Menu

Health News: హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితులు.. రిపోర్టుల్లో నిల్‌.. జ్వరం ఫుల్‌!

Praja Dhwani Desk
viral fevers dengue

తుమ్ములు వస్తున్నాయి.. విపరీతంగా దగ్గు కూడా వస్తోంది.. ఓవైపు టెంపరేచర్‌ కూడా 102 డిగ్రీల ఫారెన్‌హీట్‌ దాటింది.. మరోవైపు ఒళ్లునొప్పులు.. కొన్నిసార్లు మోషన్స్‌….! ఇదేదో కచ్చితంగా డెంగీనో లేదా టైఫాయిడో అయి ఉంటుందని ఆస్పత్రికి వెళ్తే రిపోర్ట్స్‌లో మాత్రం అంతా నార్మల్‌. అయితే ప్లేట్‌లేట్లు మాత్రం పడిపోయి ఉంటున్నాయి. ఇదేం విచిత్రమో డాక్టర్లకు కూడా అర్థంకావడం లేదు. అంతుబట్టని వైరస్‌లు ఏవో హైదరాబాద్‌పై అటాక్ చేశాయని ప్రజలు ప్యానిక్‌ అవుతున్నారు. అసలే వర్షాలు కురుస్తుండడంతో ఏ రోగం ఎటు వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియని దుస్థితి..!

2023లోనూ సేమ్ సీన్:

సాధారణంగా ఫీవర్‌ను బట్టి ట్రీట్‌మెంట్ ఉంటుంది. డెంగీకి ఒకరకమైన చికిత్స.. టైఫాయిడ్‌కు ఇంకో రకమైన చికిత్స.. వైరల్‌ ఫీవర్‌ అయితే మరో రకమైన చికిత్స.. అయితే అసలు ఏ ఫీవరో తెలియకపోతే..? అంతా అయోమయం గందరగోళం.. హైదరాబాద్‌లో చాలా మంది పేషెంట్ల పరిస్థితి ఇది. నిజానికి 2023 ఆగస్టులో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. 100 డిగ్రీల ఫారెన్‌హీట్‌ను దాటి జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, తలనొప్పి, చలి లాంటి లక్షణాలతో చాలా మంది ఆస్పత్రికి క్యూ కట్టిన రోజులవి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ లెవల్స్‌ పడిపోవడం లాంటి సమస్యలతో కొంతమంది ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు కూడా. అయితే పరీక్షల్లో మాత్రం అన్ని నెగిటివ్‌ రిపోర్టులే..!

స్వైన్‌ ఫ్లూ కాదా?

ఈసారి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు.. 3-4 రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతున్నారు.. నిజానికి ఇది స్వైన్‌ ఫ్లూ అని అనుకుంటున్నారు కానీ రిపోర్టుల్లో మాత్రం స్వైన్‌ ఫ్లూ టెస్టు చేస్తే నెగిటివ్‌ అనే వస్తోంది. మరేంటి మిస్టరీయస్‌ వైరస్? ఇప్పుడిదే ప్రశ్న అందరిని వేధిస్తోంది!

ప్లేట్‌లేట్‌ కౌంట్‌ తగ్గితే కారణం అది కూడానా?

మరోవైపు ప్లేట్‌లేట్ కౌంట్ తగ్గుతుంది కానీ ఎలాంటి ఫీవర్ ఉండదు. ఇలాంటి పేషెంట్ల సంఖ్య ఇటివలీ కాలంలో పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. దీనిపై డాక్టర్లు క్లారిటీ ఇస్తున్నారు. తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ తప్పనిసరిగా డెంగీని సూచించదని స్పష్టం చేస్తున్నారు. సాధారణ జలుబు, వైరల్ జ్వరం కూడా ప్లేట్‌లెట్లను తగ్గిస్తుందట. ప్రమాదకరం కాని అనేక వైరల్ ఇన్ఫెక్షన్లు ప్లేట్‌లెట్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు నగరంలో నమోదవుతున్న చాలా కేసుల బాధితులు ఇలాంటి వైరల్ వ్యాధులతోనే బాధపడుతున్నారు.

Also Read: మూఢనమ్మకాలే సమాజపు వెనుకబాటుతనం.. అడ్డమైన ఆచారాలే మానవళికి అపార నష్టం!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *