కశ్మీర్‌లో జరిగేదొకటి.. మోదీ ప్రభుత్వం బయటకు చెప్పుకునేదొకటి.. కశ్మీర్‌లో అసలు హింసాత్మక ఘటనలు జరగడం లేదని స్వయంగా మోదీ ప్రకటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2016 పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తీవ్రవాదులు హింసకు ముగింపు పడిందని బీజేపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. 2016సెప్టెంబరులో సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత, మార్చి 2019లో బాలాకోట్ వైమానిక దాడి తర్వాత ఇదే విధమైన ప్రకటన చేసింది బీజేపీ. 2019 ఆగస్టు 5 ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ధీమాగా చెప్పింది. అయితే ఏం మారలేదు. తీవ్రవాదం తగ్గకపోగా రాజౌరీ-పూంచ్ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకాలాపాలు పెరిగాయి. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మరోసారి జవాన్లే టార్గెట్‌గా ఉగ్రవాదులు కాల్పులు జరిగారు. ఓ జవాన్ మరణించగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 30 నెలల్లో ఒక్క పూంచ్‌లోనే 21మంది జవాన్లు చనిపోయారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగానే కనిపిస్తోంది.
ఇంటెలిజెన్స్ వైఫల్యమే?
ఆర్మీపై ఉగ్రవాదులుదాడులు చేసిన ప్రతీసారి పాకిస్థాన్‌ను తిట్టుకోవడంతోనే బీజేపీకి టైమ్ సరిపోతుంది. భారత్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి మాత్రం కేంద్రం ప్రస్తావించదు. 2019 ఫిబ్రవరీ 14 పుల్వామా ఘటన సమయంలోనూ ఇదే ట్రిక్ ప్లే చేసింది బీజేపీ. 350 కేజీల పెలుడు పదార్థంతో ఓ సూసైడ్ బాంబర్ ఆర్మీ కాన్వాయ్‌ని ఢీకొట్టాడు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(IED)తో 40మంది జవాన్లను చంపేశాడు. ఈ ఘటన తర్వాత భారత్ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ప్రశ్నించిన వారిని దేశద్రోహులగా చిత్రకరించే ప్రయత్నం చేసింది కాషాయ పార్టీ. నాడు కాన్వాయ్‌లో 78 వాహనాలు, 2,547 మంది జవాన్లు ఉన్నారు. జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఇంత పెద్ద కాన్వాయ్‌ని ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్న పుల్వామాలో అనుమతించడంపై అనేక విమర్శలు వచ్చాయి. సీఆర్‌పీఎఫ్ వాహనంలో 39 మంది ఉన్నప్పటికీ అందులో నాలుగు ఆయుధాలు మాత్రమే ఉన్నాయని విచారణలో తేలింది. కాన్వాయ్ వెళ్తున్న సమయంలో పౌర వాహనాల రాకపోకలను అనుమతించడం వల్ల ఈ ఘటన జరిగిందని ఇండియా టుడే(INDIA TODAY) నివేదించింది. అందులోనూ నాడు జవాన్లను ఎయిర్‌లిఫ్ట్ చేసి శ్రీనగర్‌కు పంపించాలన్న ప్రతిపాదన ఉంది. అయితే రోడ్డు మార్గం ద్వారానే జవాన్లను పంపించేందుకు చూశారు. ఇది కూడా ఈ విషాదానికి కారణంగా నిలిచింది. ఇలాంటి తప్పులు ఎన్నో చేసిన బీజేపీ వాటిని సరిదిద్దడం సంగతి పక్కన పెట్టి కశ్మీర్‌లో అసలు ఉగ్రవాదమే లేదన్నట్టు కబుర్లు చెబుతోంది.
NSA ఏం చేస్తున్నట్టు?
జవాన్ల మరణాలను చూపించి ఓట్లు అడగడం కూడా మోదీకే చెల్లుతుంది. 2019 ఎన్నికల్లోనూ ఆయన అదే చేశారు. కశ్మీర్ ప్రస్థావన వచ్చిన ప్రతీసారి అసలు లోయలో ఉగ్రవాదమే లేదన్నట్టు చెబుతుంటారు. అయితే ఇదంతా నిజం కాదని జరుగుతున్న ఘటనలు చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే పూంచ్‌లో ఉగ్రవాద కార్యకాలపాలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. రాజౌరి -పూంచ్ సమీపంలోని రియాసి జిల్లాలో ఉగ్రవాద సంబంధిత ఘటనలు హెచ్చుమీరుతున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా మరణాలు నమోదవుతున్నాయి. ఇది నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(NSA) పనితీరునూ ప్రశ్నిస్తోంది.
చైనాకు చెక్ పెట్టలేరా?
సొంత భూభాగాలను కాపాడుకోవడం ప్రభుత్వ కర్తవ్యం. ఓవైపు చైనా భారత్ పెట్రోలింగ్ పాయింట్లను ఆధీనంలోకి తెచ్చుకుంటోందని నివేదికలు చెబుతున్నాయి. తూర్పు లడఖ్‌లోని 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26పాయింట్లు భారత్ నుంచి చేజారిపోయాయని ‘ద హిందూ’ (THE HINDU) గతేడాది ఓ కథనాన్ని ప్రచురించింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుంది.. అయితే మోదీ సర్కార్ మాత్రం తమ తప్పులను ఒప్పుకోకుండా పరనిందలతో కాలం గడుపుతోంది.
Also Read: అబద్ధాలు, విద్వేషాలే మోదీ పునాదులు! అసలు ఎలక్షన్ కమిషన్ నిద్ర లేచేనా?

Jeffrey Epstein: ఎప్స్టీన్ ఎవరు? ప్రపంచంలోని బడాబాబులు ఎందుకు వణికిపోతున్నారు?
New Labour Codes: శాలరీలో చేతికి సగమే ఇస్తారా? మీ జేబుకు ప్రభుత్వం పెద్ద సైజు చిల్లు పెట్టిందా?
2024 Elections లో భారీ అవకతవకలు? Parakala Prabhakar లేవనెత్తిన సంచలన అనుమానాలు!
Jammu Kashmir: అసలు కశ్మీర్ ప్రజలు ఎవరు? వారి చరిత్ర ఏంటి? ఆ భూభాగాన్ని నాశనం చేసిందెవరు?
Pulwama to Pahalgam: ఆర్టికల్-370 రద్దు చారిత్రాత్మక తప్పిదం.. ఈ లెక్కలే సాక్ష్యం!
Three Language Policy: మీ హిందీని మడిచి..! దేశవ్యాప్తంగా రగులుతోన్న భాషా వివాదం.. మరో ఉద్యమం తప్పదా?