Menu

Madhavi Latha Kompella: పోలింగ్ బూత్‌లో అతి… మేడం గారికి రూల్స్ కూడా తెలీదా?

Tri Ten B

మాధవీ లత అతికి అడ్డు అదుపు ఉండదు. హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరు ఫిక్స్ కాకముందు నుంచే దాదాపు ప్రతీ విషయంలోనూ అతిగా మాట్లాడడం ఆమె నైజంగా కనిపించింది. యూట్యూబ్‌ ఛానెల్స్‌కు ఇచ్చే ఇంటర్వూల్లో ఆమె వాదన వితండవాదంగా అనిపిస్తుంది. బీఫ్ తినేవారు అత్యాచారాలు చేస్తారని ఓ సందర్భంలో మాట్లాడిన ఈ మేధావి.. ఎన్నికల పోలింగ్‌ సమయంలోనూ ముస్లింలపై విషం కక్కారు. ముస్లిం మహిళలు దొంగ ఓట్లు వేస్తారంటూ వారి ముఖాలకు ఉన్న బుర్ఖాను తీసి అవమానించారు. మాధవీలతకు అనుమానం రావడంతో తప్పెమీ ఉండకపోవచ్చు.. ఎందుకంటే హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగిన ప్రతీసారి భోగస్‌ ఓట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. ముఖం చూపించకుండా ఓటు వేసిన వారే మళ్లీ మళ్లీ ఓటు వేస్తుంటారన్న ప్రచారమూ ఉంది. వేలుకు వేసే సిరా చుక్కను ఏదో రసాయనంతో మాయమయ్యేలా చేస్తారని చెబుతుంటారు. అయితే వీటికి ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలు లేవు.


ఇలా చేయడం కరెక్ట్ కాదు:
మాధవీలతకు డౌట్ అనిపిస్తే సంబంధిత అధికారులకు చెప్పాలి. అంతేకానీ బుర్ఖా వేసుకోచ్చినవారి ముఖాలను, ఓటర్‌ ఐడీని పదేపదే చూడడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేయడం అవతలి వారిని అవమానించడమే అవుతుంది. ఓటు వేసిన తర్వాత పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉండడం నిబంధనలకు విరుద్ధం కూడా. అయితే మాధవిలతకు ఇవేవి పట్టినట్టు లేవు.. ముస్లింలను అవమానించడమే పనిలా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది.

ఇటు ఈమె.. అటు ఆయన.. సరిపోయారు:
ఓవైపు మాధవీలత హైదరాబాద్‌లో హద్దుమీరితే అటు నిజామాబాద్‌లో ధర్మపూరి అరవింద్‌ ఇదే విధమైన గొడవ చేశారు. వీరి పార్టీ సిద్ధాంతాల వైపరిత్యం అలా ఉంటుంది మరి. ఏదైనా లీగల్‌గా, ఆఫీషియల్‌గా ముందుకు వెళ్లాలి కానీ అనవసరమైన పెత్తనం చలాయిస్తే తగిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మాధవీలతపై ఈసీ ఇప్పటికే సీరియస్‌ అయ్యింది. మహిళా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్ద బుర్ఖా తొలగించాలని కోరిన ఈమెపై పలు ఐపీసీ సెక్షన్ల కింద హైదరాబాద్‌ మలక్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: అబద్ధాలు, విద్వేషాలే మోదీ పునాదులు! అసలు ఎలక్షన్ కమిషన్ నిద్ర లేచేనా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *