Gold Rates:
ఇండియాలో బంగారం అంటే ఒక సంపద మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్! పెళ్లిళ్లు, పండుగలు, పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆశ.. ఇలా అన్నింటిలోనూ బంగారం ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలాలు మారుతున్నా బంగారం పట్ల భారతీయుల ప్రేమ మాత్రం ఏనాటికీ తగ్గదనే చెప్పాలి. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 88 రూపాయాల మాత్రమే ఉండేది. కానీ, 2025 ఫిబ్రవరి నాటికి అదే బంగారం 88 వేల రూపాయల మార్క్‌ను చేరుకుంది! ఈ పెరుగుదల వెనుక అనేక ఆర్థిక, రాజకీయ పరిణామాలు కారణంగా ఉన్నాయి.
నాడు కొంపముంచిన ఆర్థిక సంక్షోభం
78ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో 1974 ప్రధానమైనది. 1974లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ ధరల పెరుగుదలతో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1973లో 278 రూపాయలగా ఉన్న బంగారం అప్పుడు 506 రూపాయలకు చేరింది. ఇక 1991 ఆర్థిక సంస్కరణలు తర్వాత బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1991లో 3,466 రూపాయలగా ఉన్న బంగారం ధరలు 1992నాటికి 4,334 రూపాయలకు చేరాయి. ఇటు 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. భారతీయులు కూడా ఆ సంవత్సరంలో బంగారాన్ని భద్రంగా పెట్టుబడిగా మార్చుకున్నారు. 2007లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10వేల 800 రూపాయలగా ఉటే అది 2008 నాటికి 12,500 రూపాయలకు పెరిగింది. ఇక 2020లో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా, బంగారం విలువ మాత్రం పెరిగింది. భద్రత కోసం ప్రజలు బంగారం వైపుకే మొగ్గుచూపారు. 2019లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 35,220 రూపాయలు ఉండగా.. 2020 నాటికి ఏకంగా 48,651 రూపాయలకు పెరిగింది. ఇక ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా లేవు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ యుద్ధాలు, పెరిగిన డాలర్ విలువ కారణంగా బంగారం ధరను కొత్త గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. అటు త్వరలోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్ష మార్కును కూడా టచ్ చేసేలా ఉంది.
ALSO READ: మానవత్వం మరిచిన ట్రంప్.. డబ్బుల కక్కుర్తితో పేద దేశాల ప్రజల కడుపు మాడ్చుతున్న ప్రెసిడెంట్!

Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!
Indonesia: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?
New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్‌కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!
Aadhar Update: కాలు బయటకు పెట్టాల్సిన అవసరమే లేదు.. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌తో పాటు ఆధార్ అడ్రెస్‌ను ఇలా ఇలా అప్డేట్ చేసుకోండి!
Mock Assembly: లోకేశ్ గారూ.. ఓ సారి నిజాలు మాట్లాడుకుందాం రండి! మీ తాత ఏం చేశారో ఒక్కసారి తెలుసుకోండి!