Menu

Almond: బాదం గింజలతో గుండె సమస్యలు పరార్.. ఎలానో తెలుసా?


బాదం గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గుదలకు, గుండె ఆరోగ్యానికి బాదం చేసే మంచి అంతాఇంతా కాదు!


Sumanth Thummala
benefits of eating almond

బాదం పప్పు బలవర్ధకమైన ఆహార పదార్ధంగా అందరికీ సుపరిచితమే. భారతీయులు బాదంను ఎన్నో విధాలుగా వాడుతూ ఉంటారు. సాధారణంగా నేరుగా లేదా నీళ్లలో నానబెట్టి తీసుకుంటారు. అలానే స్వీట్లలో బాదంపప్పును పెద్ద ఎత్తున వాడుతూ ఉంటారు. ఇలా మన భారతీయుల్లో బాదం పప్పు వాడటం అనేది సాధారణం అయిపోయింది. పైగా కరోనా మహమ్మారి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుదలకు డ్రై ఫ్రూట్స్ ఉపయోగపడతాయని తెలిసి వీటి వాడకం ఇంకా ఎక్కువ పెరిగింది. డాక్టర్లు న్యూట్రిషనిష్ట్‌లు కూడా రోజూ డైట్ లో 30-50 గ్రాములు చేర్చుకోవాలని చెబుతున్నారు.

పుష్కలంగా ఫైటోకెమికల్స్:
బాదం తీసుకోవడం వల్ల కలిగే నిర్దిష్ట ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.‌ ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇతర గింజలతో పోలిస్తే ఈ బాదంలో అత్యధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, మోనోశాచురేటెడ్ & పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఐరన్, కాల్షియం, ఫోలేట్ ఉన్నాయి. బాదంపప్పులో విటమిన్-ఈ, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫ్లేవోనోయ్ లాంటి ఫైటోకెమికల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.

what happens if you eat almond every day

 

100 గ్రాముల బాదం పప్పులో  ఏం ఉంటుందంటే?
కేలరీలు – సుమారు 600
ఫైబర్: 10.8 గ్రా
కొవ్వు: 51.1 గ్రా
కాపర్: 0.91mg
మెగ్నీషియం: 258 మి.గ్రా
పొటాషియం: 503mg
బయోటిన్: 57 mcg
కాల్షియం: 254 మి.గ్రా
ప్రోటీన్: 21.4 గ్రా

గుండె జబ్బులకు కూడా చెక్:
బాదం గింజలను నిరంతరం తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-ఇ, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను, బీపీ ని స్థిరీకరించడం లో సహాయం చేస్తుంది. అధిక ప్రోటీన్లు, పీచుపదార్థాల, తక్కువ పిండి పదార్ధాలతో, తక్కువ క్యాలరీలతో బరువు తగ్గించడానికి సాయంచేస్తుంది. విటమిన్-ఇ కంటికి మంచిది. పీచుపదార్థాలు కడుపులో మలబద్ధకం రాకుండా సహాయపడుతుంది. ఇలా బాదం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రోజువారీ ఆహారంలో తీసుకోవడం మంచిది.

గమనిక: ఈ ఆర్టికల్‌ ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ కథనంలో పేర్కొన్న అంశాలకు ‘ప్రజాధ్వని న్యూస్‌’ ఎలాంటి బాధ్యత వహించదు.

Also Read: అతిగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? మీ కిడ్నీలు ప్రమాదంలో పడినట్టే.. ఎలాగంటే?


Written By

2 Comments