చందమామ(moon) రావె… జాబిల్లి రావె… కొండెక్కి రావె… చీకటిలో ఆకాశాన ఉన్న చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించేది మన తల్లి. అలాగే చందమామను చూస్తూ చక్కటి కథలు ఎన్నో విన్నాం. అబ్బా చూడటానికి ఎంత అందంగా ఉందీ జాబిల్లి అని మురిసిపోయాం. అయితే ఇప్పుడా అందమైన చందమామకు మనిషి… తన మురికిని అంటిస్తున్నాడు… ఎక్కడో ఉన్న చందమామకు మనిషి వల్ల జరుగుతున్న నష్టం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
చంద్రుడికి పొంచి ఉన్న ముప్పేంటి?
ప్రపంచంలోని విలువైన ప్రదేశాలను అధ్యయనం చేసి వాటిని కాపాడడానికి..అప్రమత్తం చేయడానికి ఏర్పాటయిన వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్స్ అనే సంస్థ… మనిషి రూపంలో చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు గురించి షాకింగ్ నిజాలు భయటపెట్టింది. భూమికి సహజ ఉపగ్రహంగా ఉన్న చంద్రుడు.. ప్రస్తుతం సంక్షోభ చిహ్నంగా మారిపోయాడని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఈ సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం చంద్రుడిపై 90 ప్రాంతాలు హానికారకంగా మారాయట. దానికి కారణం మనిషే అన్నది ఆ సంస్థ చేస్తున్న అభియోగం.
ఎలా హానికరంగా మారుతుంది?
మానవులకు చంద్రుడిని 16వ శతాబ్దంలో గెలీలియో తన టెలిస్కోప్ ద్వారా చూసి రేఖాచిత్రంతో చంద్రుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తరువాత 1959లో రష్యా చంద్రుడిని కెమెరాలో బంధించింది. అప్పటి నుండి చంద్రుడిని చేరాలని దేశాల మధ్య విపరీతమైన పోటీతత్వం తయారయింది. ఆ తరువాత పదేళ్ళకు అమెరికా చంద్రుడి మీదకు తన వ్యోమగాములను పంపింది. చంద్రుని గురించి ఇప్పుడు మరింత తెలుసుకోవడానికి, దేశాలు, ప్రైవేట్ సంస్థలు, అంతరిక్ష పరిశ్రమలో కొత్తగా పోటీలు పడుతున్నాయి. 2023లో భారత్ చంద్రుని దక్షిణ ధ్రువంలో ఒక అంతరిక్ష నౌకను ప్రవేశపెట్టింది. నేటి ఆధునిక యుగంలో కొన్ని దేశాలు అంతరిక్షయానంలో పోటాపోటీగా తమ ప్రయోగాలు చేస్తూ మానవ అంతరిక్ష ప్రయాణం కోసం ప్రయత్నించడం, చంద్రుని ప్రాంతాలలో పర్యాటక ప్రయత్నాలు ప్రారంభించడం, గతంలో అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగాములు చంద్రుని పైన వదిలిన వ్యర్థాలతో అక్కడి ప్రదేశం హానికారంగా మారుతోందట.
ఉదాహరణకు 1969 సంవత్సరంలో అపోలో 11 ద్వారా నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్రుని మీద మొదటి మనిషి పాదముద్ర తో పాటు 120 వ్యర్ధ పదార్ధాలను వదిలి వచ్చారట. ఆ వ్యర్ధాలలో మానవ మలమూత్ర వ్యర్ధ ప్యాకెట్లు కూడా ఉన్నాయట. అంతే కాదు అంతరిక్షంలోకి వెళ్ళిన రాకెట్ తాలూకు ఇనుప వ్యర్ధాలు చాలానే ఉన్నాయట. ఇవన్నీ చంద్రని మీద వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయట.
టూరిజం పేరుతో సర్వనాశనం:
అంతరిక్ష పరిశోధనలు అవసరమే.. చంద్రుడి రహస్యాలను వెలికితీయడం కూడా అవసరమే..కానీ ప్రయోగాల పేరుతోనో… టూరిజం పేరుతోనే భూమికి ఉన్న సహజ ఉపగ్రహానికి హాని చేయడం..భవిష్యత్తులో విపరీత పరిణామాలకు దారితీస్తుందని వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్స్ సంస్థ మానవాళిని హెచ్చరిస్తోంది. చందమామపై పరిశోధనలు చేస్తూనే… అక్కడి సహజత్వం దెబ్బతినకుండా కాలుష్యకారకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది. చంద్రుడిని బాధ్యతాయుతంగా ప్రేమించేందుకు ఇదే సరైన సమయమని…చంద్రనిలో మచ్చని మనం అందంగా చూడాలి గానీ.. మచ్చ మనం ఎప్పటికీ కాకూడదని చెబుతోంది…
ALSO READ: కొంతమంది వ్యక్తులకు భయమే తెలియదా? మన మెదడు చెబుతున్న షాకింగ్ ఫ్యాక్ట్ ఇదే!

Breast Milk Uranium: తల్లి పాలల్లోనూ విషం.. సైంటిస్టుల స్టడీలో షాకింగ్ నిజాలు!
Human Brain: కొంతమంది వ్యక్తులకు భయమే తెలియదా? మన మెదడు చెబుతున్న షాకింగ్ ఫ్యాక్ట్ ఇదే!
Volcano Eruption: భయం పుట్టిస్తోన్న అగ్నిపర్వతం.. సముద్ర గర్భంలో పేలనుందా?
Tsunami: సునామీలను ముందుగానే కనిపెట్టే జంతువులు ఉన్నాయా? ఇది తెలిస్తే మీ ప్రాణాలు నిలబడతాయి!
Swiss Glacier Collapse: నిన్న స్విట్జర్లాండ్.. రేపు ఇండియా.. ఈ పాపం ఎవరిది?
Barry Wilmore: ఫైటర్ పైలట్ నుంచి వ్యోమగామి వరకు… బుచ్ విల్మోర్ ప్రయాణం!