Menu

HMPV-Corona: చైనాలో పడగ విప్పిన HMPV.. ఇండియాకు ముప్పు పొంచి ఉందా?

Praja Dhwani Desk 1 year ago
what is HMPV

సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రపంచంపై పెను ఉప్పెనలా విరుచుకుపడ్డ కరోనా ఇప్పటికీ అక్కడక్కడా తన ఉనికిని చాటుకుంటునే ఉంది. అయితే కరోనా ఓ సాధారణ జలుబు స్థాయికి పడిపోయి చాలా కాలమే అయ్యింది. దీంతో ప్రపంచమంతా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోంది. మాస్కులు తీసేసి హాయిగా బతుకుతోంది. అయితే ఇంతలోనే H..M..P..V అనే ఓ వైరస్‌ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రజలు గజాగజా వణికిపోతున్నారు. వైరస్‌ల అడ్డా చైనాలో విజృంభిస్తోన్న HMPV ఇప్పుడు జపాన్‌కూ వ్యాపించింది. మీరు గమనిస్తే ఈ రెండు కూడా ఇండియాకు కాస్త దగ్గర దేశాలే.. ఆసియాలో ఉన్న దేశాలే..! దీంతో భారత్‌కు HMPV ముప్పు పొంచి ఉందానన్న భయాలు నెలకొన్నాయి. అటు కరోనా తరహాలోనే HMPV ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుందా అని టెన్షన్ పడుతున్నవారు కూడా ఉన్నారు. ఇంతకీ HMPV అంటే ఏంటి? ఇది కరోనా లాగే ప్రపంచాన్ని వణికించనుందా?

HMPV ఎలా సోకుతుంది?

HMPV.. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్..! 2001లో మొదటిసారిగా నెదర్లాండ్స్‌లో గుర్తించిన ఈ వైరస్‌ 2025లో చైనా ప్రజలను ఆస్పత్రులకు క్యూ కట్టేలా చేస్తోంది. ఇది ప్యారామిక్సోవిరిడే కుటుంబానికి చెందిన వైరస్. ఇది సాధారణంగా శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. HMPV రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది రిస్పిరేటరీ సింకైటియల్ వైరస్-RSV తరహాలో ఉంటుంది. ఈ వైరస్ శ్వాస బిందువుల ద్వారా..అంటే Respiratory Droplets ద్వారా వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ము లేదా వైరస్ ఉన్న ఉపరితలాల ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్ బారిన పడితే జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే చిన్నపిల్లలు,వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో మాత్రం ఈ వైరస్‌ తీవ్రమైన సమస్యలకు కారణం కావొచ్చు.నిమోనియా, బ్రాంకియాలిటిస్ లాంటి ప్రాబ్లెమ్స్‌ ఫేస్ చేయవచ్చు.

పిల్లలూ జాగ్రత్త

HMPV కేసులు సాధారణంగా శీతాకాలంలో పెరుగుతాయి.చిన్నపిల్లలలో ఈ వైరస్ బాగా వ్యాపిస్తుంది. అయితే కరోనా మాత్రం భిన్నం. మీరు గుర్తు తెచ్చుకుంటే కరోనా చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపలేదు. అయితే ఈ రెండు వైరస్‌లూ కూడా శ్వాసకోశ బిందువుల ద్వారానే వ్యాపిస్తాయి. కానీ కరోనా HMPV కంటే వేగంగా వ్యాపిస్తుంది. ఇక రెండింటిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే కొవిడ్‌లో రుచి, వాసన కోల్పోవడం లాంటి ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. HMPVలో కనిపించవు. అటు కొవిడ్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే HMPVకు ప్రస్తుతం టీకా లేదు.

ఇండియా సేఫేనా?

ఇటు ఇండియా విషయాన్ని గమనిస్తే భారత్‌లో HMPV కేసులు నమోదు కాలేదు. ఇది సాధారణ జలుబు వైరస్‌లాంటి లక్షణాలను కలిగి ఉండడంతో ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదేని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలు సాధారణ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించడం, దగ్గు లేదా జలుబు లక్షణాలున్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఈ HMPV గురించి ప్యానిక్‌ కాకుండా అది ఎలా వ్యాప్తిస్తుందో, ఎలా నివారించాలో తెలుసుకుంటే చాలా ముఖ్యం. HMPV సాధారణమైన జాగ్రత్తలతో నియంత్రించగలిగే వైరస్. కరోనా స్థాయిలో భయపడాల్సిన అవసరం లేదు. ఏం కాదులే అని లైట్‌ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే… Don’t be Panic.. take precautions and trust that prevention is in your hands..!

ఇది కూడా చదవండి: ఎవరూ వినని,అర్థం చేసుకొని గోడు!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *