Madhavi Latha Kompella: 9నెలల చిన్నారిపై లైంగిక దాడి చేసి హ*తమార్చిన ఘటనల గురించి విన్నాం.. ఆరేళ్ల బాలికని చిత్రహింసలు పెట్టి అత్యా*చారం చేసి చంపేసిన ఉదంతాలూ ఉన్నాయి. కాళ్ల దగ్గర నుంచి తల వరకు ముఖం కూడా కనపడకుండా కప్పుకునే క్రిస్టియన్ నన్లు, ముస్లిం మహిళలు జీవితాలు కామాంధులకు బలైపోయిన ఘటనలు అనేకం. కతూవాలో 8ఏళ్ల బాలిక ఆసిఫాని ఆలయంలో అత్యా*చారం చేసి ఎలా చంపారో అందరికీ తెలుసు. అత్యా*చారాలు, లైంగిక దాడులు జరిగినప్పుడు సమాజం రెండుగా చీలిపోతుంది. ఆడవాళ్ల దుస్తులే ఈ ఘాతుకాలకు కారణమని కొందరు.. మగవారి బుద్ధి కారణమని ఇంకొందరు గ్రూపులకు విడిపోయి వాదించుకుంటారు. ఇది చాలా సెన్సిటీవ్ అంశం.. లోతుగా ఆలోచించి పరిష్కారం కొనుగొనాల్సిన విషయం. అయితే యూట్యూబ్‌లో కొందరు మేధావులు నోటికి వచ్చిన లాజిక్‌లు మాట్లాడి అసలు సమస్యను సైడ్ ట్రాక్ చేస్తారు. ఇలాంటి వారికి కొన్ని వర్గాలు కొమ్ముకొస్తాయి. ఆడవారిని తక్కువ చేసి మగవారిని ఎక్కువ చేసి మాట్లాడేవారిని దాదాపు అన్ని మతాలు వెనకేసుకొస్తాయి. సోషల్‌మీడియాలో ఇటీవలి ప్రఖ్యాత విరించి ఆస్పత్రి చైర్‌పర్శన్ మాధవి లతా కొంపెల్లాకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందామని లింక్స్ ఓపెన్ చేస్తే మేధావి మాధవి లతా లాజిక్కులకు జేబులో చెయ్యి పెట్టుకోని ఎటో వెళ్లిపోయాను. ఎక్కడా లారీ ఎదురుపడలేదు కాబట్టి సరిపోయింది. ఇంతలొనే మరో బాం*బు లాంటి వార్త టీవీల్లో పేలింది. ఆమెగారికి హైదరాబాద్ నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది.
చెప్పులు వేసుకోని వెళ్లాలంట:
రోజంతా కష్టపడి కూలి పని చేసుకోని జేబులో డబ్బులు పెట్టుకోని వెళ్తున్న వ్యక్తి దగ్గర నుంచి ఓ దొంగ ఆ సోమ్మును కాజేశాడు అనుకుందాం.. అప్పుడు సాధారణంగా బాధితుడిని చూసి బాధపడతాం.. దొంగను తిట్టుకుంటాం. అయితే కొంతమంది అలా ఉండరని ఈ మధ్యే అర్థమయింది. ‘నిన్ను డబ్బులు జేబులో ఎవడు పెట్టుకోమన్నాడు.. అసలు డబ్బులు ఎందుకు సంపాదించావ్’ అని తిరిగి ఆ కూలివాడినే అంటారని ఈ వీడియోలు చూసిన తర్వాతే తెలిసి వచ్చింది. 13ఏళ్ల బాలికలకు రక్షణ లేదని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు మాధవిగారు చెప్పిన సమాధానం వింటే తలతిరిగింది. చెప్పులు వేసుకోని వెళ్లకుండా రోడ్డుపై రాళ్లు, ముళ్లు ఉన్నాయని కంప్లైంట్ ఇవ్వకూడదు కదా.. తప్పంతా చెప్పులేసుకోని వెళ్లని వారిదేనని మేడంగారు సెలవిచ్చారు. ఆడవాళ్లు తమను తాము రక్షించుకునే విధంగా బట్టలేసుకోని వెళ్లాలని మాధవి భావన.
View this post on Instagram
సాత్విక మాంసం అంటే ఏంటో:
మాధవి అంతటితో ఆగలేదు.. మరో వీడియోలో హిందూ పురుషులకు ఎలాంటి చెడు ఆలోచనలు రావని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఇస్లాం గురించి ప్రస్తావించారు. ముస్లింలు బీఫ్ తింటారని.. అందుకే సెల్ఫ్ కంట్రోల్ ఉండదని సె*క్సాలజిస్టులకే అర్థంకాని కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఇక ఆ తర్వాత ఓ పద ప్రయోగాన్ని వినియోగించారు.. భారతీయులు తినేది ‘సాత్విక మాంసం’ అని తెలిపారు. ఈ పదానికి మీనింగ్ ఏంటో అంతుచిక్కడం లేదు. తెలుగు పండితులు సైతం తలలు పట్టుకోవాల్సిన దుస్థితి దాపరించింది. ముస్లింల ‘భోజనధారణ’ అటువంటదని.. అందుకే వారి మహిళలు శరీరం మొత్తం కప్పుకుంటారని మరో తెలుగు పదాన్ని వినియోగించారు. దీని అర్థం ఏంటో కూడా భోదపడడంలేదు. మళ్లీ స్కూల్‌కి వెళ్తే బెటరేమోనని భావన కలిగింది. ఇలా బుర్రతక్కువమంద సోషల్‌మీడియాలో తయారై అడ్డమైన ఉపన్యాసాలు ఇస్తున్నాయి.
ఇలా ఆలోచించేవారు కూడా అలాంటివారే:
2019లో వరంగల్ 9నెలల చిన్నారిని లైంగికంగా వేధించి చంపేశాడు ఓ తాగుబోతు. ఇక్కడ తప్పు ఎవరిదో మాధవి వీడియోలను సపోర్ట్ చేసేవాళ్లే చెప్పాలి. మాట్లాడడం కూడా రాని 9నెలల పాప లైంగిక దాడికి గురైతే ఈ పాపం కూడా పాపదేనంటారా? ఇక పెద్దవాళ్లైనా వయసులో ఉన్నావాళ్లైనా చిన్నారులైనా బట్టల విషయంలో ఎవరి స్వతంత్రత వారికుంటుంది. చిన్నసైజు బట్టలేసుకుంటే అత్యా*చారాలు చేస్తారని చెప్పేవారు రేపిస్టులకు ఏ మాత్రం తక్కువ కాదు. సెక్స్ ఎడ్యూకేషన్ లేకపోవడం, పో*ర్న్ అడిక్షన్, శరీరంలో జరిగే మార్పులు.. హార్మన్ల పనితీరుపై అవగాహన లేకపోవడంతో పాటు అనేక కారణాలు అత్యాచారాలకు కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా పితృస్వామ్య దేశాలు, మతాలను ఎక్కువగా రుద్దే దేశాల్లో ఆడవారిపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే మత మూలల్లోనే లింగ వివక్ష ఉంటుంది. ఈ వివక్ష ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల్లోనూ కనిపిస్తుంది. సమస్యకు రూట్ కాజ్ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా చెప్పులేసుకోని వెళ్లాలని .. బట్టలని చెప్పులతో పోల్చే మేధావులు, వారి మద్దతుదారులు ఉన్నంతకాలం లోకం తీరు మారదు!
Also Read: కొత్త దేవుడండి… సూక్తులు చెబుతోందండి..! ఎవరీవిడ?
1 Comment