు అవాయిడ్ చేయండి. మీ బడ్జెట్ సేఫ్‌గా ఉంచుకోండి.
ALSO READ: ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు కట్.. ఎంతమందిని తొలగించారంటే?

Cylinder Shortage: వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆటంకాలు.. సమస్యను అంచనా వెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందా?