ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసును పూర్తిగా మార్చేసిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) అద్భుత విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక పోరులో ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్ నేరుగా ప్లేఆఫ్స్‌లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఓటమితో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ జట్ల ఆశలు ఒక్కసారిగా చిద్రమయ్యాయి.
✨ Quick Read
- 30 పరుగులతో ముంబైపై రాజస్థాన్ విజయం
- ఆర్చర్ ఆల్‌రౌండ్ షోతో మ్యాచ్ టర్న్
- KKR, పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు ముగింపు
AI-assisted summary, newsroom reviewed
టాస్ గెలిచినా.. నో యూజ్:
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోయినా దూకుడు మాత్రం తగ్గించలేదు. ఓపెనర్లు త్వరగా ఔటైనా, మధ్య ఓవర్లలో ధ్రువ్ జురెల్ 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, దసున్ షనక 15 బంతుల్లో 29 పరుగులు చేసి స్కోరుకు ఊపు తీసుకొచ్చాడు.
అసలు విధ్వంసం చివరి ఐదు ఓవర్లలో కనిపించింది. సాధారణంగా బౌలర్‌గా గుర్తింపు ఉన్న జోఫ్రా ఆర్చర్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపిన రాజస్థాన్ మేనేజ్‌మెంట్ నిర్ణయం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆర్చర్ కేవలం 15 బంతుల్లో 32 పరుగులు చేసి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివర్లో రవీంద్ర జడేజా వేగంగా పరుగులు జోడించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
జోఫ్రా ఆర్చర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు ఇచ్చారు?
ఆర్చర్ బ్యాటింగ్‌లో 15 బంతుల్లో 32 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పాడు.
IPL 2026 ప్లేఆఫ్స్‌లో ఏ జట్లు క్వాలిఫై అయ్యాయి?
బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ IPL 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
ఆర్చర్ అగ్ని బాణాలు.. ముంబై కుప్పకూలింది!
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే భారీ షాక్ ఇచ్చాడు. రోహిత్ శర్మను డకౌట్ చేయడంతో పాటు నమన్ ధీర్ వికెట్ కూడా తీసి ముంబై టాప్ ఆర్డర్‌ను చిదిమేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 49 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.
అయితే సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ కలిసి పోరాడి ముంబైకి ఆశలు కలిగించారు. తర్వాత హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు చేసి మ్యాచ్‌ను మళ్లీ ముంబై వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. కానీ 16వ ఓవర్లో ఆర్చర్ వేసిన అద్భుత బంతికి హార్దిక్ ఔటవడంతో మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరికి ముంబై 175 పరుగులకే ఆలౌట్ అయి 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇలా!
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో నాలుగో జట్టుగా నిలిచింది. ఇక మొదటి క్వాలిఫైయర్‌లో బెంగళూరు, గుజరాత్ తలపడనుండగా.. ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌తో, రాజస్థాన్ తలపడనుంది.
ALSO READ: ఇది అభిమానం కాదు.. ఉన్మాదం..ఉగ్రవాదం.. బానిసత్వం..బుద్ధి లేని బతుకులు!

Bengaluru Stampede: ఇది అభిమానం కాదు.. ఉన్మాదం..ఉగ్రవాదం.. బానిసత్వం..బుద్ధి లేని బతుకులు!
Afghanistan Cricket: ఓవైపు అగ్రరాజ్యాల దురహంకారం.. మరోవైపు మత ఛాందసం.. ఈ రెండిటి మధ్య అఫ్ఘాన్ క్రికెట్ ఎలా ఎదిగింది?