Menu

Education News: కోచింగ్ అవసరమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే!

Praja Dhwani Desk 2 months ago

పిల్లాడి చదువు కోసం కుటుంబాలు ముందుగానే ప్లాన్ చేసుకుంటాయి. స్కూల్ ఫీజులు, కాలేజ్ ఖర్చులను లెక్కలో పెట్టుకుంటాయి. కానీ ఈ ప్రయాణంలో ఒక ఖర్చు మాత్రం నెమ్మదిగా వచ్చి,
అంతకంతకు పెరిగి, చివరికి మొత్తం లెక్కనే మార్చేస్తోంది.. అదే కోచింగ్ ఫీజు. మొదట అదనపు సహాయం లాగా ప్రారంభమయ్యే ఈ కోచింగ్.. ఇప్పుడు చదువు వ్యవస్థలో ఒక ముఖ్య భాగంగా మారింది. అయితే నిజంగా నిజంగా అవసరమా? లేదా ఇది కనిపించని భారమా?

2025లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంప్రిహెన్‌సీవ్‌ మాడ్యులర్‌ సర్వే ఇండియాలోని 27శాతం విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. అంటే, ప్రతి ముగ్గురు పిలల్లో ఒకరు కోచింగ్‌కు వెళ్తున్నారు.

స్కూల్ ఫీజుకు సమానంగా ఉండే స్థాయిలో కోచింగ్‌ సెంటర్లు ఫీజులు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఈ ఖర్చు మరింత ఎక్కువ. JEE లేదా NEET కోసం 2 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలు రూపాయల వరకు ఉంటుంది. హాస్టల్‌తో కలిపితే ఫీజు మరింత ఎక్కువ. ఇక బ్రాండెడ్ ఇన్‌స్టిట్యూట్లలో ఒక్క సంవత్సరం ఫీజు 80,000 నుంచి 2 లక్షలు రూపాయల మధ్య ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో లక్షలాది పిల్లలు ఇలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు.

మొత్తం కోచింగ్ ఇండస్ట్రీ 2025లో 50,000 కోట్లు పైగా వాల్యూ కలిగి ఉంది. 2030 నాటికి ఇది 1.5 లక్షల కోట్లు కంటే ఎక్కువ అవుతుందని అంచనా. 75 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఈ కోచింగ్‌లో ఉన్నారు.

కేవలం JEE, NEET, UPSC లాంటి పోటీ పరీక్షల కోసం మాత్రమే కాదు.. ఆరో తరగతి పిల్లలు సైతం ఏదో ఒక కోర్సులో కోచింగ్‌ జాయిన్ అవుతున్నారు. ఇటు హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఉద్యోగికి నెలవారీ ఆదాయం 50,000 రూపాయలుగా అనుకుంటే ఇందులో సగం కంటే ఎక్కువ స్కూల్‌, కోచింగ్‌ ఫీజులకే వెళ్లిపోతుంది. కుటుంబానికి అసలు సేవింగ్సే ఉండడంలేదు. ఇది ఒక్క కుటుంబ కథ కాదు. లక్షలాది కుటుంబాలు ఇలాగే ఇరుక్కుపోతున్నాయి. కోచింగ్ ఇప్పుడు చాలామందికి తప్పనిసరి అయింది. పోటీ ఎక్కువ, సీట్లు తక్కువ. JEEలో 10 లక్షల మంది రాస్తే.. IIT సీట్లు కేవలం 17 వేలు మాత్రమే. NEETలో 20 లక్షల మంది రాస్తే.. MBBS సీట్లు 90 వేలు మాత్రమే. ఈ గ్యాప్‌ని భర్తీ చేస్తామంటూ కోచింగ్ సెంటర్లు అందినకాడికి దండుకుంటున్నాయి. ఇక ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పిల్లలకు చదువు తప్ప ఇంకో యాక్టివిటీ లేకుండాపోయింది.

అయితే కోచింగ్ నిజంగా చదువు నాణ్యతను పెంచుతుందా? లేదా ఇది కేవలం భయం, పోటీ, మార్కెట్ ఆధారిత బిజినెస్‌గా మారిందా? చాలామంది నిపుణుల ప్రకారం ఇదంతా వ్యాపారంలో భాగమే. అయితే కుటుంబాలు భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు.. ఈ హిడెన్ కాస్ట్‌ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. లేకపోతే.. చదువు కోసం సేవ్ చేస్తున్న డబ్బు.. కోచింగ్‌కే అయిపోతుంది.


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *