హాయ్.., మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కుటుంబంలో వరుసగా ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలు ఎందుకు పుడతారు? ఇది కేవలం అదృష్టమా? లేక దీని వెనక ఏదైనా సైన్స్ ఉందా? కొన్ని కుటుంబాల్లో ఎందుకు ఒకే లింగంవాళ్లు వరుసగా జన్మిస్తారు? దీనికి జన్యుశాస్త్రంతో సంబంధం ఉందా? లేక ఇంకేదైనా కారణం ఉందా? ఇలాంటివే కాదు… ఒకే పద్ధతిలో బతికే ఇద్దరు దంపతులకు, ఎందుకు ఒకరికి తక్కువ, మరొకరికి ఎక్కువగా అబ్బాయిలు లేదా అమ్మాయిలు పుడతారు? ఈ రోజు మనం ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. సిద్ధంగా ఉన్నారా మరి?
మన శరీరంలో పురుషుల దగ్గర XY క్రోమోజోమ్‌లు ఉంటాయి. మహిళల దగ్గర XX క్రోమోజోమ్‌లు ఉంటాయి . ఇక పిల్లల లింగం ఏది అనే విషయం… తల్లిదండ్రుల్లో ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా? ఇది పూర్తిగా తండ్రి మీద ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే తల్లి ఎప్పుడూ X క్రోమోజోమ్‌నే ఇస్తుంది. తండ్రి అయితే X ఇస్తే అమ్మాయి పుడుతుంది, Y ఇస్తే అబ్బాయి పుడుతాడు. దీని ఆధారంగా చూసుకుంటే… తండ్రి బీజంలో ఏ క్రోమోజోమ్ వస్తుందోననే విషయం నుంచే పిల్లల లింగం నిర్ణయమవుతుంది. ఇది సాధారణంగా 50-50 అవకాశంతో జరుగుతుంది. అయితే, కొన్ని కుటుంబాల్లో వరుసగా ఒకే లింగం పిల్లలు పుట్టడం ఎందుకు కనిపిస్తుంది?
ఇక్కడే సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే… ఒకసారి తండ్రి Y ఇచ్చాడు అంటే అబ్బాయి పుడతాడు… అదే మళ్లీ రెండోసారి కూడా Y ఇవ్వడం అంటే అది యాదృచ్ఛికమేనా?
సైన్స్ చెప్తుంది… ఇది పూర్తిగా చాన్స్ మీద ఆధారపడిన విషయం… కానీ కొన్ని గర్భాలయ పరిస్థితులు, తల్లి శరీరంలోని పీహెచ్ స్థాయి, డైట్, హార్మోన్ల ప్రభావం… ఇవన్నీ కూడా కొంత మేరకు ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకి… కొన్ని పరిశోధనలు తల్లి శరీరంలో పీహెచ్ ఎక్కువగా ఉంటే అమ్మాయిలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాయి. ఇంకొన్ని స్టడీస్.. పండ్లు ఎక్కువగా తింటే అబ్బాయిలు పుట్టే అవకాశాలు అధికమవుతాయని చెబుతున్నాయి. కానీ ఈవన్నీ మాత్రం 100% నమందగిన విషయాలు కావు.ఇవి గణితశాస్త్రంలో “ప్రొబబిలిటీ” అనే వ్యవస్థతో సరిసమానంగా ఉంటాయి.
చాలా మంది ఆడపిల్లలు పుడితే భార్యను నిందిస్తుంటారు. ఆడపిల్ల పుట్టడానికి భార్యే కారణమని హింసిస్తుంటారు.కానీ సైన్స్ పరంగా పుట్టాల్సింది అమ్మాయా? అబ్బాయా? అన్నది పురుషుడి చేతిలోనే ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. ఎవరు పుడితే ఏంటి? అమ్మాయి పుట్టకూడదా?
ఇంకొన్ని పరిశోధనలు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెబుతున్నాయి. ఒక ఫ్యామిలీలో తరతరాలుగా ఎక్కువగా అబ్బాయిలు పుడుతున్నారా? లేక అమ్మాయిలు పుడుతున్నారా? అంటే… అది తండ్రి వైపు నుంచి వచ్చే ఒక జీనెటిక్ ట్రెండ్ కావచ్చునని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ‘సె*క్స్ రేషియో జీన్స్’ అనే టెర్మ్ ద్వారా వివరించబడుతుంది. అంటే, కొందరి స్పెర్మ్‌లో Y స్పెర్మ్‌లు ఎక్కువగా ఉండవచ్చు… కొందరిలో X స్పెర్మ్‌లు ఎక్కువగా ఉండవచ్చు. ఈ బలాన్నే తండ్రి తన వారసుల్లోకి పంపించగలడని అర్థం.
సరే… ఈ సంగతులన్నీ మనం తెలుసుకున్నాం. కానీ, ఇవన్నీ కలిపి చెప్పే నిజం ఏంటంటే…మనిషి లింగం నిర్ణయమవ్వడం ఒక శాస్త్రీయ ప్రయోగం కాదు… అది ప్రకృతిలో జరిగే ఓ అద్భుత సంఘటన.మనము మాత్రమే అబ్బాయో అమ్మాయో అనే పరిమితితో చూడాలి అనుకుంటున్నాం.. కానీ ప్రకృతి మాత్రం ఎవరు కావాలో వారినే పంపిస్తోంది… అవసరానికి తగ్గట్టుగా. అందుకే వరుసగా ఇద్దరు అబ్బాయిలు పుట్టినా, ఇద్దరు అమ్మాయిలు పుట్టినా… అది తప్పు కాదు.. అదో పద్ధతి. అది ప్రకృతికే తెలిసిన రహస్యం. ఇదే నిజం..!
ALSO READ: నా మనసంతా ప్రశ్నల వలలో చిక్కుకుంది.. ఒక హత్యకు శిక్షగా మనం ఇంకో హత్య చేస్తున్నామా?

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
Moon Mining: చందమామకు తూట్లు పొడుస్తున్నారు.. ప్రపంచ దేశాల ఉన్మాద తీరు ఇది!
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?