Menu

Animal Cruelty: సంప్రదాయాల మాటున క్రూరత్వం.. ఏనుగు ప్రాణం తీస్తున్న మతఛాందసం!

Praja Dhwani Desk

‘రూపవతి..’ ఇదో ఏనుగు పేరు.. ఆర్థరైటిస్‌, అంధత్వం పాటు నడవలేని పరిస్థితిలో ఉన్న ఈ ఏనుగును తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక నుంచి తెచ్చుకుంది. మొహర్రం, బోనాల ఊరేగింపులకు ఈ ఏనుగునే వాడుకున్నారు భక్తులు. మోయలేనంత బరువును ఏనుగుపై పెట్టి, బాగా భక్తి బలిసిన వ్యక్తులను ఏనుగుపైకి ఎక్కించి వీధి వీధుల్లో తిప్పారు. అది నడవలేక ఏడుస్తుంటే దాని మర్మ అవయావల మీద గుచ్చుతూ హింసపెట్టారు. ఓ అంకుశంతో ఏనుగును నియంత్రిస్తూ దాని చెవులను పదేపదే లాగుతూ ఊరేగించారు. ఇదంతా రెండు మతపరమైన పండుగుల కోసం జరిగిన జీవ హింస. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్నుసన్నులో జరిగిన పండుగ..!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రితో చర్చల తర్వాత రూపవతిని దావణగెరె నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మొహర్రం బోనాల ఊరేగింపుల కోసం కొండా సురేఖ కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. అయితే ఏనుగును ఎక్కడికైనా రవాణ చేసేముందు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అటు కర్ణాటక అధికారులు రూపవతికి అలానే మెడికల్‌ పరీక్షలు చేసి అది పూర్తి ఫిట్‌గా ఉన్నట్టు సర్టిఫై చేశారు. ఇటు తెలంగాణ చేరుకున్న తర్వాత ఇక్కడి అటవీశాఖ అధికారులు సైతం అదే మాట చెప్పారు. అయితే పండుగల ఊరేగింపులో రూపవతి అసలు కదలలేకపోయింది.. కళ్లు కూడా తెరవని పరిస్థితిలో ముందుకు కదిలింది. ఇది యనిమల్‌ యాక్టివిస్టీల కంటపడింది. వెంటనే పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) లాంటి సంస్థలకు ఫిర్యాదులు చేశారు.

రూపవతి ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ప్రైవేట్ వైద్యులను సంప్రదించింది పెటా. దీంతో రూపవతికి మెడికల్‌ టెస్టులు చేశారు డాక్టర్లు. ఈ టెస్టుల ఫలితాలు చూస్తే కర్ణాటక, తెలంగాణ అటవీశాఖ అధికారులు ఎంత ఘోరం చేశారో అర్థమైంది. రూపవతికి చాలా కాలంగా అంధత్వం ఉంది. అతిగా పెరిగిన క్యూటికల్స్, పగిలిన ఫుట్ ప్యాడ్‌లు ఉన్నప్పటికీ రూపవతి ఆరోగ్యంగా ఉందని రాంగ్‌ మెడికల్‌ సర్టిఫికేట్ ఇచ్చారు అధికారులు. రూపవతి నడక ఆర్థరైటిస్‌తో పాటు కుంటితనం సంకేతాలను కూడా చూపిస్తోందని డాక్టర్లు తేల్చారు. ఈ విషయాన్ని కర్ణాటక, తెలంగాణ వెటర్నరీ కౌన్సిళ్లకు పెటా నివేదించింది.


జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సహా పలు నిబంధనలను రెండు రాష్ట్రాల అధికారులు ఉల్లంఘించారు. నిజానికి మొహర్రం, బోనాల ఊరేగింపులకు మెకానికల్ ఏనుగులను ఉపయోగించుకునే ఆప్షన్ ఉంది. ఈ మెకానికల్‌ ఏనుగులు నిజమైన ఏనుగులలానే కదలగలవు కూడా. అయినా కూడా జీవహింసనే భక్తులు పాటిస్తుండడం వారి స్వార్థాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. జంతువులను ఎంత హింస పెడితే అంత పుణ్యం వస్తుందనుకునే నమ్మకాలు, ఆచారాలు చాలా మతాల్లో కనిపిస్తాయి.

ఇలా జంతువులను హింస పెట్టి పండుగల చేసుకోవడం దాదాపు ప్రతీ ఫెస్టివల్‌కు చూసేదే! తమ దేవుడు హింసను కోరుకోడని ఓవైపు నీతి శుక్తులు చెబుతూనే మరోవైపు అదే దేవుడుకు జంతువులను బలి ఇవ్వడం సంప్రదాయంగా ఉంటుంది. రాళ్లు, విగ్రహాలు, ఆకారం లేని దేవుళ్లు ఎలాగో జంతు హింసను ఆపరు. వారి పేరును అడ్డం పెట్టుకోని మేం చేసే ప్రతీది దైవకార్యమేనని భావించే మతఛాందసుల అజ్ఞానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. వారి నుంచి మార్పు ఆశించడం అత్యాశే అవుతుంది..!

Also Read: మనుషులు చేసిన దేవుళ్ల కోసం మూర్ఖపు చేష్టలు.. ఈ చావులకు బాధ్యులు ఎవరు?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *