హీరోలు సినిమాల్లో ఉన్నట్టే బయట కూడా ఉంటారని భావించేవారి కోసమే ఈ వీడియో! తన ఫేవరెట్ సినిమా హీరో కోసం ప్రాణాలనే పొగొట్టుకున్న శ్రీనివాసులు.. అలియాస్ రాయుడు కథ ప్రతీఒక్కరూ వినాల్సింది..! అతని ఎవరి కోసమైతే ఇన్నాళ్లు బతికాడో.. ఆ సినిమా హీరో మౌనాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఈ మొత్తం కథ విన్న తర్వాత మీరు తప్పకుండా కామెంట్ చేయాల్సిందే. ఎందుకంటే మరో రాయుడు కథ మరోసారి మనం వినకూడదు..చూడకూడదు..! ఇంతకీ ఈ శ్రీకాళహస్తి స్పై ఎపిసోడ్‌లో అసలేం జరిగింది?
చిన్నతనం నుంచే వెర్రితనం?
చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన రాయుడు..తన అమ్మమ్మ దగ్గర పెరిగాడు. అతని అసలు పేరు శ్రీనివాసులు. పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా సమయంలో తన హీరోపై ఉన్న పిచ్చితో తన పేరును రాయుడుగా మార్చుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత పవన్‌కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరాడు. పవన్ కల్యాణ్‌ను దగ్గర నుంచి చూడాలనే ఆశతో ITI చదివిన రాయుడు.. కారు డ్రైవింగ్ నేర్చుకోని మరీ జనసేన శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ వినుత వద్ద డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. ఆమెను నమ్మినబంటుగా మెలిగాడు. ఆమె పేరును చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. ‘వినుత అక్క’ అనే అక్షరాలు రాయుడు చేతిపై పచ్చబొట్టుగా కనిపిస్తాయి. ఇటు ఓసారి వినుత కథను చూస్తే.. 2024లో ఆమెకు చివరి నిమిషంలో శ్రీకాళహస్తి టికెట్ చేజారింది. కూటమి ఒప్పందంలో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డికి హైకమాండ్ టికెట్ కన్ఫామ్ చేసింది. ఇది వినుతకు ఏ మాత్రం నచ్చలేదు. ఇటు బొజ్జల సుధీర్‌రెడ్డి కోసం ఆమె క్యాంపెయిన్ కూడా చేయలేదు. సైలెంట్‌గా ఉండిపోయారు. ఇక 2029లో మాత్రం వినుతకే టికెట్ ఇస్తారని హామీ వచ్చినట్టుగా సమాచారం. అప్పటినుంచే కథ అడ్డం తిరిగిందట. వినుతకు ఆ టికెట్ రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రాయుడిని ఓ గూఢచారిగా నియమించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా వినుతకు సంబంధించిన పర్శనల్ విషయాలను, వీడియోలను కూడా రాయుడు సుధీర్‌రెడ్డికి పంపించాడని ఓ వర్గం వాదిస్తోంది. ఈ కారణంతోనే రాయుడుని వినుత, ఆమె భర్త, మరో ముగ్గురు సహచరులతో కలిసి చంపేశారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ ఎమ్మెల్యేను కాపాడేందుకేనా?
అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా అప్పటికప్పుడు జరిగిన విషయం కాదు. నాలుగు నెలల క్రితమే రాయుడు ఇలా చేస్తున్నాడని.. దీని వెనుక సుధీర్‌రెడ్డి ప్లాన్ ఉందని.. వినుత కోట పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం! అయితే ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఉండాలని.. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే పాత్ర ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయండని చెప్పి పవన్ వినుతను పంపించారట! ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని పవన్ అప్పట్లో వినుత ఫిర్యాదును పక్కన పెట్టకుండా ఉండి ఉంటే రాయుడు హత్యకు గురయ్యేవాడు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ మీరు మరో విషయాన్ని జాగ్రత్తగా వినాలి.. రాయుడు గురించి పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసు.. ఇటు వినుత ఆయనకు చాలా దగ్గర కూడా. పరిస్థితులు ఎలా ఉన్నా.. 2019లో జనసేన ఘోరంగా ఓడిపోయినా ఈ ఇద్దరూ పవన్ వెంటే నిలిచారు. మెక్సీకోలో మంచి ఉద్యోగం వదులుకోని మరీ జనసేన టికెట్ కోసం సొంత ఆస్తులను అమ్ముకున్న వ్యక్తిగా వినుత గురించి పవన్‌కు తెలిసినంత మరెవరికీ తెలియదు కూడా.
పవన్ మాట్లాడడంలేదెందుకు?
గతంలో ఓసారి వినుతపై ప్రత్యర్థి పార్టీలు కామెంట్స్ చేస్తే పవన్ అసలు ఊరుకులేదు. మా వీరమహిళ వినుత జోలికే వస్తారా అంటూ ఆవేశపడ్డారు. అయితే ఇప్పుడు వినుత జైల్లో ఉన్నారు.. ఇటు రాయుడు ఈ లోకానికే దూరమయ్యాడు. మరి పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పడంలేదు? పార్టీ విధివిధానాలను పాటించడంలేదంటూ రాయుడు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత వినుతను పార్టీ నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఒక్కటి మినహా ఈ కేసు గురించి జనసేన నుంచి అధికారికంగా వచ్చిన ప్రకటనలేవీ లేవు. ఇటు పవన్ కల్యాణ్ అయితే పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తున్నారు. అటు ఈ వ్యవహారం గురించి గుమ్మడికాయ దొంగ మాదిరిగా బొజ్జల సుధీర్‌రెడ్డి హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక ఉన్న అంతర్యమేంటో అర్థంకావడంలేదు. ఈ కేసులో తనకు సంబంధం లేదని.. ఇదంతా వినుత ఇంటి వ్యవహారమని సుధీర్‌రెడ్డి మీడియాను పిలిచి మరీ చెప్పుకున్నారు. ఇటు పవన్ నోటి నుంచి మాత్రం మాట రావడంలేదు. ఎక్కడో బెంగాల్‌లో, బంగ్లాదేశ్‌లో మాహిళలపై కుట్రలు జరిగితే ఇక్కడ గళం వినిపించే పవన్.. తన పార్టీ మనిషి వేరే పార్టీ ఎమ్మెల్యే కుట్రకు బలైందని ప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ మౌనం ఆయన అభిమానులను కూడా అసహానానికి గురిచేస్తోంది. ఇటు ఈ మొత్తం ఎపిసోడ్‌లో రాయుడు హత్యకు గురైనా పవన్ కనీసం స్పందించకపోవడం పట్ల జనసైనికులు సైతం ఆగ్రహంగా ఉన్నారు.
ALSO READ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!
