Menu

LGBTQ: మరణించిన తర్వాత కూడా వారిపై వివక్షే.. అంతిమసంస్కారాల కోసం ‘గే’ నరకవేదన!

Tri Ten B
The partner of the queer man had approached the Kerala High Court after the latter's family had refused to pay the medical bills and take the body from a private hospital in Kochi.

సహజ, అసహజాలు నిర్ణయించాల్సింది మనుషులు, ధర్మశాస్త్రాలు, న్యాయస్థానాలు కాదు. అది ప్రకృతికి సంబంధించిన అంశం. బయాలజీకి తెలిసిన విషయం. లెస్బియన్ రిలేషన్‌షిప్‌ అయినా, గే వివాహమైనా, ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమైనా అదంత వారి వ్యక్తిగతం. ఈ భూమ్మిద అనేక జీవులు హోమోసెక్స్‌లో పాల్గొంటాయి. మన ఏప్‌(ape) ఫ్యామిలీకే చెందిన గొర్రిల్లాలూ అందులో ఉంటాయి. కానీ ఎవరికి లేని నొప్పి మనుషులకే ఉంటుంది. ఎందుకంటే న్యాయఅన్యాయాలు, ధర్మఅధర్మాలు, మతం, మట్టి, బూడిద లాంటివి క్రియేట్ చేసుకున్నది మనుషులే. అందుకే జంతువులకు కులాలు, గోత్రాలు ఉండవు. అవి స్వేచ్ఛగా జీవిస్తాయి. మావన సమాజంలో మాత్రం అడుగడుగునా వివక్ష.. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో ప్రేమలో పడకూడదు.. అమ్మాయి మరో అమ్మాయితో కలవకూడదు. ఇక ట్రాన్స్‌జెండర్లనైతే ఇంటినుంచే గెంటేస్తారు. శరీరానికి సంబంధించిన అంశాలను అర్థంచేసుకునే కనీన జ్ఞానం లేని సమాజం మనది. ఇందుకు కేరళ(Kerala)లో జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. కన్నకొడుకు మరణిస్తే.. అతను ‘గే’ అనే కారణంతో కనీసం అంతిమసంస్కారాలు కూడా చేయడానికి ఇష్టపడని కుటుంబాలు ఎన్నో.. తాజాగా మరోసారి అదే ప్రూవ్‌ అయ్యింది!

వివాహ సమానత్వం లేని దేశం:
కేరళ-కొచ్చిలో మను-జెబిన్‌ ఓ గే(Gay) కపుల్‌. గతేడాది వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి కలిసే ఉంటున్నారు. ఇది వారి కుటుంబసభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. అప్పటినుంచి వారిని దూరంపెట్టారు. ఇక ఈ నెల(ఫిబ్రవరి)2న మను ప్రమాదాపుశాత్తూ ఇంటి టెర్రస్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలుపాలైన మను ఫిబ్రవరి 4న చనిపోయాడు. నిజానికి ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులు లేదా చట్టబద్ధంగా వారికి వారుసులైన వారు మృతదేహాన్నీ తీసుకోని వెళ్లాల్సి ఉంటుంది. అయితే మను ఫ్యామిలీ అతని మృతదేహాన్ని తీసుకోని వెళ్లేందుకు రాలేదు. అంతిమసంస్కారాలు చేయమని ఖరాఖండిగా చెప్పింది. ఇటు చట్టపరంగా జెబిన్‌కి మృతదేహాన్ని తీసుకెళ్లి అంతిమసంస్కారాలు నిర్వహించుకునే హక్కు లేదు. దీంతో మను మృతదేహాం దిక్కులేనిదిగా మారింది.

నాకు మృతదేహాన్ని అప్పగించండి ప్లీజ్:
మరణం తర్వాత మను అనాథగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోయిన జెబిన్‌ ఆస్పత్రి యాజమాన్యాన్ని వేడుకున్నాడు. తనకు మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా కోరాడు. అంతిమసంస్కారాలు తానే చేస్తానని ప్రాదేయపడ్డాడు. ట్రీట్‌మెంట్‌కు అయిన ఖర్చు రూ.1.5లక్షలు ‘గే’ కమ్యూనిటీ క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సంపాదించాడు కూడా. కానీ ఆస్పత్రి ఈ విషయంలో చేసేదేం లేదని జెబిన్‌కు అర్థమైంది. మృతదేహాన్ని కుటుంబసభ్యులు లేదా లీగల్‌ వారసులు క్లెయిమ్ చేసుకోకపోతే అది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అప్పగిస్తారు.

ఇవేం చట్టాలు?
అప్పటికీ మను చనిపోయి రెండు రోజులు అవుతుంది. ఫిబ్రవరి 6న కేరళ హైకోర్టును ఆశ్రయించాడు జెబిన్‌. తనకు మృతదేహాన్ని అప్పగించాలని పిటిషన్‌ వేశాడు. రెండు రోజుల పాటు దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కుటుంబసభ్యులే అంతిమసంస్కారాలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. అయితే జెబిన్‌ను అంతిమసంస్కారాలకు మను కుటుంబం అనుమతించాలని చెప్పింది. పోలీస్‌లు జెబిన్‌కు రక్షణగా ఉండాలని ఆదేశించింది. ఇష్టం లేకున్నా కోర్టు తీర్పుకు అనుగుణంగా మను కుటుంబం అతని మృతదేహానికి అంతిమసంస్కారాలు నిర్వహించింది. ఇక్కడ కోర్టు తీర్పు చట్టాలకు అనుగుణంగా ఉంది కానీ.. అసలి చట్టమే నైతిక విలువలకు విరుద్దంగా ఉంది. ఎందుకంటే జెబిన్-మను వివాహం జరిగినా అది చట్టబద్దం కానీ పెళ్లి. భారత్‌ ధర్మ చట్టాల ప్రకారం ఇండియాలో గే వివాహానికి ఇంకా చట్టబద్దత రాలేదు. గతేడాది(2023) అక్టోబర్ 17న LGBTQA+కు వివాహ సమానత్వం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Also Read: వన్నె తరగని ఆలోచనల వేదిక.. బుక్‌ ఫెయిర్!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *