యూనిఫాం సివిల్ కోడ్(UCC).. బీజేపీకి ఉన్న సైద్దాందిక పరమైన కలల్లో దీని ఇంప్లిమెంటేషన్ కూడా ఒకటి. అన్ని మతాలకు వివాహంతో సహా ఇతరాత్ర విషయాల్లో ఒకటే నిబంధనలు ఉండాలన్నది UCC ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం కొన్ని మతాలకు వారి మత ప్రాతిపాదికన రూల్స్ అమల్లో ఉన్నాయి. ఇది బీజేపీకి ఏ మాత్రం నచ్చని విషయం. ఎందుకంటే ముస్లింలకు ఒక రూల్, హిందూవులకు ఒక రూల్ ఉండకూడదన్నది బీజేపీ మాట. ఇది చాలావరకు వ్యాలిడ్ పాయింటే. ఎందుకంటే ముస్లిం మతాచారాలైనా, ఇతర మతాచారలైనా వాటిని ఫాలో అయితే బలైపోయేది మహిళలే. అందుకే యూనిఫాం సివిల్ కోడ్ గురించి ఎప్పుడు చర్చ వచ్చినా దేశవ్యాప్తంగా భిన్నవాదనలు వినిపిస్తుంటాయి. అటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు UCCని అమలు చేసేందుకు ఇప్పటికే డ్రాఫ్ట్‌ను రెడీ చేసుకున్నాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో రేపో మాపో UCCబిల్లు పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాహాలు, విడాకుల సంగతి అటు ఉంచితే ఇటీవలి కాలంలో లివ్-ఇన్-రిలేషన్‌షిప్స్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్(UttaraKhand) యూసీసీ డ్రాఫ్ట్‌లోనూ దీనికి సంబంధించి రూల్స్ పెట్టారు.
HUGE ⚡⚡ Registration of live-in relationships will become mandatory as per Uttarakhand UCC bill.
Share your views.
If anyone doesn’t get it registered, then it becomes a punishable offence with imprisonment up to 3 months or a fine of Rs 10,000 or both.
In case, a woman in a… pic.twitter.com/C2iKa1vjI1
— Times Algebra (@TimesAlgebraIND) February 6, 2024
ఇదేం లాజిక్కు?
లివ్-ఇన్‌లో ఉండాలనుకునే వారు సంబంధిత ప్రభుత్వ పోర్టర్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకునే ముందు ఆ విషయాన్ని పేరెంట్స్ లేదా వారి గార్డియన్స్‌కు చెప్పాలంట. ఇక ఇలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం వీరిని లివ్-ఇన్ పార్టనెర్స్‌గా గుర్తిస్తుంది. ఆ గుర్తింపు పత్రంతో ఇల్లు తీసుకోని ఉండచ్చట. సరే.. ఇలా ఉండడం హిందూ సమాజాన్ని, ముస్లిం మతాన్ని, క్రిస్టియన్ పద్ధతులతో పాటు ప్రపంచంలో ఉన్న 4,200 మతాల ఆచారాలను అగౌరవపరిచినట్టే కావొచ్చు.. అదంతా ఛాదస్తులు, ఛాందసవాదుల వ్యవహారం. మనకి అనవసరం. ఈ సమాజం, మతం, మట్టి, మశానం లాంటి అర్థంలేని వాదనలను పక్కన పెడితే అసలు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పెట్టిన రూల్స్ ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంది.
పోనిలే పుట్టింట్లోనే కాపురం పెట్టమనలేదు:
ఒక మేల్, ఫిమేల్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారంటే దాని అర్థం లివ్-ఇన్-రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు కాదు. చాలామంది సొంత అన్నచెల్లెలు, అక్కాతమ్ముళ్లు కూడా కలిసి ఉంటారు. కొంతమంది కజిన్స్‌తో ఉంటారు. మరికొంతమంది ఆపోసిట్ జెండర్ ఫ్లాట్‌మేట్స్‌తో ఉంటారు.. కొందరి కోలిగ్స్‌తో ఉంటారు. అసలు ఏ సంబంధం లేకుండా కూడా కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఓనర్-టెనంట్ వ్యవహారం. ఓనర్‌కి ఎలాంటి ప్రాబ్లెమ్ లేకపోతే ఏ ఇద్దరైనా ఒక చోట కలిసి ఉండొచ్చు. ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి ఉన్నంత మాత్రానా వారు లివ్-ఇన్‌లో ఉన్నారని కాదు కదా. ఉత్తరాఖండ్ యూసీసీ నిబంధనల ప్రకారం లివ్-ఇన్ వాళ్లు రిజిస్టర్ చేసుకోవాలి. మరి పైన చెప్పిన వారు కలిసి ఉండాలంటే ఎక్కడా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే రియల్‌గా లివ్-ఇన్‌లో ఉన్నవాళ్లు కూడా ఫ్లాట్‌మేట్స్ అనో, కోలిగ్స్ అనో, ఇంకేదైనా చెప్పుకోనో కలిసి ఉండొచ్చు. ఇక్కడ నిజాలు, అబద్ధాలు లాంటి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఒకపెళ్లి చేయడానికి వెయ్యి అబద్ధాలైనా ఆడొచ్చని చెప్పే ధర్మాలు ఉన్నప్పుడు కలిసి ఉండటానికి ఏ ఇద్దరైనా ఒక అబద్ధం చెప్పడం అధర్మమని భావించరు. అయితే ప్రభుత్వ నిబంధనలు కాస్త జవాబుదారితనంగా ఉండొచ్చు. అదే సమయంలో కలిసి ఉన్న ప్రతి ఆడ-మగకి ఏదో ఉందని అంటగట్టే ప్రమాదాలు పెరగవచ్చు. ఇదంతా నాన్‌సెన్స్.. ఒక ప్లాన్ లేకుండా ఏదో రూల్ పెట్టాలని పెట్టినట్టుగా ఉంది. దీని వల్ల ఒరిగేదేమీ లేదు.. ఎవడ్రా బాబు ఇంట్లో చెప్పి మరీ లివ్-ఇన్‌లో ఉంటాడు.. ఇంక నయం పేరెంట్స్ ఇంట్లోనే కాపురం పెట్టమని చెప్పలేదు.. సంతోషం!
Also Read: యావత్ దేశాన్ని ఫూల్ చేసిన పూనమ్‌కు ఆ సమస్య ఉందా? ఆమె ఎందుకిలా చేస్తుంది?