Menu

ప్రపంచ విప్లవ పోరాటాల్లో గొప్ప అధ్యాయం! తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్ర!!

Praja Dhwani Desk
telangana liberation day razakars

అణచివేతలకు అన్యాయాలకు కేంద్రం:

hyderabad kingom area map

 

హైదరాబాద్ సంస్థానం.‌ అసఫ్ జాహి వంశస్తులు దీన్ని పరిపాలించారు.దీని విస్తీర్ణం 16 జిల్లాలతో.. ప్రస్తుత తెలంగాణ తో పాటు మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక లో 3 జిల్లాలు ఉన్నాయి. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధీనంలో 636 గ్రామాల్లో 5లక్షల 30వేల ఎకరాల భూమి ఉండేది. తన ఆస్తి అప్పటి లెక్కల్లోనే 400కోట్లు. ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా పేరు పొందాడు.5 వేల ఎకరాలు కలిగిన భూస్వాములు 500 పైగా ఉన్నారు. నిజాం అండదండలతో జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలు, పటేళ్లు, పట్వారీలు హైదరాబాద్ సంస్థానంలో సాగులో ఉన్న లక్షల ఎకరాల భూమిని కలిగి ఉన్నారు.

వీరంతా సామాన్య ప్రజలు, రైతులను పన్నులతో, వెట్టి చాకిరీ తో హింసించేవారు. స్త్రీలను అత్యాచారాలు చేయడం, మాట వినకపోతే చంపేసే ఆటవిక రాజ్యం నడిచింది.

ఆంధ్ర మహాసభ మితవాదులు:

suravaram prathap reddy, madapati hanumantha rao

 

1921, నవంబర్ 12వ తేదీ రా,త్రి 11 మంది ప్రముఖులు ఆంధ్ర జనసంఘం అనే రాజకీయేతర సంస్థను ఏర్పాటు చేశారు. 1922, ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్లో ఈ సంఘం ప్రథమ సమావేశం కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. దీని కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. ఈ సమావేశంలో ఆంధ్ర జనసంఘం పేరును నిజాం సంస్థాన ఆంధ్ర జనసంఘంగా మార్చారు. బూర్గుల రామకృష్ణారావు, మందముల నరసింగారావు, జమలాపురం కేశవరావు, పులిజాల వెంకట రంగారావు వంటి తొలితరం మితవాదుల ఆధ్వర్యంలో మొదలైంది. ఈ సంఘం సాంస్కృతిక విషయాలను లోతుగా పరిశీలించడం, దానికి అనుగుణంగా తీర్మానాలు చేయడం. ఇదే సందర్భంలో అక్కడే జరిగిన ఆంధ్ర మహిళా సభ మొదటి సమావేశానికి నడింపల్లి సుందరమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో స్త్రీ విద్య, హరిజనోద్ధరణ, సాంఘిక దురాచారాల తొలగింపు, జాగీరు భూముల్లో రైతుల హక్కుల రక్షణ, తెలంగాణ సరిహద్దులను కచ్చితంగా నిర్ణయించడం, స్థానిక సంఘాల్లో ఎన్నికల పద్ధతి తదితర అంశాలను చర్చించారు. కానీ వీటికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టడంలో తెలంగాణలో పలుచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ గ్రంథాలయ ఉద్యమాన్ని మాడపాటి హనుమంతరావు పట్టుదలతో కొనసాగించాడు.ఆంధ్ర మహాసభలకు ప్రజాదరణ బాగా పెరగడంతో ప్రభుత్వం ఆందోళనకు గురైంది. 1929లో గస్తి నెంబరు 53ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే పది రోజుల ముందే సమావేశ ఎజెండా ప్రభుత్వానికి తెలియజేసి అనుమతి తీసుకోవాలి.

ఆ తర్వాత ఆంధ్ర జన సంఘం ఆంధ్ర మహాసభ గా అవతరించింది. దీనికి బీజం 1930లో మెదక్ జిల్లాలోని జోగిపేట్ లో జరిగిన సమావేశంలో పడింది. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. అప్పటి నుండి ఆంధ్ర మహాసభ మితవాదుల చేతిలో నడిచింది.

కమ్యూనిస్టుల బలోపేతం:

1941లో రావి నారాయణరెడ్డి నాయకత్వంలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులు, అఖిల భారత కిసాన్‌సభతో కలిసి సంగం ఏర్పాటు చేసి నిజాం, దొరలకు వ్యతిరేకంగా “భూమి కోసం – భుక్తి కోసం – విముక్తి కోసం” అనే నినాదంతో పోరాడింది.

ఆ తర్వాత మూడేళ్లకు అంటే 1944 లో ఆంధ్ర మహాసభ కీలక ఘట్టం మొదలైంది. దీనికి రావి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సభలో సంఘం సభ్యత రుసుము 4 అణాల నుండి 1 అణాకు తగ్గించారు. ఈ సభలోనే ఆంధ్రా మహాసభ అధికారికంగా మితవాదులు, అతివాదులుగా చీలిపోయింది. అతివాదులకు కమ్యూనిస్టులు నాయకత్వం వహించగా, మితవాదులు కాంగ్రెస్ వైపు ఉన్నారు. అప్పటినుండి ఎవరికి వారు విడిగా సభలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. అప్పటికే ఈ సంఘంలో 7లక్షల మంది చేరారు.

1946లో జరిగిన సభలు కూడా ఆంధ్ర మహాసభ యొక్క చివరిగా జరిగాయి.

దీని తరువాత ఆంధ్ర మహాసభలోని మితవాదులు హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌లో చేరిపోగా, అతివాదులు కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరిపోయారు.

రజాకార్ల పుట్టుక:

razakars of hyderabad under qasim razvi

 

1927 నవంబర్ 12న మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు బహదూర్ యార్ జంగ్ స్థాపించాడు. ముస్లిం మత, సంస్కృతి వ్యాప్తి లక్ష్యంగా పని చేసింది.‌ తనే *రజాకార్* అనే పదాన్ని ఉపయోగించాడు. రజాకార్ అంటే ఉర్దూలో స్వచ్ఛంద సేవకులు అని అర్థం.

qasim razvi, leader of razakars

razakars leader Qasim Razvi

 

1944 లో యార్ జంగ్ చనిపోయాక లాతూర్ కి చెందిన న్యాయవాది ఖాసిం రజ్వీ నేతృత్వంలోకి వెళ్లింది.

అప్పటినుండి ఈ సంస్థ ఇస్లాం ఛాందసవాదం ను ముందుకు తీసుకెళ్ళింది. ఈ రజాకార్లు చెయ్యని దారుణాలు లేవు. ఆడవాళ్ళను హత్యాచారం చెయ్యడం, దోపిడీ, బలవంతపు మతమార్పిడులు,

సాయుధ పోరాటానికి ఊపిరి ఊదిన దొడ్డి కొమురయ్య:

doddi komarayya

visnur dhora ramchandra reddy

1944లో ఆంధ్ర మహాసభ ప్రోత్బలంతో, ఎన్నో ప్రాంతాల్లో గ్రామ సంఘాలు ఏర్పడ్డాయి. విస్నూర్ దేశముఖ్ రామచంద్రారెడ్డి 60 గ్రామాలను శాసించాడు. అప్పటి నల్గొండ జిల్లా కడివెండి గ్రామంలో(ప్రస్తుత జనగాం జిల్లా) కూడా గ్రామ సంఘం ఏర్పడింది. ఊరి జనమంతా అందులో చేరారు. వారంతా పన్నులు కట్టడం మానేశారు. వారిలో దొడ్డి మల్లయ్య వారి సోదరుడు దొడ్డి కొమరయ్య కుటుంబం కూడా ఉంది. 1946 జూలై 4న దేశముఖ్ రాంచంద్రారెడ్డి మామ గడ్డం నర్సింహా రెడ్డి నేతృత్వంలో ప్రజా నాయకుడిగా ఎదిగిన ఎర్రంరెడ్డి, మోహన్రెడ్డి, నల్లా నర్సింహను హత్య చేయాలని కుట్రపన్ని అందులో భాగంగా దేశముఖ్ అనుచరుడు జూలై 4న దేశముఖ్ రాంచంద్రారెడ్డి మామ గడ్డం నర్సింహా రెడ్డి నేతృత్వంలో ప్రజా నాయకుడిగా ఎదిగిన ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి, నల్లా నర్సింహను హత్య చేయాలని కుట్రపన్ని అందులో భాగంగా దేశముఖ్ అనుచరుడు మస్కీనలీ నాయకత్వంలో 40 మంది గుండాలు కడవెండి గ్రామంలోకి వచ్చారు. చీకటి పడే సమయంలో గుండాలు బండ బూతులు తిడుతూ రెచ్చగొడుతూ కార్యకర్తల ఇండ్లపైకి రాళ్ళు రువ్వడం ప్రారంభిం చారు. సంఘం ఆర్గనైజర్ కె.రాంచంద్రారెడ్డితో పాటు రెండు వందలమందికి పైగా ప్రజలు ఆంధ్రమహాసభకు జై, సంఘం వర్ధిల్లాలి, దేశముఖ్ దౌర్జన్యాలు నశించాలి’ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయల్దేరారు. విస్నూర్ దొర అనుచరుడు మస్కీన్అలి నాయకత్వంలో 40 మంది గుండాలు కడవెండి గ్రామంలోకి వచ్చారు. చీకటి పడే సమయంలో గుండాలు బండ బూతులు తిడుతూ రెచ్చగొడుతూ కార్యకర్తల ఇండ్లపైకి రాళ్ళు రువ్వడం ప్రారంభిం చారు. సంఘం ఆర్గనైజర్ కె.రాంచంద్రారెడ్డితో పాటు రెండు వందలమందికి పైగా ప్రజలు “ఆంధ్రమహాసభకు జై”, “సంఘం వర్ధిల్లాలి”, “దేశముఖ్ దౌర్జన్యాలు నశించాలి” అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయల్దేరారు. సంఘం నాయకులు దొడ్డి కొమరయ్య, అన్న మల్లయ్య తో కలిసి ముందు వరుసలో నిలబడ్డాడు  మస్కీనలీ అనుచర గుండాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ర్యాలీ గఢీని సమీపించగానే జరిపిన

తుపాకి కాల్పుల్లో ఓ తూటా దొడ్డి కొమురయ్య శరీరంలోకి దిగగా, ‘ఆంధ్ర మహాసభకు జై’ అంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు.

కొమరయ్య మృత దేహాన్ని జనగాం తరలించి పోస్టుమార్టం నిర్వహించి నెల్లుట్ల గ్రామం వద్ద పూడ్చిపెట్టారు. కొమురయ్య హత్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత సామాన్య ప్రజలకు రక్షణ ఉంటూ ఉద్యమాన్ని కాపాడాలి అని భావించి రావి నారాయణరెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి వంటి కమ్యూనిస్టు నాయకులు సాయుధ పోరాటానికి పిలుపునిస్తూ కరపత్రాలు జారీ చేశారు. గ్రామాల్లో దళాలను సమీకరించి కర్రలు,వడిసెలు, వ్యవసాయ పనిముట్లు ఆయుధాలుగా చేసుకున్నారు.

అలా రైతాంగ‌పోరాటం ప్రారంభమైంది.

విస్నూర్ దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి ఆకృత్యాలు:

chityala ailamma popularly known as chakali ailamma

విస్నూర్ దొర రామచంద్రారెడ్డి రజాకార్లకు డిప్యూటీ చీఫ్ గా  ఉన్నాడు. తర్వాత విస్నూర్ దొరకు పన్నులు కట్టనని చాకలి ఐలమ్మ (అసలు పేరు చిట్యాల ఐలమ్మ) గూండాలకు, పోలీసులకు వ్యతిరేకంగా గళమెత్తింది. దొర గూండాలు, జాకార్లు ఎన్ని నిర్బంధాలు అడ్డంకులు సృష్టించినా, సంఘం నాయకులు భీమిరెడ్డి నరసింహారెడ్డి వంటి వారి సహకారంతో బలంగా పోరాడింది.

puchalapally sundaraiah,bheemreddy narasimha reddy, arutla ramchandra reddy and arutla kamala devi

భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రలోని పుచ్చలపల్లి సుందరయ్యను తెలంగాణ సాయుధ పోరాటానికి దిశా నిర్దేశం చేయడానికి నియమించింది. ఆయన ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల దంపతులు, ధర్మ బిక్షం మల్లు స్వరాజ్యం, బద్దం ఎల్లారెడ్డి, రాజ బహదూర్ గౌర్ వంటి ఎంతోమంది కమ్యూనిస్టు నాయకులు సాయుధ పోరాటంలో , మాడపాటి హనుమంతరావు, కాళోజి నారాయణ, బూర్గుల రామకృష్ణారావు వంటి కాంగ్రెస్ నాయకులు వారి సొంత విధానంలో పోరాటం చేశారు.

రజాకార్లు, నిజాం పోలీసులు దొరల ఆకృత్యాలు ఎన్నో ఉండేవి. పైగా కమ్యూనిస్టులకు సహకరిస్తున్నారు అనే అనుమానం వస్తే జనాలను ఎంతో పీడించేవారు. అయినా జనాలు వెనకడుగు వేయకుండా పోరాటానికి మద్దతు పలికారు. ఈ పోరాటంలో బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, పరకాల లోని ప్రదేశాల్లో ‌ జరిగిన దారుణాలు ఎందరో ప్రాణాలను బలి తీసుకున్నాయి.

తెలంగాణ సాయుధ పోరాటంలో మహోన్నధ్యాయం:

telangana sayudha poratam

mallu swarjyam and other women in telangana rebellion

సాయుధ పోరాటంలో కేవలం పురుషులే పాల్గొంటే కష్టమని భావించి మహిళలను కూడా భాగం చేశారు. వారికి అనేక విధాలుగా తర్ఫీదు ఇచ్చారు.

ముఖ్యంగా నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాలోని పంచాయతీలను గ్రామ రాజ్యాలుగా ఏర్పరిచారు ప్రజా కమిటీల ఆధ్వర్యంలో 10 లక్షల ఎకరాల భూమి రైతాంగానికి పంపిణీ చేయబడింది పెట్టి చాకిరి రద్దు ప్రాణాలను కొల్లగొడుతున్న అత్యధిక వడ్డీరేట్లు తగ్గించడం మొత్తంగా రద్దు చేయడం జరిగింది వ్యవసాయ కార్మికుల రోజు కూలి పెంచింది కనీస వేతనం అమలుపరచబడింది. ఫారెస్ట్ ఆఫీసర్స్ అడవుల నుండి వెళ్లగొట్టి ఆటవిక తెగలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తమ శ్రమ ఫలితాన్ని స్వేచ్ఛగా అనుభవించి గలిగారు. 12 -18 నెలలు ఈ ప్రాంతాలలో పరిపాలన మొత్తం గ్రామ రైతు కమిటీలే చేశాయి. లక్షలాదిమంది జీవితంలో మొదటిసారి రెండు పూటలా భోజనం చేశారు అని పోరాట నాయకుల్లో ఒకరైన భీమిరెడ్డి అన్నాడు.

telangana peasantry armed rebellion

telangana movement armed rebels

“ఆపరేషన్ పోలో”:

ఇదిలా ఉండగా, 1947 ఆగస్టు 15న భారతదేశపు స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని అనేక రాజ్యాలను ఒక్కటిగా చేసే బాధ్యతను తీసుకున్నాడు. దాంట్లో భాగంగా హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తో విలీనంపై చర్చలు జరిపారు. అయితే నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని కోరుకున్నాడు. అదే ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో యధాతధ స్థితి కొనసాగించేందుకు ఒప్పందం కూడా చేసుకున్నాడు. అయితే నిజాం పాకిస్తాన్ తో సత్సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందనే సమాచారంతో, దేశం నడిబొడ్డున ఉన్న ప్రాంతం దానికి కేంద్రం కాకూడదు అని సర్దార్ పటేల్ భావించాడు. దాంతో సెప్టెంబర్ 13 1948లో కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యకు ఆదేశం ఇచ్చాడు. అప్పటి ఆర్మీ జనరల్ జే ఎన్ చౌదరి ఆధ్వర్యంలో *”ఆపరేషన్ పోలో”* పేరుతో హైదరాబాద్ సంస్థానం నలుదిక్కులా సైనికులు రావటం మొదలుపెట్టారు. ఈ విషయం ముందే తెలుసుకుందాం నిజాం, అప్పటికే ఏర్పాటైన ఐక్యరాజ్యసమితిలో భారత ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశాడు. ఈ లోపు టాంక,ర్లు విమానాలు, భారీ ఆయుధాలతో సైనికులు రావడం మొదలుపెట్టారు. హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ, భారత సైన్యం హైదరాబాద్ రాజ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, సవాలును ఎదుర్కోవడానికి నిజాం ఆర్మీ జనరల్ ఎల్ ఎద్రూస్ ఆధ్వర్యంలో లక్ష మంది సైనికుల బలగం సిద్ధంగా ఉందని ప్రగల్భాలు పలికాడు. ఈ లోపు సైన్యంతో

సూర్యాపేట దగ్గర మూసీ నది మీద ఉన్న బ్రిడ్జిని నిజాం సైనికులు పేల్చేసినా, తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసుకొని ఆర్మీ అధికారులు ముందుకు వెళ్లారు. నిజాం సైనికులు, రజాకార్లు వీరి మీద కొన్నిచోట్ల ప్రతిఘటన చేసినా, పోరాటం చేసి గెలవలేము అని అర్థమైన నిజాం రాజు లొంగిపోవటానికి సిద్ధమయ్యాడు. సెప్టెంబర్ 17న కాల్పుల విరమణను నిజాం ప్రకటించాడు. అప్పటికే సైనికులు సైన్యం సికింద్రాబాద్ కు చేరింది.

 

హైదరాబాద్ విలీనం తర్వాత పరిస్థితి:
pandit sundarlal committee report on hyderabad riots

Sunderlal committee report

ఆ తర్వాత ప్రస్తుత హకీంపేట విమానాశ్రయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ స్వాగతం పలికాడు. భారత సైన్యం రజాకార్లను ఓడించి, హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేసిన ఆపరేషన్ పోలో తర్వాత, నిజాం రాజును హైదరాబాద్ రాష్ట్ర రాజ ప్రముఖ్ గా సంవత్సరానికి కోటి భరణం అందుకున్నాడు. ప్రధాని లాయక్ అలీ పాకిస్తాన్ కి పారిపోయాడు. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీని గృహనిర్బంధంలో ఉంచారు. దేశద్రోహ కార్యకలాపాలు,మత హింసను ప్రేరేపించడంపై భారత చట్టాల ప్రకారం విచారించారు. అతను 1948 నుండి 1957 వరకు జైలు శిక్ష అనుభవించాడు. అతను విడుదలైన 48 గంటలలోపు పాకిస్తాన్‌కు వలస వస్తాడనే హామీపై మాత్రమే అతను జైలు నుండి విడుదలయ్యాడు. అతను జైలు నుండి విడుదలయ్యే షరతు ప్రకారం పాకిస్తాన్‌కు వలస వెళ్ళడానికి అంగీకరించాడు. ఆ తర్వాతఆ తర్వాత 1970లో పాకిస్థాన్ లోని కరాచీలో మృతి చెందాడు.

విరమించని కమ్యూనిస్టుల సాయిధ పోరాటం:

అలా ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యింది. అయితే ఈ కార్యక్రమం జరిగాక, సైన్యం సాయుధ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులు రైతులు మహిళల మీద దాడి చేయడం ప్రారంభించింది.‌ భూమిపై సామాన్యుల హక్కును పరిరక్షించవలసి ఉంటుంది నిజాం బలగాలను ఓడించడమనే ప్రకటిత లక్ష్యం నెరవేరాక భారత సైన్యం – రైతాంగంపై తుపాకులు ఎక్కుపెట్టవచ్చు. నిరంకుశ పాలన నుంచి విముక్తమయ్యామనే భావనతోనే కొట్టుకుపోవద్దని, సంపన్న వర్గాల, భూస్వాముల ప్రయోజనాలు కాపాడేందుకు భారత సైన్యం ప్రయత్నిస్తుంది. అందుకోసం అవసరమైతే పేద రైతులు వ్యవసాయ కార్మికులపై అది నిర్బంధానికి కూడా వెనుకాడరు అని, పడిన కష్టం పంచిన భూమి ఎంత మళ్లీ భూస్వాముల చేతుల్లోకి వెళ్తుందని.. కమ్యూనిస్టు నాయకులు భావించారు.

దొరలు పోయి, ఖద్దరు దొరలు వచ్చారని కాంగ్రెస్ పార్టీలో చేరిన భూస్వాములను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 

క్రమేణా ప్రజల్లో నిసృహ పెరుగుతుంది. పీడిత ప్రజల తరఫున సైన్యాన్ని ఎదుర్కోవడానికి అప్పుడు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మేము ఆధునాతన ఆయుధాలు సేకరించుకున్నప్పటికీ సాయుధ బలగాలపై అన్నివైపుల నుంచి దాడి చేయడం వారి ఉద్దేశం కాదు. మా కార్యకర్తల బలం సైన్యం సంఖ్యతో ఏ విధంగానూ సరిపోదు. అందుకే మేము గెరిల్లా తరహాలో దాడి చేసి దౌడు తీసే పద్దతిని ఎంచుకున్నారు అని పుచ్చలపల్లి సుందరయ్య తన ఆత్మ కథలో వ్యాఖ్యానించారు.

సుందర్ లాల్ కమిటీ రిపోర్ట్:

హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అయ్యే సమయం ఆ తర్వాత సంస్థానంలోని కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ నగర ప్రాంతంలో అనేక అల్లర్లు జరిగాయి. హిందువులు ముస్లింలు మత ఘర్షణలకు పాల్పడ్డారు. ఎన్నో వేలమంది చనిపోయారు మరెందరో నిరాశ్రయాలు. ఇటు భారత సైన్యం కూడా 4వేల మంది కమ్యూనిస్టులను కూడా చంపింది.

ఈ సంఘటనలను విచారించడానికి భారత ప్రభుత్వం పండిత్ సుందర్ లాల్ అధ్యక్షతన క్వాజీ అబ్దుల్ గఫ్ఫార్, మౌలానా అబ్దుల్లా మిస్రీ లతో త్రిసభ్య కమిటీని నియమించింది. 9 జిల్లాలో వీరు పర్యటించారు. 31 పబ్లిక్ మీటింగ్ లు,27 ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారు. వారి అంచనా ప్రకారం 35,000 నుండి 40,000 మంది చనిపోయారని పేర్కొంది. వారి పర్యటించిన 9 జిల్లాలోనే ఈ చనిపోయిన వారు దాదాపు 90% ఉంటారని తెలియజేసింది. సోలాపూర్ కి చెందిన ఆయుధాలతో శిక్షణ పొందిన ఒక హిందూ సంఘం, మరికొన్ని ముస్లిం గ్రూపులు అనేక చోట్ల లూటీలు, దాడులు హత్యలు, ఆడవారిపై అత్యాచారాలు చేశారని రిపోర్టులో ఉంది. అయితే కొన్నిచోట్ల ముస్లిం మహిళలను హిందూ ప్రజలు, హిందువులను ముస్లింలు కాపాడిన ఘటనలు కూడా నమోదయ్యాయి. అయితే ఈ రిపోర్ట్ ను బయటకు రానీకుండా చేసింది అప్పటి ప్రభుత్వం. దీన్నిబట్టి తెలంగాణ సాయుధ పోరాటం మతాల చిచ్చు కాదని పెత్తందారులకు అణిచివేయబడ్డ వారికి మధ్య జరిగిన పోరాటంగా మనం గుర్తించవచ్చు. కానీ ఈరోజు కొందరు వారి రాజకీయ స్వలాభం కోసం, సెప్టెంబర్ 17 కు అనేక పేర్లు చేర్చి పబ్బం గడుపుతున్నారు. దీన్ని హిందూ- ముస్లిం పోరాటంగా చిత్రీకరించడానికి కుట్రలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మీరు ఒంటరి కాదు!.. కలిసి ప్రాణాలను కాపాడుకుందాం!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *