Menu

Monalisa Amber eyes: ఈ కళ్లు ప్రపంచంలో ఎందుకంత స్పెషల్‌..? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?

Praja Dhwani Desk 1 year ago
monalisa amber eyes

ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేస్తే తనే.. ఇన్‌స్టా ఓపెన్‌ చేసినా ఆమెనే.. ట్విట్టర్‌లోనూ, ఆఖరికి వాట్సాప్‌ స్టేటస్‌ల్లోనూ తనే కనిపిస్తోంది. మహా కుంభమేళ(Maha Kumbh mela)తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయిన మోనాలిసా(Monalisa) అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు సోషల్‌మీడియా యూజర్లు. కాటుక దిద్దిన తేనె కళ్లు.. డస్కీ స్కీన్.. అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్‌తో అద్భుతమైన అందంతో కట్టిపడేస్తున్న ఈ అమ్మాయి హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ మోనాలిసాకి ఇంతమంది ఎందుకు ఫ్లాట్ అవుతున్నారో తెలుసా? దానికి ప్రధాన కారణం ఆమె తేనె కళ్లు.

చరిత్ర లోతుల్లోకి వెళ్తే…

మోనాలిసా తేనె రంగు కళ్లను అంబర్‌ కళ్లు అని పిలుస్తారు. ఇవి నిజంగా పూర్తిగా తేనె రంగులో ఉండవు. కొంచెం గోల్డ్‌ కలర్‌, కొంచెం తేనె రంగు మిశ్రమంతో ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఐరిస్ కలర్‌గా చెప్పవచ్చు. ఈ రంగు కళ్లు ప్రత్యేకమైన గ్లో కలిగి ఉంటాయి. ఈ కళ్లు ప్రధానంగా లిపోక్రోమ్ అనే పిగ్మెంట్ కారణంగా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇది చాలా అరుదైన జన్యుపరమైన లక్షణం. అంబర్ కళ్లు చరిత్ర చాలా పురాతనమైనది. ఈ తేనె కళ్లు ఉన్న వ్యక్తులను పురాతన కాలంలో దేవతలగా భావించేవారట. వారికి ప్రత్యేక శక్తులు ఉన్నాయని.. లేదా దైవంతో సంబంధాన్ని కలిగి ఉన్నారని అనుకునేవారట. యూరోపియన్ దేశాలు.. ముఖ్యంగా హంగేరీ, రోమేనియా, పోలాండ్ లాంటి ప్రాంతాల్లో ఈ తరహా కళ్లు ఉన్నవారు కనిపిస్తుంటారు. మధ్య ఆసియా, అర్మేనియా లాంటి ప్రాంతాల్లో కూడా అంబర్ కళ్లతో మనుషులు కనిపిస్తారు. వివిధ జన్యు సమూహాల అడ్డా అయిన లాటిన్ అమెరికాలో కూడా ఈ కళ్లు ఉన్నవారు ఉంటారు. మొత్తంగా చూస్తే అంబర్ కళ్లు ప్రపంచ జనాభాలో కేవలం 5శాతం మంది లోపు మనుషుల్లో మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఇవి చాలా ప్రత్యేకమైనవి. ప్రముఖ అమెరికన్‌ నటి అలెగ్జాండ్రా డాడారియో కళ్లు కూడా ఇవే. ఇటు ఇండియాలో ఈ కళ్ల రంగు చాలా అరుదుగా కనిపిస్తుంది. కొంతమంది హీరోయిన్లకు లైట్ బ్రౌన్ లేదా హాజల్ కళ్లు కలిగి ఉంటారు. కానీ పూర్తిగా అంబర్ కళ్లు కలిగినవారు చాలా చాలా తక్కువనే చెప్పాలి.

తక్కువ సూర్యరశ్మి కారణంగా…

నిజానికి మన కళ్లలో మెలనిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ మెలనిన్‌తో పాటు లిపోక్రోమ్ అనే పిగ్మెంట్ కలయిక కళ్ల రంగుకు కారణమవుతుంది. సాధారణంగా ఎక్కువ మెలనిన్ ఉన్నవారు గోధుమ లేదా నలుపు కళ్లు కలిగి ఉంటారు. తక్కువ మెలనిన్ ఉన్నవారికి పచ్చ, బంగారు లేదా తేనె రంగు కళ్లు ఉంటాయి. అంబర్ కళ్లు ఉండడానికి ముఖ్య కారణం లిపోక్రోమ్ పిగ్మెంట్. ఇది పసుపు రంగులో కనిపిస్తుంది. పూర్వకాలంలో జనసమూహాలు వలసలు వెళ్తుండేవారు. ఎప్పుడూ ఒకే చోట ఉండేవారు కాదు. ఉదాహరణకు ఇప్పుడు ఇండియాలో ఉన్న భిన్న జాతుల ప్రజలెవరూ 5వేల సంవత్సరాల క్రితం ఇక్కడవారు కాదు. పూర్వం ప్రతీ ఒక్కరూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతాలు, దేశాలు, ఖండాలూ మారేవారు. అందుకే వారి జన్యు లక్షణాలు మారుతూ వచ్చాయి. యూరోప్ లాంటి శీతల ప్రాంతాల్లో తక్కువ సూర్యరశ్మి కారణంగా జన్యు పరిణామం ఎక్కువగా జరిగింది. ఇదే అరుదైన కళ్ల రంగులకు కారణమైంది. అంబర్ కళ్లు కూడా ఒక రకమైన జన్యు పరిణామంలో భాగమే!

Also Read: డేటింగ్‌ కోచ్‌లు.. లక్షలు సంపాదిస్తున్నారు.. పురుషులకు మాత్రమే..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *