Menu

The Real Kerala Story: ప్రగతికి మార్గం చదువే! కేరళ ప్రభుత్వం చెబుతున్న లింగ సమానత్వ పాఠాలు!!

Praja Dhwani Desk
Kerala's gender-neutral school textbooks show fathers in kitchens

‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌’ మూవీ గుర్తింది కదా..? భారతీయ సమాజం మహిళలను ఎలా చూస్తుందో కళ్లకు కట్టినట్టు చూపే చిత్రమది. అందులో ఓ సీన్‌ ఉంటుంది. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఇద్దరు మగవాళ్లు భోజనం చేసే సీన్‌.. సాంబార్ అన్నం తింటు అందులో ములక్కాయలను నోట్లో పెట్టుకోని పిప్పి పిప్పి చేసి ఆ డైనింగ్‌ టేబుల్‌ మీదే ఆ పిప్పిని పడేస్తారు మగవాళ్లు. అంతేకాదు అక్కడ మావయ్యగారు సొంతంగా చెప్పులు కూడా వేసుకోరు. ఆ చెప్పులను భార్య తన చేత్తో పట్టుకోని, తీసుకెళ్లి ఆయన కాళ్ల దగ్గర పెట్టాలి.. ఇదంతా పితృస్వామ్య దేశంలో దాదాపు చాలా ఇళ్లలో కనిపించే దృశ్యాలే. అన్నం తిన్న తర్వాత ప్లేటును కూడా వాష్‌ బెసిన్‌ దగ్గర పెట్టని వాళ్లు మన కళ్ల ముందే కనిపిస్తుంటారు. ఇక్కడ గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం లాంటివి అయితే చేయనే చేయరు. ఎందుకంటే ఇంటిపని, వంట పని మొత్తం చేయాల్సింది ఆడవాళ్లే. ఒకవేళ ఉద్యోగానికి వెళ్లినా వంట బాధ్యత మాత్రం భార్యదే. ఇదంతా మన సంస్కృతి, సంప్రాదాయం అట.. ఇలానే ఉండాలట.. మన చదువులు ఇలా ఉండకూడవని చెప్పవు.. అసలు చిన్నతనంలోనే కదా జెండర్‌ ఈక్వాలిటీ అంటే తెలియాల్సింది..

అందుకే కేరళ సర్కార్‌ ఆ దిశగా విప్లవాత్మక అడుగులు వేసింది. జెండర్‌ ఈక్వాలిటీని పిల్లలకు వివరంగా చెప్పేలా పాఠ్యపుస్తకాలను రూపొందించింది.

మన పితృస్వామ్య సమాజంలో మగవాడు ఇంటి పని, వంట పనిలో ఆడవారికి సాయం చేస్తే ఆడంగి వెధవ లాంటి పదాలతో దూషిస్తారు.. మగాడు అంటే ఈ పనులు చెయ్యకూడదు అని ముద్ర వేసేస్తారు. ఈ ఆధునిక సమాజంలో కూడా ఈ సంకుచిత ఆలోచనలో ఉంటున్నాం!

నాన్న.. నువ్వు ఎందుకు ఎలా చేయవ్?
రెండు నెలల సమ్మర్ హాలీడేస్‌ తర్వాత కేరళలో బడులు తెరుచుకున్నాయి. కొత్త కొత్త పుస్తకాలతో పిల్లలకు స్కూల్స్‌ వెల్కమ్‌ చెప్పాయి. ఈ సారి పుస్తకాల్లో మార్పులు చేర్పులు ఎక్కువే ఉన్నాయి. ముఖ్యంగా జెండర్‌-న్యూట్రాలిటీపై కేరళ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్‌ చేసింది. అందుకే వంటగదిలో భర్త, తండ్రి వంట చేస్తున్నట్టు.. భార్య, తల్లులకు సాయం చేస్తున్నట్టు ఫొటోలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూసిన పిల్లలు తమ ఇంటికి వెళ్లి తండ్రులను క్వశ్చన్ కూడా చేస్తున్నారు. ఒక తండ్రి కొబ్బరికాయ తొక్కుతున్న ఫొటోలను చూసిన ఓ అమ్మాయి ఆ చిత్రాన్ని నాన్నకు చూపించింది. ఇంట్లో ఎందుకు ఇలా చేయరు నాన్న అని అడిగింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తసంస్థ బిజినెస్‌ స్టాండర్డ్‌ రాసింది.


వంటతో పాటు మిగిలిన ఇంటి బాధ్యతలు ఒక మహిళలకే పరిమితం కాదని, తల్లిదండ్రులిద్దరూ పనిని పంచుకోవాలని కేరళ ప్రభుత్వ పుస్తకాలు చెబుతున్నాయి. చాలామందికి తెలిసో తెలియకో వంట, ఇంటి పని మహిళల బాధ్యత అనే అభిప్రాయం సమాజంలో తిష్ట వేసుకోని ఉంది. పిల్లలు కూడా ఇదే కరెక్ట్‌ అనుకొని పెరిగి పెద్ద అవుతుంటారు. ఎందుకంటే వాళ్లంతా తమ ఇంట్లో అమ్మ పనిచేయడాన్నే ఎక్కువగా చూస్తారు. ఇటు స్కూల్‌ బుక్స్‌లోనూ ఈ ఆలోచనా పద్దతి తప్పు అని చెప్పే పాఠాలు ఉండవు. అందుకే కేరళ ప్రభుత్వం పిల్లలకు జెండర్‌-న్యూట్రలిటీని బోధించాలని నిర్ణయించుకుంది.

UNDP ప్రకారం జెండర్‌-న్యూట్రసిటీ ఇండెక్స్‌లో భారత్‌ 108 ర్యాంక్‌లో ఉంది. ఇండియా కంటే ఆర్థికంగా వెనకబడిన దేశాల పరిస్థితి ఈ విషయంలో మెరుగ్గా ఉంది. అందుకే కేరళ పద్ధతిని మిగిలిన రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

సైంటిఫిక్‌ టెంపర్‌పైనా పాఠాలు:
సమానత్వం, న్యాయం అనే సూత్రాలకు ప్రాధాన్యమిస్తూ జెండర్ సెన్సిటివ్ టాపిక్స్‌ను సిలబస్‌లో యాడ్‌ చేసింది కేరళ ప్రభుత్వం. పోక్సో నిబంధనలు, ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, సైంటిఫిక్‌ టెంపర్‌పై బోధనలను కూడా పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF) నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రాలకతీతంగా సమాజంలో మంచి మార్పు కోరుకునే వారు అభినందిస్తున్నారు.

Also Read: 16 రూపాయల సంప్రదాయం వెనుక ఉన్న చరిత్ర తెలుసా? దీనికి నిజాంకు ఉన్న సంబంధం ఏంటి?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *