Menu

Astrology: జాతకం బూటకమా? నిజమా? మీరు తెలుసుకోవాల్సిన సత్యం!

Lakshmi Aruna 9 months ago
astrology is a fake telugu news

నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే…నీ మనసు ఎలా పనిచేస్తుందో, నువ్వు ఎందుకలా స్పందిస్తున్నావో…అదంతా ఒక పుట్టుక సమయంలో సాగే గ్రహాల కదలికల మీద ఆధారపడి ఉండొచ్చా? నిజంగా…జాతకం నీ గుండె తడులను, నీ అంతర్లీన భావాలను, నీ ప్రవర్తనల వెనక దాగిన లోతులను చెప్పగలదా? లేకపోతే…అది కేవలం ఊహాజనితంగా, నువ్వు నమ్మితే నలుగురికి నచ్చే కొన్నిపాఠాలు చెప్తుందా? ఇంకో ప్రశ్న…జాతకం నిన్ను మార్చగలదా? లేదా నువ్వు మార్చుకున్న మార్గాన్ని అది ముందే చెప్పగలదా? ఇవే ప్రశ్నలు… ఈ రోజు మనం వెతకబోయే సత్యం!

సైకాలజీ ఏం చెబుతుంది?

జాతకం అనేది మన సంస్కృతిలో చాలా ప్రాచీనంగా ఉంది. ఈ గ్రహాల కదలికలు, పుట్టిన సమయం,దిశ..ఇవన్నీ కలిసి మన జీవితమెలా ఉండబోతుందో ముందే గీసిన జీవిత పటంలా ఉంటాయంటారు. దాన్ని చూసి మన వ్యక్తిత్వం, బలహీనతలు, అవకాశాలు చెప్పగలమంటారు. కానీ.. శాస్త్రం ఈ విషయాన్ని ఏమంటుంది? ఆధునిక మానసిక శాస్త్రం ఏం చెప్తోదంటే..? జాతకం మన మనసు, ప్రవర్తనలను పూర్తిగా అర్థం చేయగలదన్న ఆమోదయోగ్యమైన ఆధారాలు లేవు. కానీ… ఒక ఆశ్చర్యం ఏంటంటే! జాతకాన్ని నమ్మేవారు, తమ వ్యక్తిత్వాన్ని మరింతగా అర్థం చేసుకునేలా మారుతారు. అంటే ఇది ఒక రకం మనస్సాక్షి అద్దం వంటిది.

నీ బాధ్యతలు మర్చిపోతావు:

చంద్రుడు మన భావోద్వేగాలకు, శుక్రుడు ప్రేమకు, బుధుడు సంభాషణకు… ఇలా ఒకటొకటి మన వ్యక్తిత్వంతో అనుసంధానించబడతాయి అని జాతకం చెప్తుంది. ఇవి వాస్తవానికి నీ మనస్సులో ఉన్న భావాలకు నీవే అర్థాలు ఇవ్వటానికి ఒక అవకాశం. జాతకం వల్లే అవి ఏర్పడుతాయా? కాదు. కానీ జాతకం ఓ సాధనంగా మారి, నిన్ను నువ్వు విశ్లేషించుకునే దారిగా మారొచ్చు. ఇది పాజిటివ్‌గా ఉపయోగిస్తే… నీవు నిన్ను అర్థం చేసుకునే మార్గంగా, నీ లోపాల్ని ఎదుర్కొనే ప్రయత్నంగా.. జాతకం ఒక ఆత్మపరిశీలన ప్రయాణానికి మొదటి మెట్టుగా మారవచ్చు. కానీ అదే జాతకాన్ని పూర్తిగా భవిష్యత్తు నిర్ణయించే పుస్తకంలా చూస్తే… నీవు ఎంచుకునే దారులపై బాధ్యత తీసుకోవడం మానేస్తావు. ‘ఇది నా జాతకంలోనే ఉంది కదా’ అన్న అనుమానపు నీడలో తప్పులు చేసినా నీ బాధ్యత అనిపించకపోవచ్చు.

మీరే ఆలోచించుకోండి:

మరి నిజంగా.. జాతకం నీ జీవితానికి మార్గదర్శకమా?లేక నీ ఆత్మవిశ్వాసాన్ని శాసించే పాత స్క్రిప్టా?నువ్వు నిన్ను అర్థం చేసుకునే మార్గంలో…జాతకం ఒక అద్దమా? లేక నువ్వు చూస్తున్నది నీ అభిప్రాయాల ప్రతిబింబమేనా?నువ్వు నమ్ముతున్నది జాతకమా? లేక… నీ మీద నీవే వేసుకున్న నిబంధనల ఛాయలో నువ్వే కోల్పోతున్నవా? ఈ స్టోరీని చదవడం ముగిసిన తర్వాత.. ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. జాతకం నిజాన్ని చెబుతుందా? లేక.. నీ నమ్మకం నిజంలా అనిపిస్తుందా? నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి జాతకం నిజంగా అవసరమా?

ALSO READ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *