Menu

WTC Finals 2025 : ఇక చోకర్స్ కాదు ఛాంపియన్స్! ఎన్నో ఏళ్ల ‘ఆశ ‘ను నిజం చేసిన బవూమా!!

Sumanth Thummala 8 months ago
southafrica beats australia WTC final

  • 1998KnockOuts Trophy (ఛాంపియన్స్ ట్రోఫీ) విజేత..ఆ తర్వాత 

1992,1999,2007,2015,2023 వన్డే వరల్డ్ కప్ ‌ సెమీఫైనల్స్ 1996-2011 క్వార్టర్ ఫైనల్స్, 2000,2002,2006,2013,2025

ఛాంపియన్ ట్రోఫీ సెమీ ఫైనల్స్

2009,2014 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ 2024 ఫైనల్స్

2 క్వార్టర్ ఫైనల్స్, 12 సెమీఫైనల్స్, 1 ఫైనల్

‘ఐసీసీ ఛాంపియన్స్’ అవ్వాలి అనే కల ముంగిట సౌతాఫ్రికా చతికిల పడ్డ సందర్భాలు ఇవి. అందుకే క్రికెట్ ప్రపంచంలో వారికి “చోకర్స్” అని ముద్ర వేశారు. దీనికి తోడు అపార్థైడ్ వల్ల 2 దశాబ్దాలు ఐసీసీ ఆ టీమ్‌ను బ్యాన్ చేయడం.. ఇలా దక్షిణాఫ్రికా క్రికెట్ ఎన్నో దెబ్బలు తిన్నది. ఆ దేశం నుంచి ఎందరో హేమా హేమీ క్రికెటర్లు ఆడిన వారి ఆశయం నెరవేరలేదు. కానీ వాళ్ళు ఆశను చంపుకోలేదు. వారి బెస్ట్ ఆట తీరని కనబరిస్తూ వచ్చారు.‌

temba bavuma

జూన్ 14, 2025 క్రికెట్ మక్కా అయిన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలో దిగుతూ, తమ కెరీర్‌లో ఇంతవరకు ఫైనల్స్ ఓడిపోని స్టార్క్ , హాజిల్ వుడ్, మోడ్రన్ డే దిగ్గజం స్టీవ్ స్మిత్ తో పాట్ కమ్మిన్స్ సారథ్యంలో మరొక కప్ కోసం బరిలో దిగింది.
కానీ వాళ్లకు అడ్డంగా నిలబడి గెలిచి చూపించాడు 5’4 అడుగుల టెస్ట్ కెప్టెన్ గా ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికా నాయకుడు టెంబా బవూమా.

” నా జీవితంలో కొన్ని పేర్లు నన్ను బాధించాయి, కొన్ని పట్టించుకోలేదు. నా నానమ్మ నాకు ‘టెంబా’ అనే పేరు పెట్టింది. ఎందుకంటే ఆ పేరికు అర్థం ‘ఆశ’. మన సమాజం కోసం ఆశ. మన దేశం కోసం ఆశ. ఆశ లేకుండా మనం ఏం చేస్తాం. ప్రపంచంలోనే‌ బెస్ట్ ను ఎదుర్కొనాలంటే అదే కావాలి.” ఇవి ఒక యాడ్ లో  టెంబా బవూమా 2023 లో అన్న మాటలు.‌ తన పేరులో ఉన్న “ఆశ”ను నిలబెడుతూ దక్షిణాఫ్రికా 27 ఏళ్ళ తర్వాత ఐసీసీ విజేతగా నిలబెట్టిన ఘనత తనదే.‌

కెప్టెన్ గా ఛాంపియన్ గా నిలబెట్టడమే కాకుండా బ్యాటర్ గా కూడా 13 ఇన్నింగ్స్ లో 59.25 ఆవరేజ్ తో 711 పరుగులు చేసాడు బవూమా.

south africa champions

“మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆసీస్‌ వాళ్ళు ‘చోక్’ అనే భయంకరమైన పదాన్ని ఉపయోగించడం మాకు వినిపించింది,” అని టెంబా బావుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్ అన్నాడు. “మేము చాలా నమ్మకంతో, కొన్ని సందేహాలతో ఫైనల్‌కు చేరుకున్నాము, మేము ఫైనల్స్ కు చేరుకున్న మార్గం గురించి కొందరికి సందేహాలున్నాయి. ఈ విజయం వాటిని అణచివేస్తుంది.
“ఒక ఫైనల్‌ను గెలిచి ఎన్నేళ్లయిందో తెలియదు. ఇప్పుడు మేము చరిత్రలో చెదిరిపోని గుర్తుగా నిలిచాము.ఎప్పుడూ జరగని ఓ ఘట్టంలో మేము భాగమయ్యాం.

ఎన్నో కోణాల్లో ఇది ఎంతో ప్రత్యేకంగా ఉంది. అలాగే, ఇది దక్షిణాఫ్రికా ఐక్యంగా ఉండే అవకాశాన్ని కూడా ఇస్తోంది. మన మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి కలిసి ఆనందించే ఓ కారణం ఇప్పుడు మనకు ఉంది.
ఇది మనది అని గౌరవంగా, ఆనందంగా స్వీకరించాలి.” – బవూమా.

166 ఏళ్ళ బ్రిటిష్ పాలనలో అణచివేతకు గురై ఇవాళ అదే బ్రిటిష్ గడ్డ మీద ఒకనాడు ఏ జాతి మీద వర్ణవివక్ష వల్ల టీం బ్యాన్ అయ్యిందో ఇవాళ అదే నల్ల జాతీయుడి సారధ్యంలో WTC ఫైనల్ గెలిచి చరిత్ర సృష్టించింది. WTC గద ను గెలిచిన మూడో టీంగా రికార్డుల్లోకి ఎక్కింది.‌ గెలుపు తర్వాత పొద్దు ఉద్వేగానికి గురైన ప్రోటియాస్ ఆటగాళ్లకు ఈ గెలుపు ఎంత ముఖ్యమో, అలాగే సౌతాఫ్రికా అభిమానులకు ఎంత ప్రత్యేకమో లార్డ్స్ మైదానంలో గెలుపుకు చేరువలో పరుగు పరుగుకు చేసిన వారు కేరింతలే నిదర్శనం.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)


ఈ విజయానికి ముందు సౌత్ ఆఫ్రికా 1998 ఛాంపియన్స్ ట్రోఫీ ఆ తర్వాత 2014 అండర్ 19 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ అండర్ 19 గెలుపుకు నాయకత్వం వహించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది మరెవరో కాదు ‘ఏడెన్ మార్క్‌రమ్’. టీం లో తన చోటు ప్రశ్నార్థకం అయినా సమయంలో ఇప్పుడు సెంచరీ చేసి ఈ ఫైనల్ గెలవడం లో అత్యంత కీలక పాత్ర పోషించాడు.

aiden markram wtc final 2014 2025
Image credits EspnCricinfo/instagram

మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయినా, 136 పరుగులు చేసి తను ఔట్ అయ్యే వరకు ఒక్క తప్పుడు షాట్ ఆడుకుండా గెలుపు తీరాలకు చేర్చాడు.‌ కెప్టెన్ బవుమా తో మ్యాచ్ ను మలుపు తిప్పిన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గత సంవత్సరం టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో కెప్టెన్ గా ఉన్న మార్క్‌రమ్ అప్పుడు చవి చూసిన భంగపాటును మళ్ళీ దరిచేరనివ్వలేదు.‌ తన కెరీర్ లో ఎన్ని సెంచరీలు చేసినా ఇది ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందనడటంలో సందేహం లేదు.

aiden markram

ఇక తనతో పాటు అదే U-19 టీం లో ముఖ్య పాత్ర పోషించిన మరో వ్యక్తి సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగీసో రబాడా. ఇప్పుడు ఈ విజయంలో తమ పాత్ర కూడా అమోఘం. 9 కీలక వికెట్లు తీసి టీం ను ముందు నిలబెట్టాడు.‌

kagiso rabada

Image credits: EspnCricinfo/instagram

“కెజీ (రబాడా) ఒక గొప్ప ఆటగాడు. కొన్ని రోజుల క్రితం నేను హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యుల జాబితా చూశాను. ఇంకొన్ని సంవత్సరాల్లో తననని కూడా ఆ జాబితాలో చూస్తాననిపిస్తోంది.”

అని కెప్టెన్ బవుమా అనడంలో అతిశయోక్తి లేదు. 29 ఏళ్లకే ప్రపంచంలోనే అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అది కూడా అద్భుతమైన 21.74 సగటుతో. ఇది సరిపోతుంది ఎందుకు బవుమా ఆ మాట అన్నాడో అర్థం చేసుకోవడానికి.

1887 లో ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య మొదలైన టెస్ట్ ఫార్మాట్ ఆ తర్వాత స్వచ్చమైన ఫార్మాట్ గా పేరొందింది. టీ20 ఆదరణలో టెస్ట్ ప్రాముఖ్యతను కొనసాగించాలి అనే లక్ష్యంతో 2019 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను ఐసీసీ మొదలుపెట్టింది. ఇప్పటివరకు జరిగిన మూడు ఫైనల్స్ లోను మూడు వేరువేరు టీంలు విజేతలు కావడం విశేషం.

ALSO READ: ఇది అభిమానం కాదు.. ఉన్మాదం..ఉగ్రవాదం.. బానిసత్వం..బుద్ధి లేని బతుకులు!


Written By

Sumanth Thummala is aContent Writer and the co-founder of Prajadhwani news. He works passionately toward creating positive change in the world through meaningful, responsible writing.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *