Menu

AP Political Violence: తెలంగాణ వారికి ఇది చేతకాదట.. ఏపీలో రాజకీయ వికృత క్రీడ!

Praja Dhwani Desk
andhar pradesh violence

ఏదో గొప్పకార్యం చేసినట్టు ఫీలవుతున్నారు ఏపీలోని కొందరు ప్రబుద్ధులు. తన్నుకు చచ్చి, కొట్టుకు చచ్చి ఇదేరా మా పల్నాడు పౌరుషం అని తొడ కొడుతున్నారు. రాళ్లు, రప్పలు, కర్రలు పట్టుకోని రక్తం వచ్చేలా రోడ్లపై పడి పిచ్చికుక్కల్లా కొట్టుకోవడం గొప్ప విషయమట. తెలంగాణ వారికి ఇది చేతకాదట.. తెలంగాణలో ఎన్నికల సమయంలో రక్తపాతం జరగకపోవడం వారి అసమర్థతట.. మమ్మల్ని చూడండి ఎలా వికృతంగా ప్రవర్తిస్తున్నామో అని గర్వంగా ఫీల్ అవుతున్నారు కొందరు ఏపీ ప్రజలు. ఇదంతా పచ్చిగా చెప్పాలంటే పిచ్చి.. ఇంకా చెప్పాలంటే ఒళ్లు కొవ్వెక్కి, తిన్నది అరగక చేసే పని. కులాల కోసం, పరువు కోసం రాజకీయ నాయకులు ఆడించే ఈ రాక్షసక్రీడలో అమాయకులు, సామాన్యులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

బలైపోతున్న అమాయకులు:
కమ్మోళ్లు, రెడ్లు, కాపులు.. వీరిలో కులపిచ్చి తలకెక్కినవారు మిగిలిన కులాలను తమ ఆటలో బొమ్మల్లా వాడుకుంటున్నారు. ఈ మూడు కులాలు చేస్తున్న దారుణాలు అన్నీఇన్నీకావు.. పల్నాడులో అయితే ఏకంగా హత్యలు చేసిన కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నవారే ఎన్నికల్లో పోటి చేశారు. వర్గ ఆధిపత్యం కోసం రెడ్లు రెడ్లపైనే దాడులు చేసుకుంటున్నారు. ఇందులో ఓ వర్గానికి కమ్మ పెద్దలు కొమ్ము కాస్తున్నారు. వీరంతా కొట్టుకోని చచ్చిపోతే దేశానికి వచ్చే నష్టమేమీ లేదు కానీ మధ్యలో అమాయకులపై ప్రతాపం చూపిస్తున్నారు. పల్నాడు జిల్లా కొత్తగణేశునిపాడులో ఎస్సీల ఇళ్లలపై పడ్డారు. టీడీపీ వర్గం ప్రకారం ఎస్సీలంతా వైసీపీ వైపే ఉంటారు. అందుకే వాళ్లను కొట్టచ్చు.. ఎందుకంటే వారంతా కర్రలు పట్టుకోని వైసీపీ నాయకుడి వెనకాలుంటారు. పల్నాడులో ఈ విధమైన ఘోరాలు కొత్తమీ కాదు.. ఇక్కడ మంచినీళ్లు లేక జనాలు విలవిలలాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా ప్రజాసమస్యలు అక్కడి పాలకులకు పట్టవు.. అసలు జనానికే పట్టవు.. వెనుకబాటుతనం కారణంగా పల్నాడు ఇంకా ఆటవీకంగానే కనిపిస్తుంది. అందుకే ఈ హింస!


నివురు గప్పిన నిప్పులా ఏపీ:
ఒక పల్నాడులో మాత్రమే కాదు.. ఈసారి హింసాత్మక ఘటనలు చాలా జిల్లాల్లో జరుగుతున్నాయి. ఆళ్లగడ్డలో మరోసారి భూమా అఖిలప్రియా వర్సెస్‌ ఏవీ సుబ్బారెడ్డి గ్రూపు గొడవలు భగ్గుమన్నాయి. అర్థరాత్రి అఖిలప్రియా ఇంటి బయట పహారా కాస్తున్న ఆమె బాడీగార్డ్‌ నిఖిల్‌ను హత్యచేసేందుకు ప్రయత్నించారు దుండగులు. ఇది ఏవీ సుబ్బారెడ్డి వర్గం పనేగా అక్కడి ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాడిపత్రి, చంద్రగిరితోపాటు చాలా ప్రాంతాల్లో హింస రాజ్యమేలుతోంది. ఈ స్థాయిలో గొడవలు జరగడం ఏపీలో చాలా అరుదు. ఈ ఘటనలు తప్పుబట్టాల్సిన సామాన్య జనం కూడా ఏదో ఒక వర్గంవైపే మాట్లాడుతుండడం బాధాకరం. ముఖ్యంగా పల్నాడు హింసను పౌరుషానికి చిహ్నంగా పలువురు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుండడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం.

Also Read: పోలింగ్ బూత్‌లో అతి… మేడం గారికి రూల్స్ కూడా తెలీదా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *