Sexual Desire Tragedy: రోజంతా పని చేసి.. కొన్నిసార్లు గొడ్డుచాకిరి చేసి.. మోత, రోత పుట్టించే ట్రాఫిక్ సౌండ్లను దాటుకోని ఏ రాత్రికో ఇంటికి చేరుకునే వారి సంఖ్య సిటీల్లో లక్షల్లో ఉంటుంది. అటు టైర్-2, టైర్-3 సిటీల్లోనూ చాలామంది లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది కానీ ట్రాఫిక్ గోల కాస్త తక్కువ కావొచ్చు. అటు పల్లెల్లోనూ పగలంతా వ్యవసాయం చేసుకోని.. లేదా పక్క ఊర్లలో కూలీనాలీ చేసుకోని దంపతులిద్దరూ ఏ రాత్రికో ఇంటికి చేరుతారు. స్నానం చేసి భోజనం ముగించుకోని కునుకు తీసేందుకు పక్క ఎక్కుతారు. ఒకరి కౌగిల్లల్లో మరొకరు బంది అవుతారు.. అక్కడ నుంచి మాటలు, తర్వాత ఫోర్‌ప్లే, సె*క్స్, కడ్లింగ్.. అలా మాటల ముద్దుల మాయలోనే నిద్రలోకి జారుకోవడమన్నది దాదాపు అందరూ అనుభవించేదే. అయితే ప్రస్తుతం చాలా ఇళ్లలో ఇలాంటి పరిస్థితులు లేవంట.. మహిళల్లో లైంగిక వాంఛ తగ్గుతుందట.. ఫోర్‌ప్లేను అమితంగా ఇష్టపడే మహిళల్లో కొంతమందికి ఇప్పుడసలు అలాంటి ఆలోచనలే రావవడంలేదట.. ఇవి పరిశోధనలు చెబుతున్న మాటలు..! అవును..ఇది నిజం.. అతను ఊ అంటే.. ఆమె ఊహు అని ఎందుకు అంటుంది..? పడక గదిలో చిచ్చు పెట్టింది ఎవరు?
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
2020 ప్రారంభంలో ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా దాదాపు అందరి జీవితాలను ప్రభావితం చేసింది. కరోనా ఎఫెక్ట్ ఇప్పటికీ చాలామందిలో కనిపిస్తూనే ఉంది. ఈ వైరస్ మెదడు, గుండె, ఊపిరితిత్తులతో పాటు మొత్తం రోగనిరోధక వ్యవస్థపై నెగిటివ్ ప్రభావం చూపింది. ఇదంతా ఇప్పటివరకు డాక్టర్లు చెప్పిన మాటలు.. పరిశోధనలు తేల్చిన నిజాలు. అయితే ఇదే లిస్ట్‌లోకి సె*క్స్ కూడా వచ్చి చేరింది. కరోనా సోకి కోలుకున్న తర్వాత చాలా మందిలో పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బనిన్నదని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో లైంగిక వాంఛ మునపటిల లేదని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
తగ్గుతున్న సె*క్స్ ఫ్రీక్వెన్సీ:
ఈజిప్టులోని అస్సియుత్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 62 మంది మహిళలపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో 58శాతం మందికి లైంగిక కోరికలు లేవని తెలిసింది. ఇన్ఫెక్షన్ సోకిన 6 నెలల తరువాత సె*క్స్ ఫ్రీక్వెన్సీ తగ్గిందని అధ్యయనం తేల్చింది.
ఒత్తిడే ప్రధాన కారణమా?
కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులతో పాటు కొన్ని ఇతర రంగాలకు చెందిన కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని తీసుకొచ్చాయి. దీనికి అనేక అనుకూలతలున్నా అదే స్థాయిలో నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉద్యోగులపై పడింది. ముఖ్యంగా ఉద్యోగులతో కంపెనీలు ఓవర్ టైమ్ వర్క్ చేయించాయి. ఇది సె*క్స్ లైఫ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. అతిగా పనిచేయడం.. దీని కారణంగా అసలట, టార్గెట్లు రీచ్ అయ్యేందుకు వర్క్ టెన్షన్..ఇలా ఎన్నో కారణాలు ఉద్యోగులపై ఒత్తిడిని పెంచాయి. చాలామందిలో లైంగిక కోరికలు తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి అధికంగా ఉంటే సె*క్స్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. సోయి లేకుండా నిద్రపోవడం తప్ప ఏం చేయాలన్నా ఇంట్రెస్టు కలగని దుస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితే చాలా మంది మహిళలు ఫేస్ చేస్తున్నారని బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనాలు చెబుతున్నాయి. లైంగిక కోరికల పరంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నది ఈ అధ్యయనాల సారంశం.
పనివేళలతోనే సమస్య:
కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం సాకుతో పనివేళలను ఇష్టారీతిన పొడిగించాయి కంపెనీలు. ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ముగిసిన తర్వాత కూడా ఆఫీస్‌లోనూ ఉద్యోగులతో ఎక్కువ సేపు పని చేయించుకుంటున్న కంపెనీలు ఉన్నాయి. అటు దంపతలిద్దరు ఉద్యోగస్తులు అయితే ఇద్దరికి ఒకటే షిఫ్ట్ ఉండే పరిస్థితి చాలా తక్కువే. ఓవైపు పెరుగుతున్న కోరికలు.. మరోవైపు సె*క్స్‌కు టైమే దొరకని దంపతులు ఎక్కువగా సె*క్స్‌టింగ్‌ను అలవాటు చేసుకున్నారు. ఇలా రోమాన్స్ కూడా కృత్రిమంగా మారిపోయిన దుస్థితి దాపరించింది. ఇది ఓవరాల్‌గా సెక్స్ లైఫ్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది.
లైవ్ లెస్ సెక్స్:
సె*క్స్ లైఫ్ అంటే కేవలం పిల్లలు కనేందుకు అవసరమయ్యే అవయవాల కలయికే కాదు.. అందాలు, ఆనందాలు, ఆటలు, పాటలు, ఊసులు, ముద్దులు, హగ్గులు లాంటివి చాలా ఉంటాయి.. వీటన్నటికి కపుల్స్ దూరం అవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. సంభోగాన్ని ఎంజాయ్ చేసే మహిళలు ఇప్పుడు తరుచుగా నొప్పిని అనుభవిస్తున్నారని.. సె*క్స్ ఫ్రిక్వెన్సీ తగ్గడంతో పాటు కోరికలు తగ్గడమే దీనికి ప్రధాన కారణమంటున్నారు. ఇలా అనుభవిస్తున్న మహిళలు తప్పనిసరిగా మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది!
Also Read: వివాహాలు కావు.. వ్యాపారాలు..! ఇక్కడ అమ్మకానికి పెళ్లికొడుకులు!