Menu

Tollywood Casting Couch: ఎవరిని కాపాడడానికి ‘మా’ తాపత్రయం? బడాబాబులంతా అంతేనా?

Tri Ten B
tollywood casting couch

‘అమ్మాయిలు కనిపిస్తే.. ..వెళ్లి ముద్దు పెట్టడమే…లేకుంటే కడుపు చేసేయడమే..’ ఈ మాటలన్న హీరో ఎవరో గుర్తింది కదా.. 2016లో సావిత్రి ఆడియో ఫంక్షన్‌లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన కామెంట్లు ఇవి.. అమ్మాయిల పట్ల మన తెలుగు బడాబాబులకు ఉన్న ఉద్దేశ్యం ఏంటో చెప్పేందుకు ఈ డైలాగ్‌ చాలు. ఎందుకో ఏమో కానీ టాలీవుడ్‌కు మహిళా ఆర్టిస్టులంటే చిన్నచూపే. వారిని అదోలా చూడాల్సిందే.. ఎదురుతిరిగితే ఇండస్ట్రీలో వారి అడ్రెస్‌ లేకుండా గల్లంతు చేయాల్సిందే. ఇది ఏ ఒక్కరి గురించో చెబుతున్న విషయాలు కాదు. క్యాస్టియిజం, నెపోటిజం, కామం కలగలిపిన ఇండస్ట్రీ మనది. ఇప్పుడైతే జానీ మాస్టర్‌ దొరికాడు.. అటు త్రివిక్రమ్‌ లాంటోళ్లు దొరకలేదని పూనమ్ కౌర్‌ అంటున్నారు.. ఈ సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌-మా రియాక్ట్ అయిన తీరు మరింత దారుణంగా అనిపిస్తోంది.

మీడియా ముందుకు ఎందుకు రావొద్దు?

మీకు ఏదైనా సమస్యలుంటే మా దగ్గరకు రండి.. మీడియా దగ్గరకు వద్దు.. ఇది మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్‌ మాట! అసలు మీడియా ముందుకు బాధితులు ఎందుకు వెళ్తారు? అసోసియేషన్‌లో న్యాయం జరగదమోనని నమ్మకంలేకనే కదా? మరి ఆ నమ్మకాన్ని కల్పించాల్సిన అసోసియేషన్‌ ఆ మేరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఆడవాళ్లకు టాలీవుడ్‌ ఇండస్ట్రీ సేఫ్‌ కదాన్న వాదన దశాబ్దాలుగా ఉంది. ఇది నిజం కాబట్టే కొంతమంది ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు.. మరికొందరు సోషల్‌మీడియా ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు!

అసలు రియాక్టే అవ్వరేంటి?

సమంత, అనుష్క లాంటి టాప్‌ హీరోయిన్లు సైతం టాలీవుడ్‌లో ఆడవాళ్ల భద్రతాపై ప్రశ్నలు లేవనెత్తారు. మళియాళి ఇండస్ట్రీ హేమ కమిటీ తరహాలో టాలీవుడ్‌లోనూ ఓ కమిటీ ఉండాలని అభిప్రాయపడ్డారు. అటు ఇండిస్ట్రీలో మహిళా ఆర్టిస్ట్‌ల సేఫ్టీ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనా ఉంటుంది. నిజానికి ఏ ఇండస్ట్రీలో అయినా క్యాస్టింగ్‌ కౌచ్‌ లాంటి సమస్యలు ఉన్నాయి. అయితే టాలీవుడ్‌ పెద్దలు మాత్రం అసలు ఇలాంటి సమస్యలేవి లేనట్టే ప్రవర్తిస్తుంటుంది. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పెద్దగా రియాక్ట్ అయ్యింది కూడా లేదు.

ఫిర్యాదు చేయాలన్న భయమే

మరోవైపు ఫిలిం ఛాంబర్‌ మాత్రం బాధ్యతగానే ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ జానీ మాస్టర్‌ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్‌ను తాత్కాలికంగా తప్పించాలని కమిటీ సంబంధిత అసోసియేషన్‌కు తేల్చి చెప్పింది. అయితే ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు గతంలో నమోదయ్యాయని, కొన్ని తమ దృష్టికి రావడం లేదంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ.

అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలకు పరిశ్రమ తరపు భరోసా లేకపోవడం వల్లే ఇష్టారీతిన ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నది తమ్మారెడ్డి లాంటి వారి మాట. నిజానికి టాలీవుడ్‌లో విమెన్‌ సేఫ్టీ గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వం గతంలో ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ రిపోర్టు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఆ రిపోర్టులో ఏముందో తెలిస్తే పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు అవకాశం ఉంటుందని ఝాన్సీ అంటున్నారు.

కంప్లైంట్ ఇస్తే భవిష్యత్‌ నాశనం

టాలీవుడ్‌ అంటేనే బడాబాబుల ఫ్యామిలీలకు అడ్డా. స్టార్‌ ప్రొడ్యూసర్ల నుంచి హీరోల వరకు రెండు, మూడు కులాలకు చెందినవారే ఎక్కువగా ఉంటారు. వీరికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోవడం ఖాయమన్న వాదన ఉంది. అందుకే సాహసం చేసి బాధిత మహిళలు ముందుకు రావడంలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీడియా ముందుకు వెళ్లొద్దు లాంటి స్టేట్‌మెంట్లను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ పాస్‌ చేస్తుండడం విడ్డూరంగా అనిపిస్తోంది. ఎవర్ని కాపాడడం కోసం ఇలా మాట్లాడుతున్నారో మరి. గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేయడమేంటో అర్థంకాదు.. ఎక్కడైనా బాధితుల సమాచారన్ని గోప్యంగా ఉంచుతారు కానీ ఇండస్ట్రీలో మాత్రం తప్పు చేసిన వారి పేరు బయటకు చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచుతారు!

ఇది కూడా చదవండి: 24ఏళ్ల నెత్తుటి మరక.. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకం.. అసలు విద్యుత్ పోరాటానికి కారణమేంటి?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *