Menu

16 Rupee tradition: 16 రూపాయల సంప్రదాయం వెనుక ఉన్న చరిత్ర తెలుసా? దీనికి నిజాంకు ఉన్న సంబంధం ఏంటి?

Tri Ten B
116 rupees tradition

రూ.116, రూ.1116, రూ.3116, రూ.4116, రూ.11116..! పెళ్ళి చదివింపుల్లోనైనా, పూజరులు తీసుకునే దక్షిణలోనైనా ఈ ‘116’ నంబర్‌ ఎక్కువగా వినిపిస్తుంటుంది, కనిపిస్తుంటుంది. ఇంతకీ అసలేంటీ నూట పదహర్ల గోల అని ఎప్పుడైనా ఆలోచించారా? హిందూవులు పవిత్రంగా భావించే ఏ గ్రంధంలోనూ ఈ ‘116’ నంబర్‌కు ఎలాంటి ప్రాముఖ్యత లేదు కూడా. మరో విడ్డూరం ఏంటంటే ఈ ‘నూట పదహర్లు’ కేవలం ఏపీ, తెలంగాణలో తప్ప దేశంలోని ఇతర గుళ్లలో కానీ, సమాజంలో కానీ కనిపించదు, వినిపించదు. ఏంటి నమ్మడం లేదా? ఈ నంబర్ల వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటో తెలుసుకోవాల్సిందే!

history of currency

వాళ్ల కరెన్సీ, హైదరాబాద్‌ కరెన్సీ వేరువేరు:
ఇప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారత్‌లోని భూభాగాలు ఒకప్పుడు ముక్కలముక్కలగా రాజులు పాలించిన ప్రాంతాలు. అటు ఈస్ట్‌ఇండియా కంపెనీ ఎంట్రీ తర్వాత యూరోపియన్లు వచ్చి భారత్‌లో తిష్ఠవేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాజుల పాలనే కనిపించేది. అందులో హైదరాబాద్‌ సంస్థానం ఒకటి. ఈ హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలైన కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల వారు తెలుగే మాట్లాడేవారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఉండేవి. అయితే హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రాంతాలకు కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి రాకపోకలు తరుచుగా జరుగుతుండేవి. అలా బ్రాహ్మణులు, పండితులు హైదరాబాద్‌కు వృత్తిరిత్యా వెళ్తుండేవారు.

ఈ 116 ఇలా వచ్చింది:
హైదరాబాద్‌కు సపరేటు కరెన్సీ ఉంది. దీన్ని హాలీ లేదా ఉస్మానియా సిక్కా అని పిలిచేవారు. 1948 నాటికి ఈ కరెన్సీని హైదరాబాద్‌ సంస్థానంలోని 20,000 ప్రాంతాల ప్రజలు ఉపయోగించేవారు. నిజాం పాలనలో 116 సిక్కా (రూపాయలు), 100 బ్రిటిష్ ఇండియన్ రూపాయలతో సమానం. హైదరాబాద్‌కు కోస్తా, రాయలసీమ నుంచి పౌరోహిత్యం పనికి వచ్చే పురోహితులకు హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు 100 రూపాయలు దక్షిణ ఇచ్చేవారు. అయితే వీరు తిరిగి ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లిన తర్వాత ఆ కరెన్సీ విలువ పడిపోయేది. రూ.100 సిక్కా రూపాయలకు రూ.86.2 బ్రిటిష్‌ ఇండియన్ కరెన్సీకి సమానం. దీంతో పండితులు ఆంధ్ర ప్రాంతంలో రూ.100కు సమానమైన రూ.116ను దక్షిణ కింద తీసుకోవడం మొదలు పెట్టారు. ఇలా ‘116’ కాలక్రమంలో దక్షిణకి ఫిక్స్‌డ్‌ రేట్‌గా మారిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, అన్నీ రాష్ట్రాల్లోనూ ఒకటే కరెన్సీ విలువ ఉన్నా కూడా ఇదే ‘116’ కొనసాగింది.

ఈ 16 సంప్రదాయం చివరకు ప్రభుత్వ పథకాలను కూడా చేరింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆసరా పెన్షన్లలో 2000కు బదులు 2,016, 3000 కు బదులు 3,016 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు. స్వతహాగా ఎంతో దైవభక్తి కలిగి ఉండే కెసిఆర్ ఈ సాంప్రదాయాన్ని ఇక్కడ తీసుకొచ్చారు.

ఇలా కరెన్సీకి సంబంధించిన 116 రూపాయలను ఏదో పవిత్రమైన సంఖ్యగా మారడం విడ్డూరం. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాల్లో ఈ సంఖ్యకు బ్రాహ్మణులు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు. అసలు విషయం తెలియని ప్రజలు సైతం ఇదేదో దైవ సంఖ్యలా భావిస్తుంటారు. హిందూవుల పవిత్ర గ్రంధాల్లో ఎక్కడ కనిపించిన ఈ సంఖ్యకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాముఖ్యత ఉండడానికి ఇదే కారణం. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఈ 116 సంఖ్య గురించి పట్టింపే ఉండదు. అయితే చాలా మంది రౌండ్‌ ఫిగర్‌గా డబ్బులను ఇవ్వడానికి తీసుకోవడానికి ఇష్టపడరు. చివరిలో సున్నా ఉండడమే దీనికి కారణంగా భావిస్తారు. అందుకే మిగిలిన రాష్ట్రాల్లో 101, 1001 లాంటి నంబర్లు కనిపిస్తుంటాయి. అయితే ఇది కూడా అశాస్త్రియమైనదే. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న నంబర్లను హిందూ-అరెబిక్‌ న్యూమరల్స్‌ అంటారు. ఇవి ఫిక్స్‌డ్‌ ఉండే నంబర్లు. అంతేకాని చివరిలో సున్నా ఉంటే అయిష్టం అని, 116 ఉంటే మంచి జరుగుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రియ ఆధారాలూ లేవు.

ఇలా కేవలం అప్పటి కరెన్సీ విలువలో హెచ్చుతగ్గుల కారణంగా ఒక సంప్రదాయం పురుడు పోసుకుని, ఇప్పటికీ కొనసాగుతుంది.

Also Read: ఒకరిది దొరహంకారం.. ఇంకొకరిది అతి విశ్వాసం.. ఇవే ఈ ఇద్దరి పతనానికి కారణం..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *