Menu

Tollywood Casting Couch: మీకేందుకు ఇంత డాబు..! సినిమాల్లోనే హీరోలు.. అసలు నిజస్వరూపం మాత్రం ఇదే..!

Tri Ten B 1 year ago

పూజలందుకుంటారు.. పాలాభిషేకాలు చేయించుకుంటారు.. కొన్నిసార్లు జంతుబలులు కూడా కోరతారు.. టాలీవుడ్‌ సినీ అభిమానులను బానిస భక్తులగా మార్చిన బడా హీరోలు క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో మాత్రం ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లడరు. రజనీకాంత్‌కి అయితే మళియాళి ఇండస్ట్రీలో పెను ప్రకంపనలు సృష్టించిన హేమ కమిటీ గురించే తెల్వదట.. ఆయన వినలేదట..! ఆయనేం సూపర్ స్టారో ఏమో.. ఇటు టాలీవుడ్‌లో జానీ మాస్టర్‌ ఎపిసోడ్‌లో ఇండస్ట్రీ టాప్‌ హీరోల మౌనం వారి నిజస్వరూపాన్ని బయటపెడుతోంది. డూప్‌లు పెట్టుకోని స్టంట్స్‌ చేస్తూ సినిమాల్లో హీరోయిన్లను కాపాడే హీరోలు రియల్‌ లైఫ్‌లో మాత్రం ఇండస్ట్రీ అమ్మాయిలకే అన్యాయంగా జరుగుతుంటే పట్టిపట్టనట్టు ప్రవర్తిస్తుండడం అత్యంత దుర్మార్గం!

వీళ్లకేం పట్టదా?

క్యాస్టింగ్‌ కౌచ్‌ దాదాపు అన్నీ సినీ ఇండస్ట్రీలోనూ ఉంటుంది. లేదని ఎవరైనా చెబితే అది పచ్చి అబద్ధమే అవుతుంది. జానీ మాస్టర్‌ ఎపిసోడ్‌లో ఇండస్ట్రీ పెద్దల మౌనం అబద్ధం కంటే పెద్ద ఘోరం. ఎందుకంటే ఇండస్ట్రీ మంచి కోసం టాలీవుడ్‌లో ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఖండించడంతో పాటు వారిపై చర్యల తీసుకునేలా సంబంధిత శాఖలను కోరాల్సిన బాధ్యత టాప్‌ హీరోలపై ఉంటుంది. అయితే అసలు అలాంటివేవి చేయకపోగా ఈ విషయం గురించి పట్టనట్టే వ్యవహారిస్తుండడం దారుణమైన విషయం!

ఒక్క మాట కూడా మాట్లడరా?

నిజానికి దేశంలో వేధింపులు ఎదుర్కొని సినీ నటులు ఎంతమంది ఉన్నారో లెక్కించాలంటే పెద్ద సమయం పట్టదు. దాదాపు ప్రతీ మహిళా ఆర్టిస్టూ బాధితురాలే. అయితే వీటిని అంగీకరించడానికి కొంతమంది మగవాళ్లకి అహం అడ్డొస్తుంటుంది. ముఖ్యంగా తామేదో దేవుళ్లతో సమానం అని ఫీల్‌ అయ్యే సినీ పెద్దలకు ఇది కాస్త ఎక్కువే ఉండి ఉంటుంది! అందుకే కాబోలు ఇండస్ట్రీలో ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నా అటు స్టార్‌ హీరోయిన్లు గొంతెత్తున్నా పెద్ద హీరోలు మాత్రం తమకేమీ పట్టనట్టే ప్రవర్తిస్తున్నారు. సమంత, అనుష్కశెట్టి లాంటి హీరోయిన్లు ఇండిస్ట్రీలో మహిళల సేఫ్టీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంటే బడా హీరోలు మాత్రం కనీసం వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరం!

ఆ నివేదిక మాటేంటి?

మళియాళి ఇండస్ట్రీలో పెను ప్రకంపనలు సృష్టించిన జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక తర్వాత తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక సినీ పరిశ్రమలలోనూ సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్‌లు మహిళా ఆర్టిస్టుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో టాలీవుడ్‌లో మహిళల సేఫ్టీపై రెండేళ్లుగా వెలుగు చూడని నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సమంత కూడా ఆ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. మిగిలిన మహిళా యాక్టర్లు కూడా ఇదే విషయాన్ని డిమాండ్‌ చేశారు. అయితే ఇండస్ట్రీ బడాహీరోలు మాత్రం అసలు ఇది తమకు సంబంధించిన అంశమే కాదనట్టే ఉంది.

ఇటు కేవలం తెలుగు ఇండస్ట్రీ బడా హీరోలే కాదు.. తమిళంలో గాడ్‌ స్టాటస్‌ అనుభవిస్తున్న రజనీకాంత్‌ సైతం ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు. కమల్‌ కూడా ఏమీ మాట్లడలేదు. ఇటివలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ కూడా ఏం స్పందించలేదు. ఈ హీరోల కోసం సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌ పిచ్చిగా గొడవపడతారు. చాలాసార్లు హీరోల కోసం తన్నుకోని అభిమానులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇంట్లో అమ్మా-నాన్న కంటే ఎక్కువగా హీరోలనే ప్రేమించేవారు చాలామంది మన కళ్ల ముందే కనిపిస్తుంటారు. నిజానికి ఇది బానిస మనస్తత్వానికి నిదర్శనం. అయితే ఇలా ఉండొద్దని ఏ హీరో చెప్పడు.. వారికి కూడా ఫ్యాన్స్‌ ఇలా ఉండడమే కావాలి. అటు ఫ్యాన్స్‌ కూడా వారి హీరో ఏది చేస్తే అదే కరెక్ట్‌ అంటుంటారు. అందుకేనేమో మహిళా ఆర్టిస్టుల బాధలు ఫ్యాన్స్‌కు కూడా పట్టడంలేదు.

ఇది కూడా చదవండి: ఎవరిని కాపాడడానికి ‘మా’ తాపత్రయం? బడాబాబులంతా అంతేనా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *