Menu

ఏంటో ఇలాంటి ఆయిల్స్ అన్ని ఆ టీవీ వాళ్లకే దొరుకుతాయ్‌!


తెలుగు మీడియాలో భారీ రీచ్‌ ఉన్న పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఏనాడో హద్దులు దాటేశాయి.


Tri Ten B

నలుపు దురదృష్టానికి చిహ్నంగా.. తెలుపంటే అదృష్టంగా భావించే సమాజాలు ప్రపంచమంతా ఉన్నాయి. ఇది యూరోపియన్‌ సామ్రాజ్యవాదం ప్రపంచంపై కక్కిన విషం కావొచ్చు. తెల్లజాతి ప్రపంచాన్నంతా దోచుకున్నది. నలుపుని తక్కువ చేసింది. నల్లవారిని అణిచివేసింది. వీరి జాత్యాహంకారం ఎంతలా సాగిందంటే ఆఖరికి పదాల్లో కూడా రెసిజమే కనిపిస్తుంది. అందుకే అవినితీ సోమ్మును బ్లాక్‌ మనీ అని.. చెడు రోజును బ్లాక్‌ డే అని పిలుస్తున్నారు. విషాద సమయాల్లో నలుపు దుస్తులు ధరిస్తున్నారు. ఇదంతా మనకు తెలియకుండానే మన నిత్యజీవితంలో భాగమైపోయిన విషయాలు. ఇది కూడా రెసిజమే.. అయితే అజ్ఞానంతో కూడిన రెసిజం. అమెరికాలో జాత్యాహంకారం గురించి ప్రపంచమంతా తెలుసు. అయితే ఈ ఉన్మాదం ఇండియాలో కూడా కనిపిస్తుంది. అందుకే నల్లగా ఉంటే తెల్లగా మారడానికి క్రీములు తయారు చేసే కంపెనీలు ఇండియాలో ఎక్కువగా పుట్టుకొచ్చాయి. ఓ అమ్మాయి ముఖం నలుపు నుంచి తెల్లగా మారితే ఉద్యోగాలు కూడా వస్తాయంటూ యాడ్స్‌ దర్శనమిస్తాయి. నల్లగా ఉంటే టాలెంట్‌ ఉన్నా గుర్తించరని అదే ఫెయిర్‌ అండ్‌ డాష్‌లి క్రీములు వాడితే వెంటనే ఆ టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుందంటూ రెసిస్ట్‌ అడ్వెర్‌టైజ్‌మెంట్లు రోజూ టీవీల్లో కనిపిస్తాయి. ఇదంతా ఆయా కంపెనీలు డబ్బుల కోసం చేసే జిమ్ముక్కులు. వారికి ఎథిక్స్‌తో పని ఉండదు.. ఉండాలని కూడా రూల్‌ లేదు. అయితే ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాల్సిన మీడియా వారి దారిలోనే ప్రయాణిస్తుండడం బాధాకరం.


వ్యూస్‌ కోసం, రీచ్‌ కోసం ఏది పడితే అది చేయకూడదు. తెలుగు మీడియాలో భారీ రీచ్‌ ఉన్న పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఏనాడో హద్దులు దాటేశాయి. వాస్తవానికి విరుద్దంగా ఉండే థంబ్‌నెయిల్స్‌ నుంచి అశాస్త్రియ విషయాలను ప్రజలకు చేరవేయడంలో అందరికంటే ముందుంటున్నాయి. ముఖ్యంగా ఈ తెలుపు, నలుపు చర్మం గురించి అసత్యాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. కేవలం రూపాయ్‌ ఆయిల్ కొంటే చాలు ఎంత నల్లగా ఉన్నావరైనా ఇట్టే తెలుపు రంగులోకి మారిపోతారంటూ నకిలీ ప్రొడక్ట్స్‌కు ప్రమోషన్స్‌ ఇస్తున్నాయి. ఇదంతా పైసా కోసమే.. కానీ వీటి వల్ల ప్రజల మనుసులు ఎంత కలుషితం అవుతున్నాయో ఇలాంటివి ప్రచారం చేసే యూట్యూబ్‌ ఛానెల్స్‌కు తెలియడం లేదు. తెలిసినా తెలియనట్టే నటిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది డబ్బే కదా!

నల్లగా ఉంటే తెల్లగా ఎందుకు మారాలి? తెలుపు ఒకటే అందమా? నలుపు కదా? విదేశీ మీడియాలో న్యూస్‌ రీడర్లగా నల్లగా ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు కదా. మేకప్‌ అన్నది అక్కడి స్టూడియోలో లైట్‌ సెట్టింగ్స్‌ ఆధారంగా వ్యూయర్స్‌కి క్వాలిటీగా కనపడేలా చేయడం కోసమే అప్లై చేస్తారు. మన మీడియాలో టాలెంట్‌ ఉండి నల్లగా ఉండే న్యూస్‌రీడర్స్‌ను మేకప్‌తో తెల్లగా మార్చేస్తారు. ఎందుకంటే ప్రజలు కూడా తెల్లగా ఉంటేనే అందం అని భావిస్తారు. ఇదంతా శతాబ్దాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయిన అభిప్రాయం. దీన్ని మార్చాల్సిన బాధ్యత ఉన్నవారు అది చేయకపోగా తమ యూట్యూబ్‌ ఛానెల్‌ వ్యూస్‌ కోసం నలుపును తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇది కూడా రెసిజమే కదా.. బ్లాక్‌ లైవ్స్‌ మేటర్ అని అమెరికాలో జరిగే జాత్యాహంకార దాడులకు వ్యతిరేకంగా కథనాలు అల్లుతు మరోవైపు తెల్లగా మారాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వమని చెబితే ఎలా? ఇదేం హిపోక్రసీ!

Also Read: కట్టుబాట్లను కాలదన్నే టీనేజ్ యువతి.. మెదడులో ఇంకా ఎక్కడైనా బూజు ఉంటే దులిపేస్తుంది!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *