Menu

Work Culture in India: మన తోటి ఉద్యోగిని బానిసగా కాదు… అవకాశమిచ్చి కూర్చొనిద్దాం…!

Praja Dhwani Desk 3 months ago
toxic work culture in india

‘మన తోటి ఉద్యోగిని బానిసగా కాదు… అవకాశమిచ్చి కూర్చొనిద్దాం…’

ఈ ఒక్క వాక్యం… వినడానికి చిన్నదే కానీ లోపల గొప్ప సందేశం ఉంది. ఇది కేవలం వర్క్‌ ప్లేస్‌కు సంబంధించిన మాట కాదు… ఇది మన మనసు స్థాయికి సంబంధించిన విషయం.

సమస్య ఎక్కడ మొదలవుతుంది ?

నేటి ఉద్యోగ ప్రపంచంలో ‘నేనే బాస్’ అనే భావన చాలా మందిలో పెరిగిపోయింది. ఒకరు ఎదిగితే, మరొకరిని తక్కువగా చూసే అలవాటు మన మధ్య జెండా ఎగురేసుకుంది. మన సహోద్యోగి కష్టపడితే, మనం ఆ వ్యక్తి కృషిని గుర్తించకపోతే… ఆఫీసు అనే చోట, మనుషుల మధ్య గోడలు కట్టుకుంటున్నామనేది వాస్తవం. కానీ ఒకసారి ఆలోచించండి..! మనతో కలిసి పనిచేసే వాళ్లు మన సక్సెస్‌లో భాగస్వాములు కదా! వాళ్లు లేకుండా మనకు గెలుపు ఎలా వస్తుంది?

టీం వర్క్ అంటే ఇదేనా?

ఈ రోజుల్లో మనం టీమ్ వర్క్ అని చెబుతున్నాం కానీ టీమ్‌కి గౌరవం ఇవ్వడం మర్చిపోతున్నాం. టీమ్‌ మీటింగ్స్‌లో ప్రతి ఒక్కరి అభిప్రాయం వినకపోవడం, వారి ఆలోచనను చిన్నచూపు చూడటం లాంటివి బానిస మైండ్‌సెట్‌లో భాగమే కదా? ఒకరిని తక్కువ చేయడం వల్ల మనం ఎక్కువ అవ్వం. వారిని పక్కన కూర్చోబెట్టి వినడం వల్ల మన స్థాయి తగ్గదు, మన మనసు స్థాయి పెరుగుతుంది.

నిజమైన నాయకత్వం అంటే?

నిజమైన నాయకత్వం అంటే ఆఫీసులో నీ కుర్చీలో కూర్చోవడం మాత్రమే కాదు.. ఉద్యోగి పక్కన కూర్చుని ‘నువ్వు చేయగలవు’ అని చెప్పడం. బాస్‌గానో సీనియర్‌గానో కాకుండా, ‘మనోడు’ అని అనిపించడమే నిజమైన లీడర్‌షిప్.

చిన్న ఉదాహరణ

ఒక సీనియర్ ఉద్యోగి తన టీమ్‌లోని జూనియర్‌కి చెబుతాడు:
‘నువ్వు ఇలా చేస్తే బెటర్‌’ అని సలహా ఇస్తే. ఆ జూనియర్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ‘ఇలాగే చేయి, లేకపోతే నువ్వు పనికిరావు’ అని చెబితే అది సంబంధిత వ్యక్తిలో భయాన్ని, బాధను, దూరాన్ని మాత్రమే పెంచుతుంది.

ఎమోషనల్ కనెక్ట్:

మీకు తెలుసా, మన సహోద్యోగి మనతో పక్కన కూర్చొని మన అభిప్రాయాన్ని అడిగినప్పుడు… మన హృదయం ఎంత గర్వంగా ఉంటుంది? అదే గౌరవం, అదే మనసుకు ఇంధనం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక విలువ ఉంది. తమ మాటకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు,తమ ఆత్మగౌరవం కాపాడినప్పుడు, వారు మన కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారు.

సమాజానికి సందేశం:

మన సంస్థ, మన సమాజం, మన దేశం ముందుకు వెళ్లాలంటే..ముందుగా మనం ఈ మైండ్‌సెట్ మార్చుకోవాలి. ఎవ్వరినీ వెనక్కి నెట్టేసి మనం పైకి రాలేం. వాళ్లను పక్కన కూర్చోబెట్టి కలసి నడిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి… మన తోటి ఉద్యోగిని బానిసగా కాదు..పక్కన కూర్చొనిద్దాం. మనం ఫ్యామిలీ అనటం కాదు ఆ ఫ్యామిలీలో అందరి వాదన వినటం ముఖ్యం. అలాగే న్యాయం ఎటువైపు ఉందని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే, మనం పక్కపక్కన కూర్చుని పనిచేసినప్పుడు..మన మధ్య ఓ బంధం పుడుతుంది. ఆ బంధమే చివరికి సక్సెస్‌కి మార్గం చూపిస్తుంది.

“గౌరవం ఇచ్చే వాడే గెలుస్తాడు… బలవంతం చేసే వాడి దగ్గర భయం మాత్రమే ఉంటుంది.”
ఇదే నిజమైన లీడర్‌షిప్, ఇదే నిజమైన మనసు. మనం ఎక్కడ ఉన్నా.. గుర్తుంచుకోండి. ఒక నాయకుడు ఎప్పుడూ తన తోటి పని వారిని బానిసలుగా కాదు సహచరులుగా చూడాలి. ❤️

ALSO READ: నిజమైన ప్రేమంటే ఏంటో మర్చిపోయిన తరానికి ఓ జ్ఞాపకం! ఇంతకీ ప్రేమంటే బాధ్యతా… లేదా భారమా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *