అయిపోయింది.. ఊహించిందే జరిగింది.. ట్రంప్(Donald Trump) ఇండియాకు పెద్ద బ్యాండ్ వేశారు..! బర్త్‌రైట్‌సిట్‌షిప్‌ని ఎండ్ చేసి పడేశారు..! అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పిన ట్రంప్ అన్నంత పనీ చేశారు. బర్త్‌రైట్ సిట్‌జన్‌షిప్ చట్టాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు ట్రంప్. దీనిపై ఇప్పటికే రచ్చ మొదలైంది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇమ్మిగ్రేషన్ గ్రూపుల కోర్టు గడపతొక్కాయి. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు వేశాయి. ఈ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని ఇమ్మిగ్రేషన్ మద్దతు గ్రూపులు చెబుతున్నాయి. ఇంతకీ ఏంటి బర్త్‌రైట్ సిటిజన్‌షిప్? ట్రంప్‌కు ఈ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఈ చట్టాన్ని రద్దు చేయడంతో ఇండియన్స్‌కు వచ్చే నష్టమేంటి?
అసలేంటి చట్టం?
బర్త్‌రైట్ సిటిజన్‌షిప్.. దీన్నే జనన హక్కు పౌరసత్వం అని పిలుస్తారు..! అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా అక్కడి పౌరులే. వారి తల్లిదండ్రుల జాతీయత లేదా వీసా స్థితి ఎలా ఉన్నా పుట్టిన వారు మాత్రం అమెరికన్లే. ఇది వలసదారులకు, ముఖ్యంగా ఇతర దేశాల ప్రజలకు, మరీ ముఖ్యంగా భారతీయులకు అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు ఒక మార్గం. ఉదాహరణకు ఒక ఇండియన్ కపుల్ అమెరికాలో తాత్కాలిక H-1B వీసా మీద పని చేస్తున్నారనుకుందాం..! వాళ్ళకు అక్కడే ఓ బిడ్డ పుట్టిందనుకుందాం.. అప్పుడు జనన హక్కు పౌరసత్వం నిబంధనల ప్రకారం ఆ బిడ్డ అమెరికా పౌరుడవుతాడు. దీని కారణంగా అక్కడ విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సేవలు లాంటి వివిధ సౌకర్యాలను ఆ బిడ్డ పొందవచ్చు. ఇక్కడ ఇంకో మేటర్ కూడా ఉంది. ఒకవేళ ఈ బిడ్డ తల్లిదండ్రులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నా సరే పుట్టిన బిడ్డకు మాత్రం యూఎస్ సిటిజన్‌షిప్ వర్తిస్తుంది. ఆ బిడ్డ ద్వారా ఇండియన్ పేరెంట్స్ అమెరికా పర్మనెంట్ రెసిడెన్సీ లేదా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్స్‌కు వచ్చే నష్టమేంటి?
నిజానికి భారతీయులకు అమెరికా అంటే మోజు ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఉద్యోగవకాశలు ఎక్కువ.. సంపాదించే జీతం కూడా ఎక్కువే.. ఇన్ని ఎక్కువలు ఉండడంతో ఏటా అమెరికాకు వలసవెళ్లే భారతీయుల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. 2024 లెక్కల ప్రకారం అమెరికాలో 54 లక్షల మందికిపైగా భారతీయులు ఉన్నారు. అయితే వారిలో రెండు లక్షలకు పైగా ఇండియన్స్ గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక 7 లక్షల 25 వేల మందికిపైగా ఇండియన్స్‌కు సరైన డాక్యుమెంట్స్ లేవు. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం వీరంతా అక్రమవలసదారులే. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు బర్త్‌రైట్‌సిటిజన్‌షిప్ చట్టాన్ని రద్దు చేయడంతో వీరందరికి వెన్నులో వణుకు మొదలైంది.
ఆ ప్రయోజనాలన్నీ దూరమైనట్టేనా?
ఇక జనన హక్కు పౌరసత్వం లేకపోతే, భారతీయ తల్లిదండ్రులకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ట్రంప్ నిర్ణయం తర్వాత అమెరికాలో పుట్టిన పిల్లలు ఆటోమేటిక్‌గా పౌరసత్వం పొందలేరు. ఇది ముఖ్యంగా H-1B వీసా లేదా ఇతర తాత్కాలిక వీసాలపై ఉన్న భారతీయ కుటుంబాలకు పెద్ద మైనస్ అవుతుంది. నిజానికి అమెరికా పౌరసత్వం పొందడమంటే చిన్న విషయం కాదు. భారతీయులు అమెరికాలో పౌరసత్వం పొందడం ద్వారా వారి పిల్లలకు విద్య, ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఫినాన్షియల్ ఎయిడ్, ఉద్యోగాల్లో స్పెషల్ ప్రియారిటీ లభిస్తుంది. అయితే జనన హక్కు పౌరసత్వం లేకపోతే ఈ అవకాశాలు తగ్గిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా పౌరసత్వం లేకపోతే విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనాలు చాలా వరుకు దూరమైనట్టే.
ట్రంప్‌కు ఎదురుదెబ్బ తప్పదా?
అయితే ఇక్కడ ఓ విషయాన్ని అందరూ గమనించాలి.. అమెరికాని నడుపుతున్నది.. నడిపిస్తున్నది వలసదారులే.. అందులో భారతీయుల పాత్రే ఎక్కువ..! భారతీయ అమెరికన్లు సంవత్సరానికి 25 లక్షల కోట్ల రూపాయలను పన్ను ద్వారా యూఎస్ ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అటు సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల్లో కీలకమైన బాధ్యతల్లో ఇండియన్సే ఉన్నారు. భారతీయుల్లో టెక్నికల్‌గా, నాన్‌టెక్నికల్‌గా స్కిల్ ఉన్న లక్షల మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. సంబంధిత కంపెనీల్లో ఇండియన్స్‌దే కీ రోల్. వారు లేకుండా ఆ కంపెనీలకు ప్రొడక్టవిటీ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మొత్తంగా అమెరికా ఆర్థికవ్యవస్థను గాడి తప్పేలా చేస్తోంది. ఇది ఆ దేశానికి ఏ మాత్రం మంచిది కాదు. మరోవైపు ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానాలను, నినాదాలను గట్టిగా నమ్ముతారు.. వాటినే ప్రోత్సహిస్తారు కూడా. అందుకే జనన హక్కు పౌరసత్వాన్ని ఎత్తివేయాలని సంతకం చేశారు. అయితే ఈ నిర్ణయానికి కోర్టుల నుంచి ట్రంప్‌కు అడ్డంకులు రావొచ్చు. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ చట్టం రద్దు నిర్ణయం అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధంగా ఉంది. ఈ సవరణను మార్చాలంటే రాజ్యాంగానికి సవరణ అవసరం. US రాజ్యాంగాన్ని సవరించడానికి, హౌస్‌తో పాటు సెనేట్ రెండింటిలోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ ఓటు కావాల్సి ఉంటుంది. ఇదంతా చేయకుండా ట్రంప్ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేయడాన్ని కోర్టులు ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: కూర్చున్న కొమ్మనే ట్రంప్ నరుక్కుంటారా? ఈ భయంకర లెక్కలు చూస్తే మీకే అర్థమవుతుంది!

USA WEAPONS: అమెరికా రాజకీయాల నీడలో నలిగిన మరో దేశం.. ఇది చాలా దారుణం!
Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
Jeffrey Epstein Files: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్.. కొత్త లీక్‌లో బయటపడిన సంచలన విషయాలు..!
Donald Trump Tariffs: ట్రంప్ తలతిక్క పనులు.. అమెరికాకే ఎసరు..ఈ లెక్కలే సాక్ష్యం!
Social Media Vetting: స్వేచ్ఛకు సంకెళ్లు.. సోషల్‌మీడియా పోస్టులను చెక్ చేస్తున్న ట్రంప్.. నెక్ట్స్ ఏం జరగనుంది?
Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!