Menu

Tirumala Laddu Row: ‘దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు..’ సుప్రీంకోర్టులో ఏపీ సీఎంకు ఘోర అవమానం!

Praja Dhwani Desk
supreme court TTD politics

‘దేవుడితోనే రాజకీయాలా? రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులు కొంత బాధ్యతతో బహిరంగ ప్రకటనలు చేయాలి..’ తిరుమల లడ్డూ ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబుపై సాక్ష్యాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలివి! లడ్డూలో బీఫ్‌ కలిపారని, పంది కొవ్వు కలిపారని నానా రచ్చ చేసిన కూటమి నేతలు సుప్రీం కామెంట్స్‌తో వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నారు. సుప్రీం వ్యాఖ్యలను చంద్రబాబు అనుకూలిత మీడియా కనీసం ఓ వార్తగా కూడా టెలిక్యాస్ట్ చేయాలేదంటే కూటమీ నేతలకు జరిగిన ఘోర అవమానమేంటో అర్థం చేసుకోవచ్చు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లు సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారం లేదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టడం కూటమి నేతలకు మింగుడుపడడం లేదు!

chandrababu pawan purendeswari

అసలేం జరిగింది?

2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 18న చంద్రబాబునాయుడు, జనసేన అధినేత జనసేన మీడియాతో మాట్లాడారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఇంతలోనే చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ అంశాన్ని ప్రస్థావించారు. వైసీపీ హయంలో తిరుమల లడ్డూ కల్తీకి గురైందని బాంబు పేల్చారు. ఇది జరిగిన మరుసటి రోజే టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఓ ల్యాబ్‌ రిపోర్టును పట్టుకోని మీడియా ముందుకొచ్చారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారిస్తున్నట్టుగా ఓ రిపోర్టును చూపించారు. ఈ ల్యాబ్‌ గుజరాత్‌లో ఉంది. ఈ రిపోర్టును పట్టుకోని టీడీపీ,జనసేన, బీజేపీ నేతలు జగన్‌ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. నాస్తికుడని ప్రచారం చేస్తూ భూమన కరుణాకర్‌ రెడ్డిని, క్రైస్తవుడైన జగన్‌ ను,  పనిగట్టుకోని తిరుమలను నాశనం చేయాలని చూశారని ప్రచారం చేశారు.

ఇంత మత విద్వేష రాజకీయాలా?

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్త దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావలకు సంబంధించిన అంశంగా మీడియా కథనాలు రాసుకొచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నమే జరగలేదన్న విమర్శలున్నాయి. బాధ్యతగా ప్రవర్తించాల్సిన మీడియా సైతం ఈ విషయాన్ని మత విద్వేషాలు వ్యాప్తి చేసేందుకు వాడుకుందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ ఏపీలో హిందువులను రెచ్చగొట్టే విధంగా స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం సంచలనం రేపింది. హిందువులు బయటకు రావాలని.. చేతులు ముడుచుకోని ఇంట్లో కూర్చోవద్దంటూ పవన్‌ చేసిన మాటలు అగ్గికి ఆజ్యం పోశాయి. సోషల్‌మీడియాలో జనసేన కార్యకర్తలు క్రైస్తవ, ముస్లిం మతాల లక్ష్యంగా విద్వేషాన్ని వెళ్లగక్కారు.

డిక్లరేషన్‌ రచ్చ

అటు తమపై అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలను ఎదుర్కొవడానికి వైసీపీ కోర్టుల గడపతొక్కింది. అటు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుమల లడ్డూ ఎపిసోడ్‌లో అసలు నిజాలు బయటపెట్టాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇక ఈ నాలుగు రోజుల్లో ఏపీ గతంలో ఎన్నడూ చూడని మత రాజకీయాలను చూసింది. మాజీ సీఎం జగన్‌ ఈ నెల 28న తిరుమల వెళ్తానని చెప్పడం.. ఆ వెంటనే పోలీసులు తిరుపతిలో 30యాక్ట్‌ను తీసుకురావడం.. మరోవైపు టీటీడీ డిక్లరేషన్‌పై జగన్‌ సంతకం పెట్టాలని కూటమీ నేతలు డిమాండ్‌ చేయడం ఏపీ రాజకీయాలను మరింత దిగజార్చాయి. ఈ క్రమంలో తిరుమల పర్యటనను సైతం జగన్‌ రద్దు చేసుకున్నారు.


సెప్టెంబర్ 30న సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఇతర పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఏపీ సీఎం చంద్రబాబుపై సీరియస్‌ అయ్యింది. ప్రాథమికంగా, ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లు చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవని గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. చంద్రబాబు అసలు మీడియాకు కల్తీ జరిగిందని చెప్పాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించింది. భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవించాలని మొట్టకాయలు వేసింది. జూలైలో రిపోర్టు వచ్చిందని చంద్రబాబు చెప్పారని.. మరి అప్పుడే బయట పెట్టకుండా సెప్టెంబర్ 18వరకు ఎందుకు ఆగారని ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా లేనప్పుడు అసలు తిరుమల లడ్డూ కల్తీకి గురైందని చంద్రబాబు ఎలా నిర్ధారణకు వచ్చారని ప్రశ్నించింది. ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లు సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారం లేదని చెప్పింది.

సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు

➔ కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించారు ?

➔ ఆ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్లు ఆధారాలేంటి ?

➔ నెయ్యిని ఎప్పుడు పరీక్షలకు పంపారు ?

➔ లడ్డూలను టెస్ట్ చేశారా..?

➔ లడ్డూలో కల్తీ జరిగిందని తేలిందా?

ఇలా వరుస పెట్టి సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వ లాయర్‌ వద్ద సమాధానమే లేకపోయింది. ఇక సుప్రీంకోర్టు కామెంట్స్‌తో చంద్రబాబు మరోసారి టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారిపోయారు. ఓ బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి విద్వేషపు రాజకీయాలకు తెరతియ్యడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: మీకేందుకు ఇంత డాబు..! సినిమాల్లోనే హీరోలు.. అసలు నిజస్వరూపం మాత్రం ఇదే..!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *